ఇకనుంచి 52వేల మంది  ఆర్టీసీ  ప్రభుత్వ ఉద్యోగులే : జగన్

Suma Kallamadi

అసెంబ్లీ సమావేశంలో భాగంగా జనవరి 1వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికులంతా ప్రభుత్వ ఉద్యోగులే అని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తెలియచేయడం జరిగింది. నేడు (సోమవారం) ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లుకు శాసనసభ ఆమోదం తెలియచేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడుతూ... 52వేల మంది కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణంలోకి తీసుకోవడం జరిగింది అని తెలియచేయడం జరిగింది.

 

ఇక గతంలో అధికారంలో ఉన్న అయిదేళ్లపాటు చంద్రబాబు అసలు ఆర్టీసీ కార్మికులను పట్టించుకోలేదు అని ఆరోపణలు చేశాడు. అలంటి  ఇప్పుడు ఎందుకు టీడీపీ నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు  అని  జగన్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ప్రైవేట్‌ రంగ సంస్థల్లోని ఉద్యోగులు... ప్రభుత్వంలో విలీనం చేయకుండా గతంలో చంద్రబాబు చట్టం తెచ్చిన విషయాన్ని సీఎం  గుర్తు చేయడం జరిగింది. 1997లో చంద్రబాబు తెచ్చిన చట్టం అడ్డంకిగా మారిందని, అందుకే ఆర్టీసీ విలీనం ముఖ్యమైన అంశం కోసం చారిత్రాత్మక బిల్లును ప్రవేశ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం అని ముఖ్యమంత్రి తెలియచేయడం జరిగింది.

 


మరో  వైపు  ఈ సందర్భంగా టీడీపీ సభ్యుడు నిమ్మల రామానాయుడు మాట్లాడిన వ్యాఖ్యలపై రవాణా, సమాచార, ప్రజా సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ ...‘ఛార్జీల పెంపు వల్ల ప్రజలు ఆర్టీసీకి దూరం అవుతుంది అని  రామానాయుడు గారు చాల  బాధ పడుతున్నారు అని నాని అన్నారు. ఛార్జీల పెంచిన కూడా  ప్రజలు బస్సులు ఎక్కడం మాత్రం మానలేదు కదా. ఇవాళ మీరు ఆందోళన పడితే సామాన్యుల మీద భారం ఏమి పడలేదు అని నాని అన్నారు. ప్రభుత్వం  స్వల్పంగా ఛార్జీలు మాత్రమే పెంచాం. దేశంలో ఏ రాష్ట్రంతో పోల్చుకున్నా తక్కువ ఖర్చుతోనే ప్రజలను ఆర్టీసీ వారి గమ్యస్థానాలకు క్షేమంగా పంపుతుంది అని’ ఈ సందర్బంగా తెలియచేయడం జరిగింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: