ఉల్లిఘాటు తగ్గుముఖం ...?

Suma Kallamadi

గత మూడు నెలలుగా  ఉల్లి ధరలు పెరుగుతూ ఉన్న తరుణం ప్రజలును బాగా ఇబ్బందులు పెట్టాయి. ఏకంగా  కిలో ఉల్లి రూ.200 వరకు ఉండడంతో వంటింట్లో ఉల్లిని వాడడం మానేసే పరిస్థితి ఏర్పడింది. ఇన్ని రోజులగా  భయపెడుతూ వస్తున్న ఉల్లి ధరలు నెమ్మదిగా తగ్గుముఖం పడే ప్రయత్నంలో ఉంది. ఇందుకు ముఖ్య కారణం  కొత్త పంట అందుబాటులోకి రావడంతోపాటు విదేశాల నుంచి దిగుమతులు పెంచడంతో ఉల్లి ధర తగ్గుతుంది.

 

ఇది ఇలా ఉండగా హైదరాబాద్‌ హోల్‌సేల్‌ మార్కెట్‌లో మహారాష్ట్ర నుంచి దిగుమతి ఐనా  మేలు రకం ఉల్లి రూ.70 నుంచి 90 వరకు నడుస్తుంది. అలాగే మిగితా జిల్లాల్లో బళ్లారి, కర్నూలు, మహబూబ్‌నగర్‌, మెదక్‌ నుంచి వచ్చిన ఉల్లి రూ.30 నుంచి రూ.50 మధ్య అమ్మకాలు కొనసాగుతున్నాయి. కానీ, మహారాష్ట్ర నుంచి వచ్చే పాత ఉల్లికి  మాత్రం రూ.100కు పైగానే నడుస్తుంది మార్కెట్లో.


ఒక వైపు ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటడంతో ఎగుమతులపై కేంద్రం నిషేధించడం జరిగింది. ఈ కారణం చేత కొంత కాలంగా ఉల్లి దిగుమతులు బాగా తగ్గాయి అంటే నమ్మండి. ఇక ఢిల్లీలోని అతి పెద్ద హోల్‌సేల్ మార్కెట్‌లో గత వారం ఉల్లి కేజి రూ.65-80 మధ్య నడుస్తుండాగా .. ఈ వారం అక్కడ కూడా కాస్తా రూ. 50-75 మధ్యకు తగ్గుముఖం పట్టింది. 


హఠాత్తుగా ఉల్లి ధరలు పెరిగిపోవడంతో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు స్వయంగా రైతు బజార్ల ద్వారా విక్రయాలు చేపట్టడం జరిగింది. ఇక  రైతు బజార్లలో  రాయితీపై ప్రభుత్వం అందజేసే ఉల్లి కోసం జనాలు ఎదురు చూపులు చూస్తున తరుణం కనపడుతుంది. మరి కొన్ని చోట్ల ఐతే  కుస్తీలు, తోపులాటలు  కూడా జరిగాయి. తాజాగా  ఉల్లి కోసం భారీ క్యూ లైన్లలో ప్రజలు ఉంటున్న నేపథ్యంలో.. గుడివాడ రైతు బజార్‌ వద్ద క్యూలో గంటన్నరకు పైగా వేచి ఉన్న ఓ వ్యక్తి గుండెపోటు రావడంతో చనిపోవడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: