215 మందిని చంపిన డాక్టర్ డెత్.. చివరికి ఏం జరిగిందంటే..

Satvika

మాములుగా డాక్టర్ అంటే పోతున్న ప్రాణాన్ని కాపాడే వాడని అందరు అంటారు. కానీ ఇక్కడ మాత్రం కొంచం రివర్స్ అయింది. ఆరోగ్యాంగా ఉన్న వాళ్ళను కూడా చంపేస్తున్నాడు. వివరాల్లోకి వెళితే.. టన్‌లో ఓ వైద్యుడు ఏకంగా 215 మంది రోగులకు మరణ శాసనం రాశాడు. అనారోగ్యంతో వచ్చిన రోగులను దారుణంగా హతమార్చాడు. వృద్ధులే లక్ష్యంగా హత్యాకాండ సాగించాడు. తీగ లాగితే డొంకంతా కదిలినట్లుగా, ఓ వృద్ధురాలి అనుమానాస్పద మృతిపై విచారణ ప్రారంభిస్తే 1975- 1998 మధ్య కాలంలో ఆ డాక్టర్ వందల మంది రోగులను చంపినట్లు తేలింది.


హెరాల్డ్ ఫ్రెడరిక్ షిప్‌మెన్.. ఇతడే వందల మంది రోగులను చంపి ‘డాక్టర్ డెత్’గా క్రూర అవతారం ఎత్తాడు. 1946 జనవరి 14న ఇంగ్లాండ్‌లోని నొట్టింఘంలో హెరాల్డ్ మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. బాల్యంలో చాలా చురుకుగా ఉండేవాడు. అయితే అతడి చిన్నతనంలో తల్లి ఊపిరితిత్తుల కేన్సర్‌తో బాధపడేది. నొప్పిని భరించడం కోసం ఆమె పలు రకాలు ఇంజెక్షన్లు వేసుకునేది. ఈ పెయిన్‌కిల్లర్ ఇంజెక్షన్ల గురించి హెరాల్డ్ ఆసక్తి ప్రదర్శించేవాడు. ఈ క్రమంలోనే హెరాల్డ్ తల్లి కేన్సర్‌ ముదిరి మరణించింది. దీంతో పెద్దయ్యాక డాక్టర్ కావాలని హెరాల్డ్ నిర్ణయించుకున్నాడు.


అలా కస్టపడి డాక్టర్ అయినా హెరాల్డ్.. ప్రాణాలను పోయడం ఆపేసి ప్రాణాలను తీస్తూ  వస్తున్నాడు. కాగా, ఈ విషయం లేటుగా వెలుగు చూసింది. అంత మంది ప్రాణాలను తీసుకున్న అతనికి దేవుడు కఠిన శిక్ష వేసాడు. అతని పాపం చివరికి పండింది. ఓ వృద్ధురాలికి వైద్యం చేయడానికి వెళ్లిన అతను కొద్దీ గంటల్లోనే ఆమెను చంపేశాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఇచ్చి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి దిగ్భ్రాంతికర వాస్తవాలను వెలికితీశారు. తనవద్ద వైద్యం చేయించుకున్నవాళ్లు మరణిస్తే హఠాన్మరణం అంటూ హెరాల్డ్ డెత్ సర్టిఫికెట్ జారీ చేసేవాడు. ఇలాంటి హఠాన్మరణాలు బ్రిటన్ లో ఎక్కువగా సంభవిస్తుండడం పలు అనుమానాలకు దారితీసింది. దాంతో అన్ని ఆధారాలతో 1998లో డాక్టర్ హెరాల్డ్ ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కోర్టు అతడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

కానీ 2004లో డాక్టర్ హెరాల్డ్ తన జైలు గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. డాక్టర్ డెత్ గా పేరుగాంచిన హెరాల్డ్ ఉన్మాద ప్రవృత్తికి కారణం అతడి బాల్యమేనని చెప్పాలి. 1946లో జన్మించిన హెరాల్డ్ చిన్నప్పుడు ఎంతో చురుకైన విద్యార్థి. తల్లి ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడుతుండడం చూసి ఎంతో బాధకు గురయ్యేవాడు. ఆమె మరణంతో ఎంతో వేదనకు లోనై డాక్టర్ కావాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్టుగానే లీడ్స్ విశ్వవిద్యాలయం నుంచి వైద్యవిద్య అభ్యసించాడు. కానీ, తప్పుదారిపట్టి అందరినీ అంతమొందించడమే లక్ష్యంగా వైద్యం చేయడం మొదలుపెట్టాడు. చివరికి పాపం పండింది. జైల్లోని నాలుగు గోడల మధ్య ఉరివేసుకొని చనిపోయాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: