వివేకా హత్య కేసు విచారణ.... బీటెక్ రవిపై ప్రశ్నల వర్షం

Reddy P Rajasekhar

వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈరోజు బీటెక్ రవిని వివేకా హత్య కేసులో భాగంగా సిట్ అధికారులు విచారించారు. బీటెక్ రవి సిట్ అడిగిన ప్రశ్నలకు తాను సమాధానమిచ్చానని చెప్పారు. స్థానిక పరిస్థితులపై నాకున్న అవగాహన వలనే అధికారులు విచారణకు పిలిచారని బీటెక్ రవి చెప్పారు. రోటీన్ విచారణలో భాగంగానే తనను పిలిపించారని బీటెక్ రవి మీడియాకు చెబుతున్నారు. 
 
వివేకా హత్యకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని తాను కూడా కోరుకుంటున్నట్లు బీటెక్ రవి తెలిపారు. వివేకా హత్య కేసులో ఆత్మహత్యకు పాల్పడిన శ్రీనివాస్ రెడ్డిది తమ గ్రామం కావడం వలనే తనను పిలిపించారని బీటెక్ రవి చెప్పుకొచ్చారు. విచారణలో భాగంగా తాను సమాధానాలను ఇచ్చానని మరలా విచారణకు పిలిచినా వెళతానని బీటెక్ రవి చెప్పారు. వివేకా హత్య కేసులో బీటెక్ రవి విచారణ ముగిసింది. 
 
వివేకానందరెడ్డికి ఎవరైనా శత్రువులు ఉన్నారా..? అని సిట్ అధికారులు బీటెక్ రవిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీగా వివేకాపై పోటీ చేసి గెలిచాను కాబట్టి తనను పిలిపించి ఉండొచ్చని బీటెక్ రవి చెబుతున్నారు. వివేకా హత్యతో మాకు ఎలాంటి సంబంధం లేదని విచారణకు పూర్తిగా సహకరిస్తామని బీటెక్ రవి చెప్పారు. హత్య జరిగినప్పుడు ఎక్కడ ఉన్నారని సిట్ అధికారులు బీటెక్ రవిని ప్రశ్నించారని సమాచారం. 
 
సిట్ బృందం ఈరోజు పులివెందులకు చెందిన మరికొందరిని కూడా విచారించినట్లు తెలుస్తోంది. సిట్ అధికారులు మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణ రెడ్డిని సింహాద్రిపురంకు చెందిన కొమ్మా పరమేశ్వర్ రెడ్డిని కూడా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కొమ్మా పరమేశ్వర్ రెడ్డికి ఆత్మహత్య చేసుకున్న శ్రీనివాస రెడ్డి బావమరిది అవుతారు. అనుమానితుల జాబితాలో తన పేరును చేర్చటంతో శ్రీనివాసరెడ్డి ఆందోళనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల విపక్షాలు వివేకా హత్య కేసుపై ఆరోపణలు చేయటంతో సిట్ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: