3వ అంతస్థు నుంచి కిందకి పడిపోయినా... బ్రతికిన రెండేళ్ల బాలుడు....

Yelleswar Rao

రెండేళ్ల బుడ్డోడు తన ఇంటిలోని మూడవ అంతస్తు మీద ఆడుకుంటూ ఆడుకుంటూ ఫ్లోర్ చివరన వచ్చి జారి కింద పడిపోయాడు. కానీ సినిమాల్లో హీరోలు పై అంతస్తు నుంచి కింద పడేటప్పుడు దిగువనున్న అంతస్తు గోడ అంచులను ఎలాపట్టుకుంటారో ఈ బుడ్డోడు కూడా అచ్చం అలానే చేశాడు.. కాకపోతే ఆ రెండవ అంతస్తు గోడ చివరి అంచును ఎక్కువ సేపు పట్టుకోవడం.. పైకి రావడం అనేది ఏ 2 ఏళ్ల బాలుడికైనా అసాధ్యమైన పని... ఇక్కడ కూడా అదే జరిగి...ఆ బాలుడు.. అంచును పట్టుకోలేక వదిలేసి కిందపడిపోయాడు... కానీ బతికాడు.. అదెలాగనేది...మనం ఇప్పుడు తెలుసుకుందాం..


వివరాల్లోకి పోతే... డామన్ డయ్యు లో మంగళవారం రాత్రి సమయంలో.. రెండేళ్ల చిన్నోడు పైన చెప్పిన విధంగానే ఆడుకుంటూ కిందపడిపోయాడు... అయితే ఇక్కడ బాలుడి అదృష్టం ఏమిటంటే... రెండో అంతస్తు గోడ అంచును పట్టుకున్నప్పుడు ఆ బాలుడు ఏడవడం ప్రారంభించాడు.. దీంతో అక్కడున్న స్థానిక ప్రజలు 'ఈ ఏడుపు ఎక్కడ నుంచి వస్తుందబ్బా' అనుకుంటూ కొద్దిసేపు వెతికారు. తర్వాత వాళ్లకు.. ఈ రెండేళ్ల బుడ్డోడు వేలాడుతూ కనిపించాడు... వెంట్రుకలు నిక్క పొడిచే ఆ సీన్ ను..కళ్ళారా చూసిన వాళ్లు ఒక్క సెకను పాటు నివ్వెరపోయారు... ఆ తర్వాత వెంటనే తేరుకుని ఆ బాలుని కాపాడడం కోసం భవనం కింద గుమిగూడారు.



అయితే ఆ జనం వచ్చిన కొద్ది సమయం తర్వాత... ఆ బాలుడు కిందపడిపోయాడు. కానీ అక్కడ ఉన్న ఒక వ్యక్తి.. అదృష్టవశాత్తు గట్టిగా క్యాచ్ పట్టుకున్నాడు.. అంత ఎత్తు నుంచి వేగంగా కింద పడిపోతున్న అబ్బాయిని పట్టుకోగానే ఈ వ్యక్తి కూడా వెంటనే కిందపడిపోయాడు.. కానీ దేవుని దయ వల్ల ఇద్దరికీ ఎటువంటి చిన్న గాయం కూడా తగలలేదు.. ఈ దృశ్యాలన్నీ ఒక కెమెరాలో రికార్డు అయ్యాయి.. ఆ రికార్డ్ అయిన వీడియో క్లిప్ ఒక ప్రముఖ ప్రైవేటు న్యూస్ ఏజెన్సీ వాళ్ళు ట్విట్టర్ లో అప్లోడ్ చేశారు.. అప్పటి నుంచి ఈ వీడియో ఇంటర్నెట్ లో బాగా చక్కర్లు కొడుతుంది.

కొంతమంది నెటిజన్లు.. బాబును కాపాడిన మీరు ఎంతోమంది హృదయాలను గెలుచుకున్నారంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

https://mobile.twitter.com/ANI/status/1201878961782956034

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: