పవన్ ఓ పవర్ బ్యాంక్... పంచ్‌లు మామూలుగా లేవుగా...
అవును పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెల్‌ఫోన్‌కు పవర్ బ్యాంక్ లాంటోడు.. చార్జింగ్ సదుపాయం లేని చోట పవర్ బ్యాంక్ మిడిసిపడుతోంది అంటూ ఘాటుగా విమర్శలు గుప్పించారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. ప్రతిరోజు విజయసాయిరెడ్డి సందర్భోచితంగా సోషల్ మీడియాలో తనదైన శైలీలో పోస్టులు పెడుతూ, ప్రతిపక్షాలపై, ప్రతిపక్ష నేతలపై విరుచుకుపడుతున్న విజయసాయి రెడ్డి ఈ రోజు కొద్ది సేపటి క్రితం ట్వీట్టర్ ఖాతాలో పవర్‌స్టార్‌పై పవర్‌ఫుల్ పంచ్ డైలాగ్‌లు విసిరారు. విజయసాయిరెడ్డి ట్వీట్ చేసిన పోస్టులు ఇలా ఉన్నాయి.
ముందుగా పవన్ కళ్యాణ్‌పై విజయసాయిరెడ్డి పేల్చిన పంచ్ డైలాగ్ ఇలా ఉంది. ఎలక్షన్లలో ప్రజలు పొర్లించి కొట్టినంత పనిచేసినా సిగ్గుపడకుండా దులిపేసుకున్నాడు. యాక్టరును చూద్దామని నలుగురు పోగవగానే రెచ్చిపోయి డైలాగులు వదుల్తున్నాడు. రాజకీయాలంటే ప్యాకేజి కోసం అమ్ముడు పోవడం కాదు. ఎవరో ఉస్కో అంటే కాసేపు మొరిగి వెళ్లిపోవడం అంతకంటే కాదు. అంటూ పవన్ కళ్యాణ్‌పై ట్వీట్ చేశారు విజయసాయి. అయితే ఈ ట్వీట్‌పై పవన్ కళ్యాణ్ స్పందించక ముందే మరో ట్వీట్ పేల్చాడు విజయసాయి.
మరో ట్వీట్‌లో ఇలా రాసుకొచ్చాడు విజయసాయి. పవన్ కళ్యాణ్ సెల్‌ఫోన్‌కు ‘పవర్ బ్యాంక్’ లాంటోడు. చార్జింగ్ సదుపాయం లేని చోట పవర్ బ్యాంక్ మిడిసిపడుతోంది. అందులో కరెంటు దిగి పోయాక మళ్లీ చంద్రబాబో, ఇంకొకరో చార్జింగ్ నింపాలి. పవర్ బ్యాంక్ ఎప్పుడూ తాత్కాలిక అవసరానికి పనికొచ్చేదే తప్ప తనకు తాను పవర్ జనరేట్ చేయలేదు. అంటూ పవన్ కళ్యాణ్‌ను పవర్ లేని నాయకుడిగా అభివర్ణించాడు విజయసాయిరెడ్డి.
ఈ ట్వీట్ పవన్ కళ్యాణ్‌ను విజయసాయిరెడ్డి ఓ రేంజ్‌లో విమర్శించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడిగా ప్రకటించిన ఈ ఎంపీ విజయసాయిరెడ్డి ఇప్పుడు పవర్ లేనోడిగా పవన్ కళ్యాణ్‌ను విమర్శించడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ రెండు ట్వీట్లకు జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే.