ఒక్కో అమ్మాయి వెంట ముగ్గురు అబ్బాయిలు... దేశంలో ప‌రిస్థితి ఇది...

VUYYURU SUBHASH

భారతదేశంలో లో డేటింగ్ యాప్స్ ఉపయోగిస్తున్న వారిలో మొత్తం 26 శాతం మంది మహిళలు ఉన్నట్టు వూస్ అనే దేశీయ డేటింగ్ యాప్ నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. మన దేశంలో అబ్బాయిల సంఖ్య కంటే అమ్మాయిల సంఖ్య చాలా తక్కువగా ఉన్నది అన్నది అందరికి తెలిసిందే. ఇంకా చెప్పాలంటే ఈ ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న చైనా లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో చైనాలో చాలా మంది అబ్బాయిలకు పెళ్లిళ్లు కావడం లేదు. చైనాలో మూడున్న‌ర‌ పదుల వ‌య‌స్సు వ‌చ్చి పెళ్లి కాని ప్రసాద్‌ల‌ సంఖ్య రోజురోజుకు విపరీతంగా పెరిగి పోతుండటంతో చైనా ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.

 

ఇప్పుడు ఇదే పరిస్థితి మనదేశంలోనూ కనిపిస్తోంది. తాజా సర్వేలో తేలిన లెక్క ఏంటంటే డేటింగ్ యాప్‌ల‌లో ఒక అమ్మాయి వెంట ముగ్గురు అబ్బాయిలు పడుతున్నారట. ప్రస్తుతం అందరూ ఆన్లైన్ డేటింగ్ యాప్‌లు విపరీతంగా వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ యాప్ వాడే ఒక అమ్మాయి వెంట కనీసం ముగ్గురు అబ్బాయిలు పడుతున్నట్టు తాజా సర్వే స్పష్టం చేసింది. భారత్‌లో ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లు వాడుతున్న వారిలో 26 శాతం మంది మహిళలు ఉన్నట్టు తాజా సర్వే వెల్లడించింది.

 

అమెరికాలో మహిళలతో పోలిస్తే ఈ సంఖ్య చాలా తక్కువ. అమెరికాలో టిండర్, బంబుల్ డేటింగ్ యాప్‌ల‌ను ఏకంగా 40 శాతం మంది మహిళలు ఉపయోగిస్తున్నారు. ఇక విదేశాల్లో డేటింగ్ యాప్ లను చాలామంది టైం పాస్ కోసం ఉపయోగిస్తుంటే మనదేశంలో మాత్రం సీరియస్ గా డేటింగ్ చేయాలన్న‌ని ఆలోచనతోనే మహిళలు ఈ యాప్‌ వాడుతున్నట్టు సర్వే తేల్చి చెప్పింది. మొత్తం 32 శాతం మంది టైం పాస్‌ కోసమే ఈ యాప్ వాడుతుండ‌గా... మరో 28 శాతం మాత్రం కొత్తవారితో పరిచయం కోసం తహతహలాడుతున్నారు.

 

మరికొందరు సోషల్ మీడియాలో కోసమే ఇలా చేస్తున్నట్టు తెలిపారు. 18 నుంచి 21 సంవత్సరాల వయస్సు గల అబ్బాయిలు మాత్రం అమ్మాయిలతో స్నేహం కోసం ఈ యాప్స్ వినియోగిస్తున్నట్టు తెలపడం విశేషం. అయితే డేటింగ్ చేసే వారిలో చాలామంది తమ నిజమైన వివరాలు పొందుపరచడం లేదని కూడా సమాచారం. అమ్మాయిలు భద్రతను దృష్టిలో ఉంచుకొని చాలామంది ఫేక్‌ డీటెయిల్స్ ఇస్తున్నారని సర్వే తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: