సెల్ ఫోన్ దొంగలించాడు... కానీ రెండు కాళ్లూ పోగొట్టుకున్నాడు.?
రైలు, బస్సులలో దొంగల బెడద ఎక్కువగా ఉంటుంది. రైల్లో ప్రయాణిస్తున్న ప్రయాణీకుల్లో అసలు దొంగ ఎవరో కూడా గుర్తు పట్టడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఎక్కువ మంది ప్రయాణికులు ఉన్నప్పుడు మాత్రం దొంగలు తమ చేతివాటం చూపించక మానరు . కొంతమంది మొబైల్ ఫోన్లు దొంగిలిస్తే కొంతమంది పర్స్ లను దింగలిస్తారు . ఏదేమైనా దొంగతనం చేయడం మాత్రం కామన్. అందుకే అటు అధికారులు కూడా ప్రయాణికులకు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంటారు. దొంగలున్నారు జాగ్రత్త మీ వస్తువులన్నింటినీ జాగ్రత్తగా ఉంచుకోండి అంటూ హెచ్చరికలు జారీ చేస్తారు. అయితే ఇలా రైలు బస్సు ప్రయాణంలో దొంగతనాలు చేస్తున్న దొంగలకు కొన్నిసార్లు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. కొంతమందికి దొంగతనాలు చేస్తున్నప్పుడు దొరికిపోయి ప్రయాణికులంతా దేహ శుద్ధి చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఓ దొంగ కి మాత్రం ఇలాంటి దొంగతనమే చేయబోతే చావు తప్పి కన్ను లొట్ట పోయినంత పరిస్థితి ఏర్పడింది .
రైలు లో అంతా సాఫీగా ప్రయాణం సాగి పోతుంది. ఇంతలో ఓ యువకుడు ఓ ప్రయాణికుడు జేబులోంచి సెల్ ఫోను దొంగలించబోయాడు . ఆ యువకుడు సెల్ ఫోన్ కాజేశాడు కానీ రెండు కాళ్లూ పోగొట్టుకున్నాడు. వరంగల్ జిల్లా కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం... ఆదివారం తెల్లవారుజామున 3.50 గంటల సమయంలో వరంగల్ వైపు వెళ్తున్న రైల్లో ఓ ప్రయాణికుడు నుంచి ఎస్కే నశీర్ అనే యువకుడు సెల్ ఫోన్ దొంగలించి పోయాడు. ఇది గమనించిన బాధిత ప్రయాణికుడు కేకలు వేసాడు. దీంతో ఎక్కడ పట్టుబడతానో అని హడలిపోయిన ఆ యువకుడు రైలు నుంచి కిందకు దూకేశారు. ఈ క్రమంలో అదుపుతప్పి రైలు కింద పడడంతో రెండు కాళ్లు తెగి పడిపోయాయి. దీంతో ఆ దొంగకు చావు తప్పి కన్ను లొట్ట పోయినట్లు అయింది.
ఇక చిమ్మచీకటి ఎముకలు కొరికే చలిలో... రెండు కాళ్లు తెగి పడిపోవడం తో చీకటిలో ఎముకలు కొరికే చలిలో అరణ్యరోదన తో విలపించు కుంటూ బాధతో సమీపంలోని పొలం వద్దకు చేరుకున్నాడు. దొంగలించిన సెల్ ఫోన్ నుంచి 108 అంబులెన్స్ కు ఫోన్ చేశాడు. అయితే ఫోన్ చేసిన అరగంట తర్వాత ఆ ప్రాంతానికి చేరుకుని అంబులెన్స్ సిబ్బంది కూడా చీకట్లో నసీర్ ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి చాలా సమయమే పట్టింది. దాదాపు అరగంట తర్వాత ఆ ప్రాంతానికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది... చీకట్లో నసీర్ ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి మరో అరగంట సమయం పట్టింది. చివరికి రైలు పట్టాలపై ఉన్న రక్తపు మరకల ఆధారంగా నసీర్ కనిపెట్టారు అంబులెన్స్ సిబ్బంది. అపస్మారకస్థితిలో పడివున్న నసీర్ ను గుర్తించి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.