ఏపీ రాజ‌ధానిలో కాల్ గ‌ర్ల్స్‌... టారిఫ్ ఇదే

VUYYURU SUBHASH

ఏపీ రాజ‌ధాని కేంద్రంగా ఉన్న గుంటూరు జిల్లాలో కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా వ్య‌భిచార దందా జోరుగా న‌డుస్తోంది. ఈ ప్రాంతంలో ఉన్న కళాశాల యువ‌త‌నే టార్గెట్‌గా చేసుకుని కాల్ గ‌ర్ల్స్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయ‌లుగా న‌డుపుతున్నారు. తాజాగా మంగ‌ళ‌గిరిలోని ఓ అపార్ట్‌మెంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను ధ్వంసం చేశారు పోలీసులు.. నిర్వాహకులు, విటులు, పలువురు మహిళలను అరెస్టు చేశారు. మంగళగిరి మండలం చినకాకాని పరిధిలో ఓ భవనంలో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై మంగళగిరి రూరల్ పోలీసులు దాడులు చేశారు.

 

రద్దీగా ఉండే ఓ ప్రముఖ కళాశాల హాస్టల్ విద్యార్థులు, పరిసరాల్లో ఉండే వ్యక్తులను ఈ ముఠా టార్గెట్ చేసుకొని కొంతకాలంగా వ్యభిచారం సాగిస్తోంది. ఇందుకోసం స్థానికంగాను, ఇత‌ర ప్రాంతాల నుంచి కొంత మంది కాల్ గ‌ర్ల్స్‌ను ర‌ప్పించి అబ్బాయిల‌కు ఎర‌వేసి వారిని ఈ ముగ్గులోకి దింపుతున్నారు. సెక్స్‌కు అల‌వాటు ప‌డిన యువ‌త ఆ త‌ర్వాత త‌మ కోరిక‌లు తీర్చుకునేందుకు, అమ్మాయిల‌తో ఎంజాయ్ చేసేందుకు ఇంట్లో అవ‌స‌రం ఉన్నా లేక‌పోయినా డ‌బ్బులు తీసుకువ‌చ్చి వీరికి బానిస అవుతున్నారు.

 

ఈ క్ర‌మంలోనే వారి కెరీర్‌పై కూడా వీరు ప్ర‌భావం చూపుతున్నారు. అమ్మాయిల అందాన్ని బ‌ట్టి ఆంటీలు అయితే ఒక రేటు, యువ‌తులు అయితే ఒక రేటు అంటూ వ‌సూలు చేస్తున్నారు. గంట‌ల లెక్క‌, నైట్ల లెక్క‌న రు. 2 వేల నుంచి రు.15 వేల వ‌ర‌కు వ‌సూలు చేస్తున్నారు. కాలేజ్ యువ‌త కూడా ముగ్గురు, న‌లుగురు క‌లిసి ఓ అమ్మాయికి భారీ మొత్తం ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకుని రాత్రిళ్లు ఎంజాయ్ చేస్తున్నారు.

 

ఈ దందా స్థానికులు కొందరు గమనించి.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వ్యభిచార గృహంపై దాడులు చేసి ఆరుగురిని అరెస్టు చేశారు. వారిని స్టేషన్ కు పంపించారు. అందులో ఇద్దరు విటులు కాగా, నలుగురు నిర్వాహకులు ఉన్నట్లు తెలుస్తోంది. వారి వద్ద నుంచి రూ.11 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: