రాజకీయాల్లోకి రానున్న శ్రీరెడ్డి.... అక్కడినుండే పోటీ....?

Reddy P Rajasekhar
నటి శ్రీరెడ్డి నిన్న చెన్నై నగరంలోని ప్రసాద్ ల్యాబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. గత కొద్ది రోజుల నుండి నటి శ్రీరెడ్డి ఉదయనిధిపై ఆరోపణలు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఒక ఫేస్ బుక్ పోస్టులో నటి శ్రీరెడ్డి ఉదయనిధిపై ఆరోపణలు చేసినట్లు వార్తలు వస్తూ ఉండటంతో శ్రీరెడ్డి ఆ వార్తల గురించి స్పందించి వివరణ ఇచ్చారు. శ్రీరెడ్డి తను పోస్ట్ చేసినట్లు వైరల్ అవుతోన్న ఫేస్ బుక్ పోస్టులో నిజం లేదని పేర్కొన్నారు. 
 
నటుడు ఉదయనిధిపై ఆరోపణలు చేసినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని శ్రీరెడ్డి అన్నారు. ఇప్పటివరకు ఉదయనిధిని నేరుగా చూడలేదని శ్రీరెడ్డి చెప్పారు. కరుణానిధి కుటుంబంపై నాకు ఎంతో గౌరవ మర్యాదలు ఉన్నాయని శ్రీరెడ్డి అన్నారు. నా ఫేస్ బుక్ ఖాతా నుండి ఉదయనిధి గురించి ఎటువంటి పోస్ట్ రాలేదని శ్రీరెడ్డి అన్నారు. ఎవరో పనిగట్టుకొని అలా చేశారని అది నకిలీ ఖాతా అని శ్రీరెడ్డి అన్నారు. 
 
ఎవరో నా పేరుతో ఉదయనిధి పేరుప్రతిష్టలను దెబ్బతీయాలని చూస్తున్నారని శ్రీరెడ్డి అన్నారు. తన పేరుతో సోషల్ మీడియాలో కొన్ని నకిలీ అకౌంట్లు ఉన్నాయని శ్రీరెడ్డి అన్నారు. సైబర్ క్రైమ్ లో ఇప్పటికే నకిలీ ఖాతాల గురించి ఫిర్యాదు చేశానని శ్రీరెడ్డి మీడియాకు తెలిపారు. సినిమా పరిశ్రమలో చాలా మంది హీరోయిన్లు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని శ్రీరెడ్డి అన్నారు. 
 
తమిళ ప్రజలు నన్ను ఆరాధిస్తున్నారని శ్రీరెడ్డి చెప్పారు. త్వరలోనే తమిళనాడులో రాజకీయరంగ ప్రవేశం చేయబోతున్నట్లు శ్రీరెడ్డి తెలిపారు. తమిళనాడు ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నానని శ్రీరెడ్డి తెలిపారు. త్వరలోనే రాజకీయ పార్టీలో చేరబోతూ ఉండటంతో శ్రీరెడ్డి ఉదయనిధి గురించి వివరణ ఇచ్చినట్లు సమాచారం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక ప్రముఖ పార్టీ తరపున శ్రీరెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉందని పార్టీలో చేరిన తరువాత ఎక్కడినుండి పోటీ చేస్తుందో శ్రీరెడ్డి చెబుతుందని సమాచారం. అవకాశాల కొరకు కొన్ని తప్పులు చేశానని ఇకపై అలాంటి తప్పులు జరగవని శ్రీరెడ్డి చెప్పటం గమనార్హం. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: