కేసీఆర్ కు పెద్ద షాక్ ఇచ్చిన జగన్ !

Prathap Kaluva

ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అయితే ఎంత స్నేహం ఉన్నప్పటికీ ఏ రాష్ట్ర సీఎం ఆ రాష్ట్రం యెక్క ప్రయోజనాల గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు సరిగ్గా ఆంధ్ర ప్రదేశ్ .. తెలంగాణ విషయంలో అదే జరుగుతుంది. కేసీఆర్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్నేహితుడే కావొచ్చు.. కానీ ఏపీ ప్రయోజనాల  తర్వాతే ఇంకేమైనా అన్న విషయాన్ని తాజాగా తన చేతల తో తేల్చి చెప్పింది ఏపీ సర్కారు. విభజన చట్టాన్ని అమలు చేయకుండా తెలంగాణ ఉల్లంఘిస్తుందన్న విషయాన్ని స్పష్టం చేస్తూ సుప్రీం లో ఏపీ సర్కారు దాఖలు చేసిన అఫిడవిట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.రాష్ట్ర విభజన చట్టంలో కేంద్రప్రభుత్వం పేర్కొన్న నియమనిబంధనలూ.. ప్రవర్తనా నియమావళిని తెలంగాణ సర్కారు పాటించడం లేదు. 9 10 షెడ్యూల్ సంస్థల ఆస్తుల పంపకానికీ సహకరించడం లేదు.


దీనితో తెలంగాణ వైఖరి నచ్చక జగన్ ప్రభుత్వం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాల కోసం విడుదల చేసిన నిధులలోనూ వాటాలను ఇవ్వడం లేదు.  విభజన చట్టం హామీల అమలు కోసం ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఆర్థికశాఖ కార్యదర్శులు .. సంబంధిత శాఖలు కార్పొరేషన్ల అధికారులు కలసి మాట్లాడుకుందామని ఈ చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుందామని కోరుతున్నా తెలంగాణ నుంచి సహేతుకమైన సమాధానం కానీ సమావేశం తేదీ సమాచారంగానీ రావడం లేదు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాల కోసం విడుదల చేసిన రూ.1630 కోట్లలో రూ.664.67 కోట్లు తమ వాటా కింద రావాలని తెలంగాణ వాదిస్తోంది.


అయితే ఏపీ ప్రభుత్వం చెబుతూ ఇప్పటికే కొంచెం బకాయిలు చెల్లించామని .. ఇంకా రూ.495.21 కోట్లు మాత్రమే తెలంగాణకు ఇవ్వాల్సి ఉందని చెప్పింది.  రాష్ట్ర ఆర్థికసంస్థ ఆస్తుల విభజన విషయంలోనూ తెలంగాణ సహకరించడం లేదు. పోలవరం సాగు నీటి ప్రాజెక్టును నిర్మిస్తే 80 టీఎంసీల కృష్ణా జలాలను తెలంగాణకు ఇవ్వాలని ఆ రాష్ట్రం చేసే వాదనలో వాస్తవం లేదు. గోదావరి కృష్ణా నదీ జలాల విషయంలో వివాదాలను పరిష్కరించేందుకు కేంద్ర జలశక్తి మంత్రి అధ్యక్షతన అపెక్స్ కౌన్సిల్ ను ఏర్పాటు చేశారు. ఈ కౌన్సిల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు సభ్యులు గా ఉన్నారు. ఈ కౌన్సిల్ సమావేశంలో పోలవరంపై తెలంగాణ చేసిన వాదనలు అసంబద్ధం గా ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: