ఉత్తరప్రదేశ్‌లో టీచర్‌పై విద్యార్ధులు దాడి

Suma Kallamadi
గురు బ్రహ్మా, గురు విష్ణు, గురు దేవో భవ అని గురువులను త్రిమూర్తులతో పూజిస్తాం. విద్యాబుద్ధులు నేర్పించే ఉపాధ్యాయులంటే అందరీకి గౌరవమే. కానీ, ఉత్తరప్రదేశ్‌లోని రాయ్ బరేలీలో చోటుచేసుకున్న సంఘటన  అందరీని ఆశ్చర్యపరుస్తుంది. రాయ్ బరేలీలోని గాంధీ సేవా నికేతన్‌లో విద్యార్ధులంతా కలిసి ఓ టీచర్‌పై దాడి మొదలు పెట్టారు. చైల్డ్‌ వెల్ఫేర్‌ అధికారి మమతా దూబేను సోమవారం విద్యార్థులు తీవ్రంగా కొట్టారు. మొదట విద్యార్థులు ఆమె చుట్టూ చేరి వాదనకు దిగారు. ఒక విద్యార్థి ఆమె హ్యాండ్‌బ్యాగును విసిరేశాడు. అనంతరం అదే విద్యార్థి ప్లాస్టిక్‌ కుర్చీతో పలుసార్లు ఆమెను కొట్టాడు. ఈ సమయంలో మిగిలిన  విద్యార్థులు చోద్యం చూస్తుండడం గమనార్హం. ఈ సంఘటనులు అన్ని కూడా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది.  


         దీనిపై బాధితురాలు మమతా స్పందిస్తూ.. మేనేజర్‌తో భేదాభిప్రాయాలు ఉన్నాయని, అందుకే అతడు తనను ఇటీవల విధుల నుంచి తొలగించినట్లు తెలిపారు. దీనిపై తాను కలెక్టర్‌ నేహా శర్మను సంప్రదించినట్లు వెల్లడించారు. తనను విద్యార్థులు వాష్‌ రూంలో బంధించారని అధికారులకు చెబితే, పిల్లలు తమకు ఇష్టం వచ్చినట్లు చేస్తారని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారన్నారు. రెండు రోజుల తర్వాత నికేతన్‌కు వెళ్లగా విద్యార్థులు దాడి చేశారని తెలిపారు. మేనేజరే ఈ దాడి చేయించాడని ఆమె ఆరోపిస్తున్నారు. దీంతో మమతా పిల్లలపై పోలిస్ స్టేషన్ కు పిర్యాదు కూడా చేయడం జరిగింది. 


ఇక ఈ విషయంపై ఉన్నత అధికారులు మాత్రం  స్కూలు మేనేజర్‌తో విభేదాలు ఉండటం వల్లే విద్యార్థులను తనపై దాడికి ఉసిగొల్పినట్టుగా టీచర్ మమతా దూబే తెలియచేయడం జరిగింది. గతంలోనూ తనను విద్యార్థులు వాష్ రూంలో బంధించారు అని కూడా తెలిపింది. ఈ ఘటనపై అధికారులు స్పందించి విచారణ మొదలు పెట్టారు. అయితే విద్యార్థులు మాత్రం తమను మమతా దూబే అనాథలు అంటూ దుర్భాషలు ఆడటం వల్లే దాడి చేశామని పేర్కొంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: