టీడీపీ ఎమ్మెల్యేల‌ వైసీపీ జంపింగ్ ఆలోచ‌న వెన‌క‌... జ‌గ‌న్ స్కెచ్ స‌క్సెస్‌...!

VUYYURU SUBHASH
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ భవిష్యతు ఏంటి...? ఆ పార్టీ కార్యకర్తల్లో ఉన్న అభిప్రాయం ఏంటి...? ఇప్పుడు ఈ ప్రశ్నలకు వాళ్ళే సమాధానం చెప్పలేని పరిస్థితి. రెండు నెలల క్రితం చంద్రబాబు గుంటూరులో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి దివ్యమైన భవిష్యత్తు ఉందని ఒక మాట అన్నారు. కాని మారుతున్న పరిస్థితులు చూస్తుంటే ఆ పార్టీ కంటే వైసీపీకి ఆ మాట సరిగా నప్పుతుంది ఏమో అనే అభిప్రాయలు వినపడుతున్నాయి.


గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత పార్టీ నేతల్లో ఒకరకమైన అభిప్రాయం వినపడుతుంది. వంశీ లాంటి నమ్మకస్తుడే పార్టీకి దూరమైతే మనకు భవిష్యత్తు ఉంటుందా...? ఇప్పుడు ఈ ప్రశ్న పార్టీలో యువనేతల్లో కూడా వ్యక్తమవుతుంది. దేవినేని అవినాష్ తో పాటు కొంత మంది యువనేతలు పార్టీ మారేందుకు రంగ౦ సిద్దం చేసుకున్నారు, జగన్ తో కలిసి అడుగు వేయడానికి వారు సిద్దం కాగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు వారిని వద్దని బుజ్జగించి పదవులు ఇస్తానని హామీ ఇచ్చారు.


దేవినేని అవినాష్ విషయంలో ఇదే జరిగిందని అంటున్నారు. రాయలసీమ ప్రాంతంలో వైసీపీ ఇప్పుడు అత్యంత బలంగా ఉంది. జిల్లాలకు జిల్లాలే వైసీపీ ఖాతాలో చేరాయి. దీనితో టీడీపీ నేతలు తమ భవిష్యత్తు దివ్యంగా ఉండాలి అంటే జగన్ నే ఎంచుకునే అవకాశాలు కనపడుతున్నాయి. పార్టీలో యువనేతలు కొందరు వైసీపీ సీనియర్ నేతలను, తమతో సన్నిహితంగా ఉండే మంత్రులను కలిసే ప్రయత్నం చేస్తున్నారు.


మంత్రులు కూడా జగన్ తో మాట్లాడి వాళ్ళను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. బిజెపి చంద్రబాబుని వదిలే అవకాశం ఉండదని... జగన్ ని అరెస్ట్ చేస్తారనే ప్రచారం తెలుగుదేశం చేయడమే గాని వాస్తవ పరిస్థితులు జగన్ కి అనుకూలంగానే ఉన్నాయని అంటున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే వైసీపీలో చేరడానికి ప్రయత్నాలు చేయగా చంద్రబాబు వద్దని వారించారు. ఆయనతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారడానికి సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది.


రాజీనామా చేసి గెలుస్తాం అనే నమ్మకం వారిలో ఉండటంతో జగన్ కూడా వారిని చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారట. ప్రభుత్వంపై వ్యతిరేకత అనేది కేవలం తెలుగుదేశం పార్టీ ప్రచారమే గాని అలాంటి వాతావరణం ఉంటే పరిస్థితులు మరోలా ఉంటాయని, వీలైనంత త్వరగా పార్టీ మారితే మంచిదని కొందరు ఎమ్మెల్యేలు భావిస్తున్నారట.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: