చరిత్ర చూద్ధాం! ఇస్లాంతో నిండిన గల్ఫ్ దేశాలన్నీ నాడు హైందవ (భారత) భూబాగాలే!
నేడు గల్ఫ్ దేశాలంటే ఇస్లామిక్ దేశాలు మాత్రమే అనే వాదన వినిపించేస్తున్నారు. కానీ 1400 సంవత్సరాల క్రితం ఇంక్కడ “ఇస్లామ్” అనేది లేనే లేదు. ఈ గల్ఫ్ దేశాల లో ఇస్లామ్ లేని రోజుల నుండీ వారి ఆదిమ లేదా తొలి సంస్కృతి ఏది? క్రైస్తవమా? లేదా హిందుత్వమా? హిందుత్వమా! అలాంటి అవకాశమే లేదు, హిందుత్వం - గల్ఫ్ దేశాలలో ఉండడం అసంభవం అనుకునే నేటి యువతకు కనువిప్పు కలిగించటం ఈ వ్యాసం ముఖ్య ఉద్దేశం.
గల్ఫ్ దేశాలలో సహస్రాబ్ధాల నుండి నుండీ విలసిల్లుతూవస్తున్న హిందూ జీవనవిధానం సంస్కృతులు ఇప్పటికీ అదే పేర్లలో, అదే పద్దతులలో, అదే ప్రదేశికాంశాల తో కనిపిస్తూనే ఉన్నాయి. అరేబియా తదితర ప్రాంతాలలో వేల సంవత్సరాలుగా “శివ పూజ” జరిగింది. శివుని ఆరాధనా పద్ధతులు, ఇత్యాదులను మనం నేటికీ అక్కడ గమనించవచ్చు.
ఉత్తర ఇరాక్ – ఇరాన్ - అస్సిరియా – మెసొపొటేమియా సంస్కృతి:
క్రీస్తు పూర్వం 1800 నాటికి ఇక్కడ (అస్సీరియా ప్రాంతంలో) “అసుర” అనే రాజ్యం విస్తరించి ఉండింది. వీరిని సంస్కృతంలో ‘అసురులు’ అని పిలిచారు. ఉత్తర ఇరాక్ ప్రాంతంలోని అసురులు దక్షిణ ఇరాక్, ఈజిప్ట్ వరకు విస్తరించారు. అక్కడ దక్షిణ ఇరాక్ లోని ‘బాబిలోన్ సంస్కృతి – ఈ అసుర సంస్కృతి’ కలిసిపోయాయి.
అసురుల రాజులలో ప్రసిద్ధి చెందినవాడు అషుర్ – బని – పాల్ (అసుర-వన-పాలుడు) ఈ సంస్కృతినే “ఆస్సీరియా – మెసొపొటేమియా సంస్కృతి” అని చరిత్ర కారులు పిలిచారు.
మెసొపొటేమియన్లు - బాబిలోనియన్లు బహుదేవతారాధకులు. అసురుల రాజచిహ్నము నంది. అసురుల్లో ఒక దేవుని పేరు, “ఈశర” - ఈశ్వర శబ్దానికి ఇది రూపాంతరం - వికృతి. అయితే ఈ పేరు గల దేవతాస్త్రీని ”అసుర లేక అన్సర”పేరుతో-నంది వాహిని ఉన్న ఈమెను “రాజదేవత” గా పూజించేవారు.
అసురుల దేవతలు అందరూ అతీంద్రియ శక్తులు కలవారే. అమరులు కూడా! విశ్వం యొక్క నలు దిక్కులకు, బహు అంశలకు వీరు అధి దేవతలు.
“ఇష్టర్” అనే పేరుతో ఇష్ట దేవతను కొలిచేవారు. “ఈయ” అనే పేరుతో ప్రసిద్ధం. జ్ఞానము, మంత్రము, స్తోత్రములతో దేవతను కొలిచేవారు. దేవాలయముల ద్వారా భక్తులు దేవుని దర్శించేవారు. దేవాలయములలో గర్భగుడి లోకి కొందరిని మాత్రమే ప్రవేశం ఉండేది.
దేవాలయములలో నిత్య దేవతార్చన, నైవేద్య అర్పణ జరిగేది. నెలకు ఒకసారి మాసోత్సవం జరిగేది. ప్రతి సంవత్సరం దేవుని కళ్యాణం జరిపేవారు.
“కుర్దులు”: ఈ ప్రాంతంలోనే ఉన్న మరొక ప్రసిద్ధ జాతి – వీరి భాషలో నీటిని “ఆప” అని పిలుస్తారు. ఆపః అంటే సంస్కృతంలో జలము అని అర్థం. కుర్దు భాషా, సాంస్కృతిక పద్ధతులను ఇంకా విశదంగా విశ్లేషించాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉన్నది.
“సిరియా”: “సూర్య” శబ్దానికి రూపాంతరమే సిరియా. నంది వాహనుడైన శివుని ముద్ర ఉన్న పురాతన నాణేలు ఇక్కడ దొరికాయి. “శివన్” అనే పట్టణం, “శివ” అనే మాసం (నెలని) వీరి పూర్వీకులు ఉపయోగించారు. ఈ “శివ” మాసం లోనే మోజెస్ - బైబిల్ సృష్టికర్త మోషే - అనే వీళ్ల పూర్వీకుడు “టెన్ కమాండ్మెంట్స్-పాత నిబంధన రాశాడు.
“టర్కీ”: టర్కీ ప్రాంతంలో శివుని పూజ జరిగేది అనడానికి ఆనవాళ్లు దొరికాయి. టర్కీ లోని ఒక ప్రముఖమైన పట్టణం పేరు “శివస్” నేటికీ విలసిల్లుతున్న ఇస్తాంబుల్ పట్టణం లో శివుని మసీదు నేటికీ ప్రసిద్ధమైనదే. ఇప్పుడు ఇది “మాస్క్ ఆఫ్ శివ” గా ప్రసిద్ధి.
అలాగే నేటికీ ఇక్కడ ప్రసిద్ధమైన మరొక ప్రదేశం – అంతాలయ లేదా అంతాల్య – అంతాలయము” అంటే “మరణ ఆలయము” శివుడు లయకారకుడు కనుక వారు ఆ పేరు పెట్టుకున్నారనడంలో ఆశ్చర్యం అనుమానం ఏమీలేదు. నేడు ఉన్న మరొక ఊరు – “సంసాన్” లేక స్మశాన. స్మశాన నివాసి కూడా శివుడే కదా!
టర్కీలో మరో విచిత్రం స్త్రీలు సంతానం కొరకు చెట్లను ఆశ్రయించి, కోరికలు తీర్చ మంటూ వృక్ష పూజ చేసేవారు. ప్రకృతిని వనసంపదను పంచభూతాలను దైవంగా చేసే సంస్కృతి హైదవంలో సదాచారమే కదా!
కన్యలు మంచి భర్త దొరకాలని వివాహము కొరకు చెట్లను పూజించేవారు. సంతానం కోరుకునే స్త్రీలు చిన్న ఊయలలను చెట్లకు కట్టేవారు. వారు ఆ చెట్టుకి దారాలు, పవిత్ర మైన వస్త్రాలని కట్టి, మొక్కుకునేవారు. ఇదీ హైందవంలో సుప్రసిద్ధం.
ఈ పద్ధతులు టర్కీ, దక్షిణ రష్యా, కజకిస్తాన్ ప్రాంతాల్లో నేటికీ కొనసాగుతున్నవి. ఇవన్నీ పాశ్చాత్య స్త్రీలకు అర్థం కావు కానీ భారతీయులకు ఇవి ఆచార సంప్రదాయాలు. ఈ సంప్రదాయాలు యూదులు, అరబ్బులలో కూడా వ్యాపించి ఉన్నాయి. అంటే నేడు గల్ఫ్ అంటూ మనం పిలిచే ప్రాంతంలో హైందవం విస్తరించి ఉండేది. భారత వర్షం సువిశాల జంబూద్వీపంగా పిలవబడేది.