ఉడికించిన గుడ్డు లేదా ఆమ్లెట్ ? ఈ రెండిటిలో ఏది ఆరోగ్యానికి మేలు చేస్తుందంటే..!

lakhmi saranya
గుడ్లు ఆరోగ్యానికి వెరీ గుడ్... రోజు ఒక గుడ్డు తినండి ఆరోగ్యంగా ఉండండి అని ప్రభుత్వమే చెబుతోంది. పౌష్టికాహార లోపం అధిగమించాలనుకునే వారు గుడ్డు తినాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే గుడ్డుని కూరలో, బిర్యానీ, ఫ్రై గానే కాదు ఉడకబెట్టి,ఆమ్లెట్ వేసుకుని ఇలా రకరకాలుగా తింటారు. అయితే ఉడకబెట్టిన గుడ్డు, లేదా ఆమ్లెట్ ని ఎక్కువగా తింటారు. ఈ రెండితో ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసుకుందాం. గుడ్డు పోషకాలు మృతిగా ఉన్న ఒక సూపర్ ఫుడ్. అన్ని వయసుల వారికి ఒక యోజనకరంగా పరిగణించబడుతుంది. ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఇందులో పుష్కలంగా లభిస్తాయి.
గుడ్డు బరువు తగ్గటం నుంచి కండరాలను ఆరోగ్యాన్ని బలోపేతం చేయడం వరకు అనేక విధాలుగా ప్రయోజనాలను కలిగిస్తుంది. గుడ్డుని ఉడికించి, వేయించిన గుడ్డు లేదా ఆమ్లెట్ ఇలా రకరకాలుగా తింటారు. ఉడికించిన గుడ్డు, ఆమ్లెట్లు ఏది మంచిది అంటే అది ఆహారపు అలవాట్లు, ఫిట్ నెస్ లక్ష్యాలు, అభిరుచిపై ఆధారపడి ఉంటుంది. అయితే ఉడకబెట్టిన గుడ్, ఆమ్లెట్ ఈ రెండిటిలో ఏది ఆరోగ్యానికి మంచిది అని తెలుసుకుందాం. ఉడకబెట్టిన గుడ్డులో నూనె లేదా నెయ్యి ఉపయోగించరు. దీని కారణంగా కేలరీలు తక్కువగా ఉంటాయి. కనుక ఉడకబెట్టిన గుడ్డు ఆరోగ్యానికి మంచిది. ఉడికించిన గుడ్డులో ప్రోటీన్, విటమిన్ డి, బి12, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. అందువల్ల ఇది మంచి ఎంపిక.
తక్కువ కేలరీలు, అధిక ప్రోటీన్ కారణంగా ఉడికించిన గుడ్లు బరువు తగ్గడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది తయారు చేయడం చాలా సులభం. వేగంగా రెడీ చేసుకోవచ్చు. అందుకే చాలా మంది ఉడకబెట్టిన గుడ్డును తినడానికి ఇష్టపడతారు. చాలామంది ఆమ్లెట్ తినటానికి ఇష్టపడతారు. గుడ్డు కొట్టిన తర్వాత దానికి ఉప్పు, కారం, మసాలా దినుసులు జత చేసి తయారుచేస్తారు. దీనికి టమాటా, క్యాప్సికమ్, ఉల్లిపాయలు, పాలకూర వంటి వాటిని కూడా జోడించి కూడా భిన్నమైన రుచితో తయారు చేసుకోవచ్చు. స్పైసి ఫుడ్డు ఇష్టపడేవారు ఆమ్లెట్ ను ఇష్టపడతారు. ఉడకబెట్టిన గుడ్డు మాదిరిగానే ఆమ్లెట్లో కూడా చాలా పోషకాలు ఉంటాయి. బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నట్లయితే.. ఉడికించిన గుడ్డులో తక్కువ క్యాలరీలో ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: