తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కనుమరుగైపోతుందని చెప్పడానికి హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం ఒక ఉదాహరణగా నిలుస్తుంది. రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి టీడీపీ పరిస్తితి తెలంగాణలో ఎలా తయారైందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాయకుల వలసలతో పార్టీ దాదాపు క్లోజ్ అయిపోయింది. దాదాపు 90 శాతం నేతలు టీఆర్ఎస్, కాంగ్రెస్ ల్లోకి వెళ్లిపోయారు. ఇక మిగిలిన వారు ఇటీవల బీజేపీలోకి వెళ్ళిపోయారు. అయితే అక్కడక్కడ నేతలు కలిపి ఒక 5 శాతం మంది ఉంటారు.
వీరి వల్ల ఇప్పటికిప్పుడు పార్టీకి ఒరిగిదేమీ లేదు. కానీ బాబు మాత్రం ఏమి లేకపోయిన ఎక్కడ తగ్గడం లేదు. నేతలు వెళ్లిన కేడర్ ఉందని చెబుతూ భ్రమల్లో బ్రతికేస్తున్నారు. నాయకులతో పాటే కేడర్ కూడా తుడిచిపెట్టుకుపోయిందని బాబుకు అర్ధం కావడం లేదు. నేతలతో పాటు కేడర్ కూడా వెళ్లిపోయిందని చెప్పడానికి హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితమే ఉదాహరణగా నిలుస్తుంది.
తాజాగా వెలువడిన ఉప ఎన్నిక ఫలితంలో టీఆర్ ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్ధి పద్మావతిపై 43,284 వేల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఇక ఇక్కడ టీడీపీకి 1827 ఓట్లు మాత్రమే వచ్చాయి. టీడీపీ మీద బీజేపీకే బెటర్ గా ఓట్లు వచ్చాయి. ఆ పార్టీకి 2621 ఓట్లు రాగా, ఈ రెండు పార్టీలు మీద బెటర్ గా ఇండిపెండెంట్ అభ్యర్ధి సుమన్ 2693 ఓట్లు తెచ్చుకుని మూడో స్థానంలో నిలిచారు. ఈ విషయం పక్కనబెడితే టీడీపీకి ఘోరంగా ఓట్లు వచ్చాయి.
అయితే టీడీపీకి 2014 లో ఇక్కడ దాదాపు 25 వేల ఓట్లు వరకు వచ్చాయి. కానీ ఇప్పుడు 2వేలు కూడా రాలేదు. దీని బట్టి చూస్తే టీడీపీకి కేడర్ కూడా లేదని అర్ధమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా బాబు తెలంగాణలో పార్టీని క్లోజ్ చేసేసి గౌరవంగా పక్కకు తప్పుకుంటే బెటర్. అలాగే పార్టీలో మిగిలి ఉన్న నేతలని ఎవరి భవిష్యత్ వారిని చూసుకుమంటే ఇంకా మంచిది.