గాలి ఉన్నప్పుడే తూర్పార బట్టాలి అనేది ఓ సామేత. ఈ సామేతను అక్షరాల నిజం చేసుకునేందుకు సిద్దమయినట్లున్నారు టాలీవుడ్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు. టాలీవుడ్ లో బయ్యర్‌గా జీవితం ప్రారంభించి, తరువాత డిస్ట్రిబ్యూటర్‌గా మారి, ఆపై నిర్మాతగా నిలదొక్కుకుని టాలీవుడ్‌ను తన కనుసన్నల్లో నడుపుతున్న దిల్ రాజు. దిల్ సినిమాతో నిర్మాతగా మారడంతో సినిమా పేరే ఇంటి పేరుగా మార్చుకుని ఎక్కడ తనకు అనుకూలమైన గాలి వీస్తే అక్కడే తన పనిని కానిచ్చుకుంటారనే పేరుంది దిల్ రాజుకు. అయితే ఇప్పుడు దిల్ రాజు మనసు రాజకీయాల వైపు మళ్ళీందా అనే చర్చ సాగుతుంది.
ఇప్పుడు దిల్ రాజు చుట్టూ తెలంగాణ రాజకీయాలు నడుస్తున్నాయనే టాక్ వినిపిస్తుంది. అయితే దిల్ రాజు చేసిన ఓ పని ఇప్పుడు ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇంతకు దిల్ రాజు చేసిన పనేంటి.. ఆయనపై వస్తున్న రూమర్లు ఏంటీవి... ఓసారి చూద్దాం. అయితే ఇప్పుడు కేంద్రంలోని నరేంద్రమోడీ నాయకత్వంలోని బీజేపీ సర్కారు దక్షిణ భారత దేశంలో పాగా వేసేందుకు ప్లాన్‌లు వేస్తుంది. అందులో భాగంగా ముందుగా ఇక్కడి రాజకీయాల్లో తలపండినవారిని, ఇతర ప్రాంతీయ పార్టీల్లో అసమ్మతి రాగం వినిపించేవారిని తమ చెంతకు రప్పించుకుంటూ కొద్దొ గొప్పొ బీజేపీ బలోపేతం అవుతుంది.
అందులో భాగంగానే దక్షిణ భారతదేవంలో బీజేపీ బలోపేతం కావడం కోసం సిని ప్రముఖులను, తటస్థులను తమవైపుకు లాక్కునే ప్రయత్నం చేస్తుంది. అందుకే దక్షిణ భారతంలో తమిళ, తెలుగు, కన్నడ, మళయాళ సినిమాలపై ప్రభావం చూపే దిల్ రాజుపై బీజేపీ కన్నేసిందనే టాక్ వినిపిస్తుంది. దిల్ రాజు సినిమా పరిశ్రమలో తిరుగులేని వ్యక్తిగా ఉండటంతో దిల్ రాజును బీజేపీలోకి తీసుకుంటే దక్షిణ భారతంలో బీజేపీకి కొంత పట్టు దొరుకుతుందని భావించారట ప్రధాని నరేంద్రమోడీ.. అందుకే ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేపట్టిన ఛేంజ్ విత్ ఇన్ కార్యక్రమం బాలీవుడ్ సిని ప్రముఖులతో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి దక్షిణ సిని పరిశ్రమను పిలువలేదు.. కానీ దిల్ రాజును మాత్రం ప్రత్యేకంగా పిలిచారట. అందుకే ఈ కార్యక్రమంలో దిల్ రాజు ప్రత్యేకంగా ప్రధాని మోడిని కలిసి చర్చించారట. దిల్ రాజును ఓ కేంద్రమంత్రి ప్రధాని ప్రత్యేకంగా దూత వచ్చి ఈ కార్యక్రమానికి ఆహ్వనించారట. అయితే ప్రధానీ మోడీతో దిల్ రాజు భేటీ కావడంతో ఆయన బీజేపీ వైపుకు తన ప్రయాణం సాగిస్తారనే టాక్ ఇప్పుడు జోరుగా సాగుతుంది. దీనికి తోడు దిల్ రాజు బాలీవుడ్‌కు కూడా ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. బీజేపీ తోడుంటే... దిల్ రాజు పని సులువుగా అవుతుంది.. దీనికి తోడు రాజకీయంగా దిల్ రాజుకు పెద్ద పీట వేసేందుకు బీజేపీ ఉత్సాహంగా ఉందట..
అంటే అటు సిని పరిశ్రమలో.. ఇటు రాజకీయ రంగంలో దిల్ రాజుకు పెద్దపీట దక్కబోతుందన్నమాట. .ఇప్పికే సిని పరిశ్రమలోని పెద్దలైన మోహన్ లాల్, రజనీకాంత్, రాజమౌళి, కృష్ణంరాజు, ప్రభాస్, మంచు మోహన్ బాబు, నాగార్జున వంటివారితో ప్రధాని మోడికి మంచి సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఓ పెద్ద నిర్మాత జత కలువడంతో దక్షిణ భారతంలో బీజేపీకి గట్టి పునాదులే పడనున్నాయి.. సో దిల్ రాజు కషాయం కండువా ఎప్పుడు కప్పుకుంటారో వేచి చూడాలి మరి..