మనిషి అన్న తరువాత ఉప్పూకారం తినడం సహజమే. ఉప్పూకారం తిన్న వ్యక్తులకు కోరికలు ఉంటాయి. ఆ కోరికలు ఒక్కోసారి దారుణంగా మారిపోతుంటాయి. తెలియకుండానే వేరే వేరేగా మారిపోతున్నాయి. దారులంగా మారిపోవడమే కాదు.. దానివలన ఇబ్బందులు కూడా వస్తుంటాయి. ఒక్కోసారి ఉద్యోగాలు కూడా పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.
అతనికి మంచి ఉద్యోగం.. ప్రజలందరూ చేతులెత్తి మొక్కుతారు. ఒకరకంగా చెప్పాలి అంటే కలియుగంలో నడిచే దేవుడు అని పిలుస్తారు. ఎవర్ని అలా పిలుస్తారో అందరికి తెలుసు. వారే డాక్టర్లు. ఆ డాక్టర్ కు మంచి పేరుంది. అంతకు మించి అతనిలో కోరికలు ఉన్నాయి. అతనికి తన హాస్పిటల్ లో పనిచేసే ఓ నర్సు తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. సమయం దొరికినప్పుడల్లా అతని కోరికలు తీర్చుకునేవాడు. అయితే, కొన్ని రోజులుగా ఆ ఇద్దరికీ వేరే వేరు డ్యూటీలు వస్తూ వచ్చారు.
అయితే, ఇటీవలే ఆ ఇద్దరికీ నైట్ షిఫ్ట్ డ్యూటీ పడింది. ఉద్యోగం చేస్తుండగా మధ్యలో ఆ డాక్టర్ కు వాంఛ కలిగింది. ప్రియురాలు నర్సుకు సైగ చేశారు. డ్యూటీలో ఉన్నామని, కుదరదని, తెలిస్తే.. ఉద్యోగాలు పోతాయని చెప్పింది. కామంతో కళ్ళు ముసూసుకుపోయిన వ్యక్తులకు కళ్ళు మూసుకుపోతాయి అన్నట్టుగా.. అతని కళ్ళు మూసుకుపోయాయి. పదేపదే బలవంతం చేయడంతో తప్పలేదు.
ఇద్దరు కలిసి పేషేంట్స్ ఉంచే వార్డులోకి వెళ్లారు. ఏ వార్డులోని బెడ్లు ఖాళీగా ఉండటంతో అక్కడే కామక్రీడ మొదలుపెట్టారు. ఈ విషయం మొత్తం అక్కడే ఉన్న సిసి టీవీలో ప్లే అయ్యింది. అంతే సిసి టీవీ సెక్యూరిటీ సిబ్బంది షాక్ అయ్యారు. విషయాన్ని వెంటనే పై అధికారులకు చెప్పడంతో.. వెంటనే వచ్చి వాళ్ళను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. క్షణాల్లో ఉద్యోగాలు ఊస్టింగ్ అయ్యాయి. ఐదు నిమిషాల సుఖం కోసం ఆశపడితే.. పాపం జీవితాన్ని ఇచ్చే జీతం, ఉద్యోగం రెండు పోయాయి. పైగా కేసు మెడకు చుట్టుకోవడంతో అవమాన పడాల్సి వచ్చింది.