"జగనన్న కాదు జలగన్న" అని ట్వీట్ చేసిన లోకేష్

Gowtham Rohith

వైసీపీ ప్రభుత్వం పై ఏపీ ప్రతి పక్ష నేత చంద్రబాబు తీవ్రస్థాయి లో మండిపడ్డారు. తమ హయాంలో వ్యవసాయ రంగం సాధించిన అభివృద్ధి అబద్ధమని వైసీపీ నేతలు మాట్లాడడం పై మండిపడ్డ అబద్ధాలు మాట్లాడినంత మాత్రాన వాస్తవం దాగదు అంటూ చురకలంటించారు. ఈ మేరకు రాజ్య సభలో కేంద్ర వ్యవసాయ మంత్రి ఇటీవల విడుదల చేసిన నివేదికను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.




తెలుగుదేశం హయాంలో వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్ సాధించిన అభివృద్ధి అబద్ధమని రాష్ట్ర శాసనసభలో వైసీపీ నేతలు అడ్డంగా వాదించారు. నోరుందికదా అని అబద్ధాలను మాట్లాడినంత మాత్రాన వాస్తవాలను దాచేయలేరుకదా. రాజ్యసభలో కేంద్ర వ్యవసాయ మంత్రిగారు జులై 26, 2019న చెప్పిన విషయాలివి. pic.twitter.com/RNjI7AzPT4

— N Chandrababu Naidu (@ncbn) July 30, 2019


చంద్రబాబు రెండు వేల పదిహెడు పధ్ధెనిమిది సంవత్సరం లో ఏపీ సాధించిన వ్యవసాయ వృద్ధి రేటు అంతకుముందు ఏడాది కన్నా పదిహెడు పాయింట్ రెండు ఐదు శాతం ఎక్కువని చెప్పారు చంద్రబాబు అంతకుముందు రెండేళ్ల వివరాలను కూడా ట్విట్టర్ లో వెల్లడించిన ఆయన ఏడాది కి ఏడాది వృద్ధి ని పెంచు కుంటూ పోయామని స్పష్టం చేశారు.  ఏడుపు కళ్ల తో చూసే వైసిపి అభద్ధాలతో ప్రజల ను తప్పు దారి పట్టించా లని చూస్తోందని చంద్రబాబు విమర్శించారు అధికార పక్షం లో ఉండి కళ్లకు గంతలు కట్టు కుంటే ఎలా తెరిచి చూడనట్టు ఘాటుగా స్పందించారు.


 ఫైబర్ గ్రిడ్ పై విమర్శ లు వింటున్న ప్రజలకూ వైసిపిపై రోత పుడుతోందని అన్నారు లోకేశ్ టిడిపి ప్రభుత్వం ఫైబర్ గ్రిడ్ ప్రారంభిస్తే వైసిపి నేతల కడుపు మండుతోందని రెండోరోజే కేబుళ్లు కట్ చేశార ని ట్వీట్ చేశారు ఫైబర్ గ్రిడ్ ను రాష్ట్రపతి తో పాటు పలువురు సీఎంలు కూడా ప్రశంసించారని అయిదు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు ను మూడు వందల యాభై కోట్ల తో పూర్తి చేశామ ని అన్న అవినీతంటూ సొల్లు కబుర్లు చెప్పడం కాదని వాటి నిరూపించాలంటూ లోకేష్ సవాల్ విసిరారు.  రక్తం పీల్చేంత అవినీతికి మీ జలగన్న పెట్టింది పేరని ట్వీట్ లో సెటైర్ లు వేశారు .





ఏపీ ఫైబర్ గ్రిడ్ వ్యవస్థతో మేము సాధించిన ఫలితాలను భారత రాష్ట్రపతితో పాటు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మెచ్చుకున్నారు. రూ.5 వేల కోట్లు పట్టే ప్రాజెక్టును రూ. 350 కోట్లతో పూర్తి చేసిన ఘనత మాది. అవినీతి అంటూ సొల్లు కబుర్లు చెప్పడం కాదు, నిరూపించండి.

— Lokesh Nara (@naralokesh) July 30, 2019



రక్తం పీల్చేంత అవినీతికి మీ జలగన్న పెట్టింది పేరు. ఆయన్ను పక్కన ఉంచుకుని మా మీద ఆరోపణలు చేస్తే జనం నవ్వుతారు. మీ నేతలా ప్రజల రక్తం పీల్చే దుస్థితిలో నేను లేను...ఆధారాలు చూపించకుండా ఆరోపణలతో బ్రతికేస్తాం అంటే మీ ఇష్టం..

— Lokesh Nara (@naralokesh) July 30, 2019

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: