ఏపీ బీజేపీలో కోట‌రీ పాలిటిక్స్‌... రాజ‌కీయం అదిరింది...

VUYYURU SUBHASH
రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏమైనా జ‌ర‌గొచ్చు. అవ‌స‌రం-అవ‌కాశాలే ప్రాతిప‌దిక‌లుగా రాజ‌కీయాలు ముందుకు సాగుతుంటా యి. ఈ క్ర‌మంలోనే ఎప్పుడు ఎలాంటి ప‌రిణామాలు ఎదురైనా.. కూడా ఆశ్చ‌ర్యంగా నే ఉంటుంది. అతిపెద్ద రాజ‌కీయ పార్టీ బీజేపీలో ఇప్పుడు ఏపీ విష‌యానికి వ‌స్తే.. కోట‌రీ రాజ‌కీయాలు న‌డుసూ్తున్నాయ‌ని అంటున్నారు సీనియ‌ర్లు. ఎన్నిక‌ల‌కు ఏడాది ముందు వ‌ర‌కు క‌మ్మ సామ్రాజ్యంగా ఉన్న ఏపీ బీజేపీ ఇప్పుడు మాత్రం కాపుల గ్రూపుల‌తో నిండిపోయింద‌ని అంటున్నారు. 


గ‌తంలో కామినేని శ్రీనివాస్‌, ప్ర‌స్తుత ఉప‌రాష్ట్ర ప‌తి వెంక‌య్య, కంభం పాటి హ‌రిబాబు త‌దిత‌ర క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుల హ‌వా స్ప‌ష్టంగా క‌నిపించేది. అయితే, బీజేపీకి మిత్ర‌ప‌క్షంగా ఉన్న టీడీపీ అధినేత‌, అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు ఒక్క‌సారిగా యూట‌ర్న్ తీసుకుని, బీజేపీ స‌హా మోడీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలో బీజేపీకి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న నాయకులు చంద్ర‌బా బును టార్గెట్ చేయాల్సి వ‌చ్చింది. అయితే, వారికి కులాభిమానం అడ్డువ‌చ్చింది. దీంతో మోడీని, బీజేపీని చంద్ర‌బాబు క డిగేస్తున్నా.. వీరు మౌనంగా ఉండిపోయారు. 


ఈ ప‌రిణామాల‌తో రాష్ట్రంలో బీజేపీ ప‌గ్గాలు ఏకంగా కాపు వ‌ర్గానికి చెందిన కన్నా ల‌క్ష్మీనారాయ‌ణ చేతిలోకి వెళ్లాయి. దీనికి సంబంధించి బీజేపీ అధిష్టానం చాలానే ప‌క్కా లెక్క‌లు వేసుకుంది.అటు చంద్ర‌బాబుకు, ఇటు జ‌గ‌న్‌కు కూడా త‌ట‌స్తంగా ఉన్న కాపులు త‌మ ప‌క్షానికి చేరుకుంటార‌ని అనుకున్నారు. అయితే, అనూహ్యంగా కాపులు మొత్తంగా వైసీపీకి జైకొట్టారు. (ఈ విష‌యాన్ని కాపు ఉద్య‌మ నాయ‌కుడు ముద్ర‌గడ ఇటీవ‌ల త‌న లేఖ‌లో వివ‌రిస్తూ.. జ‌గ‌న్‌కు పంపారు) దీంతో కాపు సామాజిక వ‌ర్గం బీజేపీకి చేరువ కాలేదు. అయిన‌ప్ప‌టికీ.. ప‌ట్టు వ‌ద ల‌ని క‌న్నా.. కాపుల‌ను చేరువ చేసేందుకు జంపింగులను సైతం ప్రోత్స‌హిస్తున్నారు. 


త్వ‌ర‌లోనే త‌మ పార్టీ ఫిరాయింపు దారుల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతుంద‌ని క‌న్నా ఇప్ప‌టికే ప‌లుమార్లు మీడియాకు వెల్ల‌డించి సంచ‌ల‌నం రేపారు. అయితే, ఇలా ఓ కులానికే ప‌రిమిత‌మై.. ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హిస్తూ.. రాజ‌కీయాలు చేయ‌డాన్ని ఇదే బీజేపీలోని కొంద‌రు క‌మ్మ వ‌ర్గానికి చెందిన నాయ‌కులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ నేప‌థ్యంలోనే కొంద‌రు సీనియ‌ర్లు రాజ‌కీయాల‌కు గుడ్‌బై చెప్పాల‌ని అనుకుంటున్నార‌ని తెలుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: