ఫేస్ బుక్, వాట్సప్.. ఇలా వాడితే జైలుపాలే.. జాగ్రత్త..?

Chakravarthi Kalyan

ఫేస్ బుక్, వాట్సప్.. ఇప్పుడు ఈ రెండూ లేకుండా ఎవరికీ పొద్దుపోవడం లేదు. గుడ్ మార్నింగ్ లు.. గుడ్ నైట్లు.. చర్చలు, సంప్రదింపులు, ప్రేమలు, పరిచయాలు.. అన్నీ వీటిల్లోనే.. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా.. సోషల్ మీడియాలో రాజకీయాలపై చర్చలు హాట్ హాట్ గా సాగుతుంటాయి.


అదే సమయంలో కాస్త సంయమనంలో వ్యవహరించకపోతే చిక్కుల్లో పడతారు. ఓ పార్టీపై అభిమానంతో మరో పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేసినా అనవసరంగా కేసుల్లో ఇరుక్కుపోతారు. ఏపీలో వైసీపీ కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యేలపై ఒక వ్యక్తి ఫేస్ బుక్ లో అనుచిత వ్యాఖ్యలు చేసి అనవసరంగా చిక్కుల్లో పడ్డారు.


మహిళా శాసనసభ్యులను అగౌరవ పరిచేలా వ్యాఖ్యలు పెట్టారని పి.రమేష్ అనే వ్యక్తిపై అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు తుళ్లూరు పోలీసులకు కంప్లయింట్ చేశారు. పోలీసులు రమేష్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. శాసనసభ్యులపై రమేష్ చేసిన వాఖ్యల ఫొటోలు, ఆయన ఫేస్‌బుక్‌ ఖాతా ఫొటోను పోలీసులకు అందజేశారు.


ఇప్పుడు సదరు రమేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవడంతో ఇప్పుడు రమేశ్ పూర్తిగా చిక్కుల్లోపడిపోయారు.


ఫేస్ బుక్ కారణంగా కేసులు ఎదుర్కోవడం, జైలు పాలవడం కూడా కొత్తేమీ కాదు. ఇటీవలే ఓ వ్యక్తి సీఎం జగన్ జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశాడని కేసు ఎదుర్కొంటున్నారు. ఏదో ఆవేశంలో ఇష్టారాజ్యంగా పోస్టులు పెట్టడం.. ఆనక కేసుల్లో ఇరుక్కుపోవడం అవసరమా చెప్పండి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: