దక్షిణాదిన కమల వికాసం - పసుపు మాయం - గులాబి క్రమంగా మాయం - కర్ణాటకలో కమలం?

ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తమ అసలు స్వరూపం ఏమిటో చూపించే ప్రయత్నంలో ఉంది. దేశవ్యాప్తంగా కమలం పార్టీని బలోపేతంగా చేసుకునే దిశగా పావులు కదుపు తోంది. తెలుగుదేశానికి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యుల్ని తమలో కలిపేసుకోవడం అనేది చిన్నప్రయత్నం మాత్రమే. ముందు ముందు ఇలాంటి పరిణామా లు ఇంకా భారీస్థాయిలో జరగ బోతున్నాయని హస్తిన వర్గాలు సంకేతాలు ఇస్తున్నాయి. అందితే జుట్టు,  అందకుంటే కాళ్లు పాత సామెత. అందినా అందకున్నా పాదాక్రాంతమే నేటి నిజం. ఇదంతా  అవకాశవాదుల సంగతి. దీనికి సరిగ్గా రివర్సులో ఇప్పుడు బీజేపీ వ్యూహలు సాగుతున్నాయి. 

తాము గెలిచిన పార్టీలను వీడి తమ పార్టీలోకి రావడానికి నాయకులు ఒప్పుకుంటే సాదర ఆహ్వానం అలాకాకపోతే ఒక పద్దతిలో బెదిరించడం అనేది వారి రాజకీయ లక్ష్యంగా ఉంటోందని రాజకీయ విశ్లేషకుల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గతంలో వైసీపిని సరిగ్గా ఇదే విధానంలో తొక్కేసింది నాడు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం. తాతకు పెట్టిన బొచ్చె తలాపిన్నే ఉన్నట్లు నేడు టిడిపి నాడు వైసీపి అనుభవాన్నే రుచి చూస్తుంది అంతే కాదు అనుభవిస్తుంది కూడా! 


ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కమలం చేతుల్లో ఉంది. నాడు ఏపిలో ఎన్నికల ముందు పచ్చపార్టీ నాయకత్వం చేసిన అరాచక, అవినీతి, అబద్ధాల రాజకీయం వారి పైనే తిప్పి కొడుతోంది. కారణం ప్రజానాయకులు మొత్తం ఇప్పుడు వ్యాపారులమయం అయిపోయింది. వ్యాపారంతో ముడిపడిన వారే ప్రజాప్రతినిధులు అవటమే ఈ దుస్థితికి మూలం. ఇక ఈ వ్యాపారులు ఏ పార్టీ లో ఉన్నా వారి జుట్టు మాత్రం కేంద్ర ప్రభుత్వం చేతుల్లో చేతల్లో చిక్కుతున్నట్లే. ఆయా వ్యాపారాలకు సంబంధించి వారిని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టడం అతి తేలికైన మరియు సునాయాసమైన విద్య అయిపోతోంది. పైగా ఏ కొంతైనా అక్రమాలు లేని వ్యాపారం చేసేవాళ్లంటూ ఎవ్వరూ లేరు! ఆ ఆనుపానులను  దొరక బుచ్చుకుంటోంది కమలం పార్టీ నాయకత్వం.



తాజాగా టిడిపి నుంచి పార్టీ ఫిరాయించిన నలుగురు ఎంపీలు కూడా పక్కా వ్యాపారస్తులే. అనేక కేసుల్లో నిండా మునిగి, పలు ఆర్ధిక నేరారోపణలు ఉన్నవారే. పన్నుఎగవేత, ఐటీ, ఆర్థిక నేరాలు, బాంక్ ఋణాల ఎగవేత వంటి పలు ఆర్ధిక నేరపూరిత వ్యవహారాల్లో వాళ్లు నిందితులు. వారి మీద సోదాలు నడిచాయి. ఆర్ధిక నేఱాల కేసులు నడుస్తు న్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే వారు పార్టీ మారడమూ జరిగింది. ఈ క్రమానుక్రమణిక ఇక్కడితో ముగిసిపోదు పోలేదు. ఇదే తరహాలో, దేశంలోని ఇంకా అనేక మంది ఇతర పార్టీల నాయకుల్ని తమలో కలిపేసుకునే దిశగా కమలదళం ప్రణాళికలు రచిస్తుందని సమాచారం.

ఇక సమీప భవిష్యత్తులో "కర్నాటకలో అధికార బదలాయింపు" పై కమలం కన్నేసిందంటున్నారు. ఇప్పటికే అక్కడ కాంగ్రెస్-జనతాదళ్ నడుమ లుకలుకలు బయట పడుతున్నాయి. హెచ్ డి కుమారస్వామి ప్రభుత్వాన్ని కూల్చేస్తాం! అని కమలనాధులు ఎప్పట్నించో అంటున్నారు. ఇప్పటికే "పొలిటికల్ స్కెచ్ - కప్పల తక్కెడ" వ్యవహార రచన సిద్ధమైందని, త్వరలోనే అది కార్యరూపం దాలుస్తుందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అంటే దక్షిణ భారతంలో కర్ణాటకలో కాషాయదళం ప్రభుత్వాన్నేర్పరచ బోతుందన్నమాట! 

గంటా శ్రీనివాసరావు ఖండించినా ఆ తరహా ప్రయోగంతో రాష్ట్రంలో కమలం శాసనసభలో జెండా పాతనుందని అర్ధం అవుతుంది. తద్వారా మొన్న సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు మోడీ పట్ల వ్యవహరించిన తీరుకు ప్రతీకారం తీర్చుకోవటం జరిగిపోతుంది. అంతేకాదు రానున్న 2014 ఎన్నికల్లో ఏపిలో అధికారంలోకి రావాలన్న బిజేపి వ్యూహానికి పదునుపెట్టటం జరిగిపోనున్నాయి.


ఇక తెలంగాణాలో కాంగ్రెస్ చంద్రబాబు తో స్నెహం చేసి పరువు పోగొట్టుకొని జనంలొ పలచనైపోయింది  మొత్తం మీద నిర్వీర్యమై పోతుంది.  ఇక కాంగ్రెస్ నుండి ప్రజా ప్రతినిధుల ప్రవాహం కమలం వైపే అంటున్నారు. రాన్రాను కేసీఆర్ నాయకత్వం లోని టీఅరెస్ గత సార్వత్రిక ఎన్నికల తరవాత క్రమంగా నిర్వీర్యమైపోతోంది. ప్రజలు కూడా కేసీఆర్ కుటుంబాని కి బై బై చెప్పచెప్పనున్నారనే అంటున్నారు. అంటే ఇక్కడ కూడా బిజేపి బలపడనుందనేది నూరుపాళ్ళు నిజం. దక్షిణాదిన కమలం వికసించటం తప్పదన్నమాట. 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: