ఎడిటోరియల్ : చంద్రబాబుకు జగన్ అభయం...సభకే హైలైట్
నిజంగానే జగన్ ఆ
పనిచేస్తే చంద్రబాబునాయుడు అంతే సంగతులు. అసెంబ్లీలో టిడిపికి ప్రతిపక్ష హోదా కూడా
దక్కనీయకుండా చేయాలంటే జగన్ కు నిజంగా ఎన్నో రోజులు పట్టదు. కానీ ఆ పని చేస్తే
తనకు చంద్రబాబుకు తేడా ఏమీ ఉండదని స్పష్టంగా చెప్పారు.
గడచిన ఐదేళ్ళల్లో వైసిపి విషయంలో చంద్రబాబు చేసిన దుర్మార్గం అందరికీ తెలిసిందే. వైసిపి తరపున 23 ఎంఎల్ఏలు, ముగ్గురు ఎంపిలను ప్రలోభాలకు గురిచేసి టిడిపిలోకి లాక్కున్నారు. అదే పని ఇపుడు జగన్ కూడా చేయదలచుకుంటే అడ్డుకునే వాళ్ళే లేరు. పైగా టిడిపి నుండి వైసిపిలోకి దూకేయటానికి కొందరు ఎంఎల్ఏలుగా సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది.
ఈ నేపధ్యంలో జగన్ గనుక ఫిరాయింపుల ప్రోత్సహించేందుకు ఊ అంటే చాలు అసెంబ్లీలో టిడిపి నొరిప్పే అవకాశం కూడా ఉండదు. కానీ తాను ఆ పని చేయబోనని చంద్రబాబుకు జగన్ అభయం ఇచ్చారు. ఇక్కడే 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు తాను చేసిన పనికి సిగ్గుపడాలి.
చంద్రబాబు చేసిన పనే తాను కూడా చేస్తే తామిద్దరికీ తేడా ఏముంటుందని జగన్ వేసిన ప్రశ్నకు టిడిపి నేతలు సిగ్గుపడాలి. తాను కొన్ని విలువలకు కట్టుబడిన వాడినని జగన్ చెప్పుకోవటంలో అతిశయోక్తి ఏమీ లేదు. టిడిపి నుండి వైసిపిలోకి రాదలచుకున్న ప్రజాప్రతినిధులను ముందు రాజీనామాలు చేసిన తర్వాతే తాను చేర్చుకున్న విషయాన్ని గుర్తు చేశారు.
ఇపుడు కూడా టిడిపిలో నుండి ఎవరైనా వైసిపిలోకి చేరితే వెంటనే వారి సభ్యత్వంపై వేటు వేయాలని చెప్పారు. ఇదే సభలో గతంలొ అన్యాయనమైన రాజకీయాలను చూశామని జగన్ అన్నారు. తాను అటువంటి రాజకీయాలు చేయనని చంద్రబాబుకు అభయమిచ్చినట్లే చెప్పారు.