చంద్రబాబు చేసిన తప్పే.. జగన్ కూడా చేస్తాడా..?

Chakravarthi Kalyan
చంద్రబాబు రాజకీయాల్లో 40 ఏళ్ల సీనియర్.. దేశంలో తానే సీనియర్ ను అని చెప్పుకుంటారు కూడా. కానీ అంతటి సీనియర్ కూడా గత ఎన్నికల్లో చాలా రాంగ్ స్టెప్స్ వేశారు. ఏపీలో బీజేపీ పట్ల వ్యతిరేకతను క్యాష్ చేసుకుందామని మోడీని టార్గెట్ చేసి ఫెయిలయ్యారు. అదే పార్టీతో నాలుగేళ్లు కలసికాపురం చేసిన విషయాన్ని జనం మరిచిపోతారని చంద్రబాబు భావించారు. 


కానీ జనం మాత్రం అంత సులభంగా మరిచిపోలేకపోయారు. చంద్రబాబుకు ఝలక్ ఇచ్చారు. అలా చంద్రబాబు చేసిన తప్పు జగన్‌ చేయొద్దని ఇప్పుడు ఓ కేంద్ర మంత్రి సలహా ఇస్తున్నారు. ఆయనే.. రాందాస్‌ అథవాలె. ఆయన గతంలో ఎన్డీయేతో సఖ్యతగా మెలగాలని చంద్రబాబుకు చాలా సార్లు చెప్పి చూశారు. 

అయినా చంద్రబాబు మాత్రం ఎన్డీయేకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా తిరిగారు. అందుకే ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారని అథవాలే ఇప్పుడు కూడా అంటున్నారు. అదే సమయంలో కొత్త సీఎం జగన్ కు ఓ సలహా కూడా ఇస్తున్నారు. అదేంటంటే.. చంద్రబాబు చేసిన తప్పే  జగన్‌ చేయకూడదని విజ్ఞప్తి చేస్తున్నారు. 

ఏపీ అభివృద్ధి కోసం ఎన్డీయేతో సఖ్యతగా ఉండాలని ఆయన జగన్ కు సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం మద్దతు ఉంటుందని అథవాలే స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ఏ నిర్ణయమూ తీసుకోలేదని చెప్పారు. అనేక రాష్ట్రాలు ప్రత్యేక హోదా కావాలని అడుగుతున్నాయని అథవాలే చెబుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: