ఇక వాళ్ల ఇళ్లలో దేవుడి ఫోటో పక్కనే.. జగన్ ఫోటో కూడా..?

Chakravarthi Kalyan
వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ ను పాలించింది కేవలం ఆరు సంవత్సరాలే..కానీ ఆంద్రప్రదేశ్ చరిత్రలో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారు. ప్రత్యేకించి సంక్షేమ రంగంలో ఆయన పేరు సువర్ణాక్షరాలతో నిలిచిపోతుంది. ఇప్పుడు జగన్ పట్ల ఇంతగా ప్రేమ కనిపించిందంటే.. అందుకు పునాది వైఎస్సార్ అంటే అతిశయోక్తి కాదు.


ఇప్పుడు జగన్ కూడా ఆయన బాటలోనే పయనిస్తున్నాడు.. ప్రత్యేకించి దీనులు, బడుగు జీవుల పట్ల ఆయన చూపించే ప్రేమ వైఎస్ ను తలపిస్తోంది. అధికారంలోకిి రాగానే తీసుకున్న మొదటి నిర్ణయం ఇందుకు ఉదాహరణ.. కిడ్నీ బాధితులకు నెలకు పదివేల రూపాయల  పెన్షన్ మంజూరు చేస్తూ ఆయన తీసుకున్న నిర్ణయం సర్కారు మానవీయతకు అద్దం పడుతోంది.

కిడ్నీ వ్యాధిగ్రస్తుల జీవితం నరక ప్రాయం.. కనీసం నెలవారీ మందులకే ఏడెనిమిది వేలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి.. కిడ్నీ రోగమొస్తే... ఆ వ్యాధిగ్రస్తుడిని బతికించుకునేందుకు ఆ కుటుంబం అప్పులపాలవ్వాల్సిందే.. ఉన్నకాడికి ఆస్తులు అమ్ముకోవాల్సిందే.. 

అలాంటి దుర్భరజీవితాల్లో ఇప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయం కొత్త వెలుగులు నింపుతోంది. నెలకు పదివేల రూపాయల పెన్షన్ వారికి చాలా వరకూ ఆసరాగా నిలుస్తుంది. అందుకే ఇక కిడ్నీ వ్యాధిగ్రస్తుల ఇళ్లలో దేవుడి ఫోటో పక్కన జగన్ ఫోటో ఉండటం గ్యారంటీ.. ప్రతి ఇంట్లో నాన్న ఫోటో పక్కన నా ఫోటో ఉండాలి అంటూ గతంలో జగన్ చేసిన ప్రసంగాలు ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కావడంతో నిజం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: