జగన్, ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు.. ఇక ఒక జట్టు..?

Chakravarthi Kalyan
జగన్ ప్రమాణ స్వీకారానికి తమిళ నేత స్టాలిన్ హాజరుకానుండటంతో ఇప్పుడు సరికొత్త ఊహాగానాలు వస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ దోస్తీగా ఉన్నారు. అటు స్టాలిన్ కూడా వీరితో జట్టు కడతారని.. వీరు ముగ్గురూ ఓ టీమ్ గా ఉంటారని ఊహాగానాలు వస్తున్నాయి. ఈ మేరకు  ఆంగ్ల మీడియాలో కథనాలు కూడా వస్తున్నాయి.


వాటి ప్రకారం.. స్టాలిన్.. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, జగన్ లతో కలిసి భవిష్యత్తులో పనిచేసే అవకాశం ఉందట. కెసిఆర్ పెడరల్ ప్రంట్ వైపు చూసే అవకాశం ఉందని అంటున్నారు. బిజెపికి పూర్తి మెజార్టీ వచ్చిన నేపద్యంలో ప్రస్తుతం కాంగ్రెస్ తో కలిసి ఉన్నా పెద్ద ప్రయోజనం లేదని, పార్లమెంటులో డి.ఎమ్.కె.,వైఎస్ ఆర్ కాంగ్రెస్,టిఆర్ ఎస్ లు కలిస్తే ఏభైనాలుగు మంది ఎమ్.పిలు వీరి కూటమి లో ఉన్నట్లు అవుతుంది. 

మరో వైపు ఇప్పటికే బీజేపీ జోరుగా విస్తరిస్తోంది.. ఆ జోరుకు దక్షిణాదిలో అడ్డుకట్ట వేయాలంటే.. తాము చేతులు కలపాల్సిందేనన్నది వీరి ఆలోచనగా తెలుస్తోంది. , కాంగ్రెస్ లో నే స్టాలిన్ కొనసాగినా, జగన్,కెసిఆర్ లతో సత్సంబందాలు కొనసాగించడం కూడా ఆయన ఉద్దేశం అయి ఉండవచ్చని మరో అబిప్రాయం. నిన్న మొన్నటి వరకూ కాంగ్రెస్ తో కలిసి డి.ఎమ్.కె. తమిళనాడులో పోటీ చేసిన స్టాలిన్ ఇక ముందు వ్యూహం మార్చుకునే ఆలోచన కూడా ఉండొచ్చు.  


ఏదేమైనా దక్షిణాదిలోని ఈ మూడు కీలక పార్టీల నేతలు చేతులు కలపడం కీలకమైన పరిణామమే.. ఇది ముందు ముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది...బీజేపీని ఎంతవరకూ నిలువరిస్తుంది.. జాతీయ స్థాయిలో ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: