జగన్ మొట్ట మొదటి...సంతకం...“అమ్మఒడి” పైనే...!!!

NCR

వైసీపీ అధినేత, ఏపీ సీఎం అయిన జగన్ మోహన్ రెడ్డి ఇంకా సీఎంగా ప్రమాణ స్వీకారం చేయక ముందే స్పీడు పెంచేశారు. తెలుగు రాష్ట్రం అయిన తెలంగాణా సీఎం కేసీఆర్ ని కలిసి రెండు రాష్ట్రాల మధ్య స్నేహ పూర్వక బంధం ఏర్పడేలా చేసిన జగన్, వెనువెంటనే మర్యాద పూర్వకంగా. భారత ప్రధానిగా మరో మారు ఎన్నికైన మోడీ ని , బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ని కలిసి ఏపీ కి సాయం చేయాలి కోరారు. స్పెషల్ స్టేటస్ విషయంలో జగన్ ముందు నుంచీ ఎంత ఖచ్చితమైన వైఖరిని అవలంభించారో ఈరోజు ఢిల్లీలో జరిగిన టూర్, విలేఖరుల సమావేశంలో స్పష్టంగా అర్థమయ్యింది.

 

అంతేకాదు విలేఖరులు అడిగిన ఎన్నో ప్రశ్నలకి సమాధానం చెప్పిన సీఎం జగన్. కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఎంతో హుందాగా, సరికొత్త సీఎం గా కనిపించారు జగన్ మోహన్ రెడ్డి. ఇదిలాఉంటే విలేఖరులు అడిగిన కొన్ని ప్రశ్నలకి జవాబులు చెప్తూ ఏపీ లో లంచగొండితనం పేరు వినపడకుండా చేస్తానని, ఆరు లేదా సంవత్సర కాలంలో ఇలాంటి సీఎం ఉండాలి అనేలా పాలన చేస్తానని చెప్తూనే. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు అండ్ కో రాజధాని భూముల విషయంలో చేసిన అకృత్యాల లెక్కలు తెల్చుతానని హెచ్చరించారు.

 

ఈ క్రమంలోనే ఓ విలేఖరి మీ మొదటి సంతకం ఏ ఫైల్ పై ఉండబోతోంది అంటే అప్పుడు చూద్దురు ఇప్పుడే ఎందుకు అంటూ సైలెంట్ గా ఆ సంచలన విషయాన్ని దాచి పెట్టారు.అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం. జగన్ సంతకం పెట్టబోయే ఫైల్ మధ్య తరగతి, రైతులు, మహిళలకి, ఎనలేని సంతోషాన్ని ఇస్తుందని అన్నారు. ముఖ్యంగా విద్య విధానంలో నూతన ఒరవడిని తీసుకువచ్చే క్రమంలో సమూల మార్పులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రైతులకి మే నెలలో ఇస్తానన్న పెట్టుబడి, అమ్మవడి పధకం అమలు, ఆరోగ్య శ్రీ  వంటి వాటిపై జగన్ తన తొలి సంతకం ఉండబోతోందని తెలుస్తోంది.

 

సీఎం గా ఒక్క ఒక వర్గాన్ని మాత్రమే సంతోష పరచాలని జగన్ అనుకోవడం లేదంటే. వేసవి సెలవలు అవగానే ఎలాగో స్కూల్స్ ప్రారంభం అవుతాయి. ఈలోగానే అమ్మవడి పధకం ప్రారంభించి మధ్య తరగతి మనసులు గెలవాలనేది జగన్ కోరికగా తెలుస్తోంది. అలాగే ఆరోగ్య శ్రీ అమలు, విషయంలో సమూల మార్పులు చేసి తానూ అనుకున్నట్టుగా మళ్ళీ రాజన్న రాజ్యం వచ్చేలా మార్పులు చేపట్టనున్నారట. అలాగే విద్యార్ధుల విషయంలో ఫీజు రీయిమ్బర్స్ మెంట్ పై కూడా కీలక నిర్ణయం తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజునే సంచలనాలకి తెర తీయనున్నారని మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: