రావణ మరణంతో రామాయణం - బాబు ఓటమితో చంద్రాయణం ఫినిష్

పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. ఆ పరిమళం పువ్వు జీన్స్ ద్వారా సంప్రాప్తమైన గుణాలు బహిర్గతం అవుతాయి. అంటే పరిమళం అనేది జన్మ ద్వారా స్వతస్సిద్ధం . దాన్నే మనుషులకు ఆపాదిస్తే - మన సంస్కారం సంస్కృతి మన గృహం నుండే ప్రారంభమౌతుంది. దాన్ని బట్టి మన సంస్కారం బయటపడి వాళ్ళింతే, వాళ్ళపార్టీ వాళ్ళింతే, వాళ్ళ కులమింతే, వాళ్ళ బ్రతుకింతే అంటాం! ఇలాంటి పద ప్రయోగం ప్రజల్లో పదే పదే జరిగిపోతుంది.


చంద్రబాబు అండ్‌ కో అంటే చంద్రబాబు ఆయన కుటుంబం, పార్టీ వ్యక్తులు, రాజకీయ ఆర్ధిక వ్యాపార భాగస్వాములు, బందు కులజనుల అన్నీ స్వార్ధ ప్రయోజనాలు కేంద్రం నుండి పొంది నేడు కేంద్రాన్ని నరేంద్ర మోడీని అసహ్యకర పదజాలం వాడుతూ మాట్లాడటం కృతఙ్జత లేమిని చూపిస్తుంది, అది క్షమార్హం కాదు.

స్వంత ప్రయోజనాలు పిండు కోవటం పూర్తయ్యింది. కేంద్రం నుండి ప్రత్యేక పాకేజీ పొందారు దానికి చంద్రబాబు శాసనసభ తీర్మానం ప్రధాన సాక్ష్యం. అయితే నిండు శాసనసభలో చంద్రబాబు చేసిన ప్రకటన అబద్ధమా? వెంకయ్య గారికి పలుచోట్ల సన్మానం చేసిన విషయం అబద్ధమా? అయితే ప్రత్యేక పాకేజీ సొమ్మేమైంది? ఇది ప్రజలు అడుగుతున్న సమాచారం. అది మోడి-బాబుల సొమ్ము కాదు కదా! ప్రజలకు లెక్క చెప్పాలి. ప్రజా ఆడిటు లో ఫెయిల్ అయితే రాజకీయ జీవితం శంకరగిరి మాన్యాలే పడుతుంది, 


ప్రతిపక్షం వైసిపి ప్రత్యేక హోదాగ్నిని చల్లారనివ్వలేదు దానికి జనసేన ఆజ్యం పోసింది. జగన్‌ తన ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ఉదృతం చేశారు. ఒకనాడు అంటే నరేంద్ర మోడీ బిజేపితో మైత్రి నేరపిన రోజుల్లో ప్రత్యేక హోదా అన్న ప్రతి ఒక్క వ్యక్తిని ఏ తారతమ్యం లేకుండా తన్ని, వీపు పగల గొట్టి జైళ్ళలో కుక్కేశారు. చివరకు జగన్‌ రగిల్చిన అగ్నిలో తెలుగుదేశం అధినేతతో సహా మాడి మసవ్వటం తప్పదని తెలిసింది. ఇంకేం ఇప్పుడు ప్రత్యేక హోదాదా అంటూ యూటర్ఫ్న్ తీసుకొని ఎన్నికలకోసం మడమతిప్పారు నాలుక మడతేశారు చంద్రబాబు. లెక్కలు తేలనన్ని సార్లు యూ-టర్న్‌ లు తీసుకుంటూ వచ్చారు. జనంలో తమపట్ల అసహ్యత తీవ్ర స్థాయిలో పెంచుకున్నారు.


"లొకేష్‌ తండ్రి" గురించి నరేంద్ర మోడీ మాట్లాడిన తీరు ప్రజల ఆలోచనలను తట్టిలేపింది. అసహ్యంగా లేని ఆయన ప్రజలలో చంద్రబాబు పై ఉన్న ప్రచారాలు నిజమేనన్న భావనను ఖచ్చితంగా తట్టిలేపి అవి నూరుశాతం నిజమేనని అనుకునేలా చేశారు. అయితే నాలుగేళ్ళు బిజెపితో అంటకాగిన చంద్రబాబు నరెంద్ర మోడీపై, మోడీ తల్లిపై, మోడీ భార్యపై చేసిన వ్యాఖ్యలు భవిషత్తు లో చంద్రబాబును కట్టి కుడిపేది ఖాయం. కుటుంబం పట్ల నరేంద్ర మోడీకి గౌరవం లేదన్న మాట అర్ధ సత్యమే. నారెంద్ర మోడీకి లేనిది కుటుంబం పట్ల ప్రేమ కాదు వారసత్వం పట్ల గౌరవం అని గుర్తించలేని చంద్రబాబు కూసిన కారుకూతలు ఎన్నికల వేళ ప్రజల ఓటింగ్ లో ప్రతిధ్వనించాయి. ఆ కసే ఓట్ల శాతంలో ప్రస్పుటమైంది.


అక్షరం పలకలేని, వాక్యం ఉచ్చరించ లేని, నారా లోకెష్‌ ను పదవి లోకి చంద్రబాబు వారసత్వం తీసుకు వచ్చింది. అయితే నరేంద్ర మోడీ తల్లి హీరా బెన్‌ గాని, భార్య జసోదా బెన్‌ గాని, సోదరులు గాని, నరెంద్ర మోడీ చేత వారసులుగా తీసుకు రాబడ లేదు పదవులు పంచుకొని ప్రతి ఒక్కరిని విచక్షణ విఙ్జత లేకుండా అగౌరవ పదజాలంతో దూషించ లేదు సరి కదా! వారెప్పుడూ వారసత్వం పేరు చెప్పుకోని ప్రజల్లోకి రాలేదు.


కుటుంబ బంధాలు మోడీకి లేవని, చంద్రబాబు వెటకారం చేశారు. ప్రజలకు ఏ మాత్రం సేవ చేయకుండానే లోకెష్ గాని బాలకృష్ణ, ఆయన రెండవ అల్లుడు శ్రీభరత్ గాని. విూ కుటుంబ బంధాలు ప్రజలకు నిష్ప్రయోజనమే కదా! రాజకీయల్లోకి వారంతా తండాలకు తండాలు వరదలా వస్తూనే ఉన్నారు. ఆఖరకు సినిమాకు వినోద పన్ను ప్రయోజనం కూడా వేరెవరికి దక్కకుండా బామ్మర్ది బాలకృష్నే పొందాడు కదా! వీళ్ళు అటు ప్రజలకు ఇటు సినిమా రంగానికి మోయ లేని భారంగా ఒక రకంగా గుదిబండలా మారింది.


అయితే నరేంద్ర మోడీ ఆ వారసత్వ భారాన్ని ప్రజలపై మోపలేదు. ప్రజల్లోకి వచ్చాడు కాబట్టే చంద్రబాబు కొడుకు లొకేష్‌  ను, లొకేష్‌ తండ్రి చంద్రబాబు ను బామ్మర్ది బాలకృష్ణను, బాలకృష్ణ అల్లుళ్ళు లోకెష్ & శ్రీభరత్ లను నరేంద్ర మోడీయే కాదు ప్రజలు కూడా ప్రశ్నిస్తారు. బాబు హీరా బెన్‌ గారిని,  జసోదా బెన్‌ గారిని ఈ రొచ్చులోకి తీసుకురావటం ఎప్పటికైనా ప్రశ్నార్ధకమే! అంతేకాదు మీ దుర్మార్గాన్ని వాళ్ళతో పోల్చుకోవటంతో మీ పాపం విలువ దాని దుష్పలితం నూరురెట్లై చంద్ర బాబు అండ్ ఫామిలీని రాజకీయంగా ఉరెయ్యటం సంపూర్ణం కానుంది.


చంద్రబాబు మామగారికి వెన్నుపోటు వేసిననాడు ఆయనకు దాని తీవ్రత కనిపించలేదు. ఎందుకంటే అప్పుడు అధికారమనే తిమ్మిరి ఆయనకు స్పర్శఙ్జానంతొ పాటు పంచేంద్రియ ఙ్జానం  కోల్పోయేలా చేసింది. ఇప్పుడు ఆ వెన్నుపోటే వారిని వేటాడబోతుంది.


"ప్రయివేటుగా ఉన్నంత వరకే విూ జీవితం విూది పబ్లిక్‌ లోకి వస్తే ఎమైనా అంటారు"  అన్నారు ప్రముఖ రచయిత శ్రీరంగం శ్రీనివాసరావు గారు. చంద్ర బాబు తల్లి గారు తన మనవడు లోకేష్ కు కోట్లాది రూపాయిల విలువైన ఆస్తులు యిచ్చారు. అలాగే దేవాన్ష్‌ పుడుతూనే తాతగారు అంటే చంద్రబాబు ₹ 20 కోట్లకు అధిపతిని చేశారు.


"విూరు విూ కుమారుడు భార్యల సంపాదన పై జీవించే పరాన్నజీవులని విూ ఇద్దరే పలుమార్లు బహిరంగ సభల్లో చెపుతూనే ఉన్నారు. విూ కుటుంబ సభ్యులకు 'క్యూ' లో నిలబడాల్సిన పనిలేదు. మరి కుటుంబ సభ్యులకు ఆ క్యూలో నిలబడాల్సిన యోగం తప్పించింది మీరే కదా! ఎందుకంటే పెద్ద నోట్ల రద్ధు అమలు వైఫల్యం చెందటానికి ఆ కమిటీకి కన్వీనర్‌ చంద్రబాబు అసలు కారణం అంటారు కొందరు. అసలు "డిమోనెటైజేషన్‌ ఇంప్లిమెంటేషన్‌" పూర్తిగా విూ వైఫల్యం మాత్రమే అనటాని కి సంకోచించాల్సిన పని లేదు. ఆయన అనుయాయి శేఖర రెడ్డి ఇంట్లో వందల కోట్ల రుపాయిలు బయటపడటమే దానికి పెద్ద ఋజువు" అని చంద్రబాబును జనాలు ప్రశ్నించబోతున్నారు. డిమోనెటైజేషన్‌ వైఫల్యం దాని అమలు కన్వీనర్ చంద్రబాబు బాధ్యతా వైఫల్యమే అని కొందరు విశ్లేషకుల భావన.

నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్‌ మోడీ గారికి క్యూలో నిలబడటం కొత్త గాదు. దానికి నరేంద్ర మోడీ ప్రధాని కావటానికి పెద్ద తేడా ఉండి ఉండదు. అందుకే నరేంద్ర మోడీ తల్లైనా అందరి లాగానే ఆమె క్యూలో నిలబడింది. ఈ రోజు నరేంద్ర మోడీ ప్రధాని. 2019 లో ప్రధానిగా ఉన్నా, 2024 లో బిజెపి సిద్ధాంతాల ప్రకారం పదవి నుండి దిగి పోవచ్చు. అప్పుడు కూడా ఆయన తల్లి కుటుంబ సభ్యులు క్యూ లోనే నిలబడి వారి పనులు వారు నిర్వహించుకోవాలి.


లింగమనేని ఎస్టేట్ (అక్రమ నిర్మాణమని చెపుతారు) బాబుగారి అద్దె ఇంటికి కూడా అంగరంగ వైభోగం-ఇదే ప్రజల సంపద సృష్టి 


ఎందుకంటే నరేంద్ర మోడీ జీవన విధానమే అంత. ఆయన నేహౄ-గాంధి-వాధ్రా-నారా-నందమూరి-మూలాయం-లాలు-కరుణానిధి-కుటుంబాల్లా పదవులకు అంటి పెట్టుకొని బ్రతక లేదు బ్రతకరు కూడా! వీరికి రాజకీయమే జీవితం-రాజకీయమే వ్యాపారం. నరేంద్రమోడీకి రాజకీయం ఆశయం, వ్యాపకం, ప్రవృత్తి, మానసిక ఆనందం. అందుకే నరేంద్ర మోడీ చూసేది క్రింది స్థాయి జీవితాలను సాధారణ స్థాయి కైనా తీసుకు రావటం. దానికి డబ్బు కావాలి. అందుకు మన చంద్రబాబు కోరితే అపాయింట్మెంట్‌ యివ్వకపోవచ్చు. అర్ధరాత్రి భారత్‌ లో పెట్టుబడి పెడతానంటే బిల్‌ గేట్స్‌ దగ్గరికైనా వెళ్ళి చేతులు కట్టుకొని ఆహ్వానిస్తారు. తేడా కొడితే జింగ్‌ ను కూడా ఢీ కొంటారు.


ఎందుకంటే ఈ పోరాటంలో నమో తనను తాను కోల్పోతే  అంటే ఆయనే పోతే ఆయన కొచ్చే నష్టం ఏవిూ లేదు. దేశం బాగుంటే చాలు!  నిరు పెదరికం అనుభవించి అందులో నుంచి పైకి లేచిన క్షిపణి నరెంద్ర మోడీ – అందుకే అమ్మ అన్నం వండి పోయ్యిని గొట్టంతో ఊదుతూ ఉన్నప్పుడు ఆమె ముఖంపై బూది నుసి చూసి  కాంగ్రెస్‌ దాదాపు ఆరు దశాబ్ధాల్లో చేయలేని ప్రజా సేవ పదవిలోకి రాగానే పదమూడు కోట్ల గాస్‌ కనక్షన్లు అందిస్తూ మాతృమూర్తులు, సోదరీమణుల ఆర్తి తీర్చే పనిలో పడ్డారు.


తన బావ చెల్లెళ్ళు చేసిన ఆర్ధిక నేరాలను కప్పి పుచ్చటానికి రాజకీయాల్లోకి రాలేదు. తన కొడుకును తన తరవాత ముఖ్యమంత్రిని చేయటానికి ప్రయత్నించలేదు. హెరిటేజ్‌ లాంటి వ్యాపార సంస్థలను భార్యా కోడళ్లతో నిర్వహింపజేస్తూ వారికి రాజకీయ రక్షణ వలయం కలిపిస్తూ దేశంలోని డైరీ వ్యవస్థలను పాడి పాల పరిశ్రమలను నిర్మూలించలేదు. సహకార సంఘాలను ఆచూకి లేకుండా చేయలేదు.


భారత్‌ గుర్తుంచు కోవలసిన ప్రధాన మంత్రులు ఇద్దరు మాత్రమే ఒకరు లాల్‌ బహదూర్‌ శాస్త్రి, మరొకరు నరేంద్ర మోడీ. ఇద్దరూ పాతాళం నుండి ఆకాశం వైపుకు దూసుకు వచ్చిన నిరు పేద క్షిపణులు. ప్రజా జీవితాన్ని మార్చ ప్రయత్నించిన కెరటాలు. వారి రూపు రెఖల్లో ఏదైనా మార్పు వచ్చినా అది దేశం అవసరాలకు తగిన ప్రాతినిధ్యం గౌరవం ఇవ్వటానికే. అది పదవి వలన వచ్చిన మార్పు కాదు! దాన్ని రాహుల్‌ గాంధి చంద్రబాబు ఎత్తిపొడిచే అవసరమే లేదు. ఒకరు నోట్లో బంగారు చంచాతో పుట్టారు. మరొకరు వెన్నుపోట్ల దందాతో పిల్ల నిచ్చిన మామను సైతం వేటేసి బంగారు చంచా నోట్లో పెట్టుకున్నారు. వీళ్ళేనాడు మాట నిలబెట్టు కోలేదు. 


క్షేత్రస్థాయి నిజాలు తెలిసిన శాస్త్రీ-మోడీలు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేరు అనేది నమ్మకూడని విషయం. మళ్లీ నరేంద్ర మోదీయే భారత ప్రధాని అవుతారంటూ ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ జాతీయ ఉపాధ్యక్షుడు ప్రశాంత్‌ కిశోర్‌ అభిప్రాయపడ్డారు. 2019 ఎన్నికల్లో ఎన్డీయే కూటమే అధికారంలోకి వస్తుందంటూ వ్యాఖ్యా నించారు. రాష్ట్రంలో చంద్రబాబు 2019 లో అధికారంలొకి రారని చెపుతున్నాయి సర్వే సంస్థలు రాజకీయ విశ్లేషకులు. ఒకవేళ చంద్రబాబు అధికారంలోకి వస్తే కేంద్రం లో నరేంద్ర మోడీ ప్రభుత్వమే ఉంటే, మరోసారి ఏపి ప్రజలకు మరో ఐదేళ్లు ఇబ్బందులు తప్పవు.


అంతే కాదు ఒకవేళ కాంగ్రెస్‌ అధికారం లోకి వచ్చినా రాహుల్‌ గాంధి ప్రత్యేక హోదా యివ్వలేకపోవచ్చు. కారణం బిహార్‌, ఉత్తర ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్, తమిళనాడు లాంటి పెద్ద రాష్ట్రాలు ప్రత్యేక హోదా కోరే అవకాశాలు మెండుగా ఉంటాయి.


నరెంద్ర మోడీ ఈ జాతికి నేర్పింది స్వచ్చ భారత్‌. అది ఇప్పుడు క్రమంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కారణం గ్రావిూణ జీవితం నుండి ఉద్భవించిన నరేంద్ర మోడీ జీవితంలో నిద్రాణంగా ఉన్న శుచి శుభ్రత పట్ల ఉన్న విలువలు. అంతే కాదు విశ్వానికే భారతీయ యోగ విద్య ప్రచారం చేసి నేర్పించిన అమలు చేసి విశ్వానికే మానసిన ఆరోగ్య ప్రధాత మన ప్రధాని నరేంద్ర మోడీ. ఆయన గురించి అంత హేళనగా, అవమానకరంగా మాట్లాడటం చంద్రబాబు ఇంటి సంస్కారమా! అయితే వీళ్ళని ప్రశ్నించాల్సిన పవన్ కళ్యాణ్ నోరు మూసుకోకుండా అసలు పరిపాలనే చేయని ప్రతిపక్ష నేత జగన్మోహనరెడ్డిని ప్రశ్నించటంతో ప్రజల్లో ఆయన కథ కూడా అడ్డం తిరిగినట్లే కనిపిస్తుంది. 


ప్రజలకు పాలకుడు ఇవాల్సింది సంపద కాదు. సమర్ధ  పాలన, వ్యవస్థల సృష్టి, విద్య విఙ్జానం, వైద్యం ఆరోగ్యం, సంస్కృతి సంస్కారాలను కొనసాగించే సమర్ధత నేర్పాలి. ముందు తానాచరించాలి. ఆ తరవాతే అందరిని ఆచరించమనాలి. ఒక సంపద సృష్టికర్త, కుల ప్రేమికుడు, వారసత్వాన్ని కుతుంబాన్ని ప్రేమించే చంద్ర బాబు అలా చేయగలరా?  చంద్రబాబు ప్రతి వ్యవస్థ పలితాలను తన సామాజికవర్గ ప్రయ్హోజనం కోసం, తనను అనవరతమూ కాపాడే కులమీడియా సంపదలు పెంచుకోవటం కోసం, వ్యవస్థల  దారి తప్పించారు కాని ప్రజో పయోగం కోసం మాత్రం కాదు.


చంద్రబాబు ఇప్పుడు ఒకసారి తన కులజనులను కాకుండా, సాధారణ ప్రజల్లోకి వేగులను పంపి, తన గురించి, తన దుర్మార్గాల గురించి, ఏమనుకుంటున్నారో తెలుసు కుంటే మంచిది. చంద్రబాబు (లు) లో ప్రవహించేది రక్తం కాదు కరుడు గట్టిన స్వార్ధమనే అంటున్నారు. తాజెడ్డ కోతి వనమెల్ల చెరచు అన్నట్లు చంద్ర బాబు కొంత తన కులాన్ని ఆఖరకు పూర్తిగా తన కొడుకుని కూడా చెడగొట్టేసి (కుల-కుటుంబ) హీనుడయ్యారు. 


తన వైఫల్యాలను ముందే ఊహించి వ్యవస్థలను వంచిస్తూ తన స్వయంకృత నేరాలను ఎన్నికల సంఘం, ఆ తరవాత ప్రధాన కార్యదర్శి తదితరులపై నెట్టే కుట్ర, కుతంత్రం, కుయుక్తులు పన్నే ప్రయట్నాం చూస్తూనే ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త.   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: