ఎడిటోరియల్ : టిడిపికి అభ్యర్ధులు కావలెను

Vijaya

అవును క్షేత్రస్ధాయిలో పరిస్ధితులు చూస్తుంటే అలాగే ఉంది తెలుగుదేశంపార్టీ వ్యవహారం. విషయం ఏమిటంటే, ఎంపిగా పోటీ చేయటానికి చాలామంది నేతలు వెనకాడుతున్నారట. దాంతో ఎవరిని లోక్ సభకు పోటీ చేయించటానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నా సాధ్యం కావటం లేదు. అధికారంలో ఉన్న టిడిపి తరపున పోటీ చేయటానికి సీనియర్ నేతలు, ప్రస్తుత ఎంపిలు వెనకాడుతున్నారంటే పరిస్ధితులు ఎంత దయనీయంగా ఉందో అర్ధమైపోతోంది.

 

మొన్నటి వరకూ ఒంగోలు ఎంపిగా మాగుంట శ్రీనివాసుల రెడ్డిని పోటీ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా ఆయన ఎంపిగా పోటీ చేయనని చెప్పేశారట చంద్రబాబుతో. ఇపుడు ఆ స్ధానం నుండి పోటీలోకి దిగటానికి జిల్లాలోని నేతలెవరూ సిద్ధంగా లేరు. అలాగే, నెల్లూరు ఎంపిగా పోటీ చేయటానికి కూడా నేతలు వెనకాడుతున్నారు. ఒకసారి ఆదాల ప్రభాకర్ రెడ్డన్నారు. తర్వాత బీద మస్తానరావున్నారు. మధ్యలో జిల్లా పరిషత్ ఛైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. జిల్లా పరిషత్ వైఎస్ ఛైర్మన్ వేనాటి రామచంద్రారెడ్డి పేరు కూడా ప్రచారంలో ఉంది. అంటే చంద్రబాబు ఎంతమందిని అడిగినా ఒక్కరు కూడా ముందుకు రావటం లేదు.

 

కాకినాడలో సిట్టింగ్ ఎంపి తోట నర్సింహం పోటీకి దూరమని చెప్పేశారు. శ్రీకాకుళంలో ఎంపికి కాకుండా టెక్కలి అసెంబ్లీకి పోటీ చేయాలని ఉందని ఎంపి కింజరాపు రామ్మోహన్ నాయుడు చెప్పేశారు. విశాఖపట్నం ఎంపిగా మంత్రి గంటా శ్రీనివాసరావు, బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్, ఎంఎల్ఏ పీలా గోవింద తదితరుల పేర్లు పరిశీలనలో ఉంది. ఏలూరు ఎంపిగా పోటీ చేయటం ఇష్టం లేదని చెప్పినా మాగంటి బాబునే చంద్రబాబు మళ్ళీ పోటీ చేయిస్తున్నారు.

 

రాజంపేట ఎంపిగా ఇంత వరకూ అభ్యర్ధే దొరకలేదు. కడపలో అతికష్టం మీద ఫిరాయింపు మంత్రి ఆదినారాయణరెడ్డిని పోటీకి ఒప్పించారు. విజయవాడ ఎంపిగా పోటీ చేయటానికి సిట్టింగ్ ఎంపి కేశినేని నాని ఇష్ట పడటం లేదు. అమలాపురం ఎంపి పండుల రవీంద్ర టిడిపికి రాజీనామా చేసిన తర్వాత అభ్యర్ధిని వెతుకుతున్నారు. రాజమండ్రి సిట్టింగ్ ఎంపి మాగంటి మురళీమోహన్ కు టికెట్ ఇవ్వటం చంద్రబాబుకే ఇష్టం లేదట. కాబట్టి కొత్త అభ్యర్ధిని వెతుకుతున్నారు.

 

ఐదేళ్ళపాటు అధికారంలో ఉండి అడ్డదిడ్డంగా సంపాదించుకున్న నేతలు కూడా పోటీకి వెనకాడుతున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. నేతల వైఖరి చూస్తుంటే నిధుల సమస్యగా కనబడటం లేదు. రాబోయే ఎన్నికల్లో టిడిపి గెలవదు అనే స్ధిరమైన అభిప్రాయానికి వచ్చారు. ఎలాగంటే సీనియర్ నేతలు చాలామంది తమ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్ధితిపై ఎవరికివారుగా సర్వేలు చేయించుకున్నారు. గెలవమని తేలిపోయింది కాబట్టే డబ్బులు ఖర్చు ఎందుకని అనుకున్న తర్వాతే ఎంపిలుగా పోటీ చేయటానికి వెనకాడుతున్నారు


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: