ఫస్ట్ టైమ్‌ ఆ పని చేసి.. అమ్మానాన్నకు చెప్పా.. వాళ్లు గర్వపడ్డారు..?

Chakravarthi Kalyan
పెళ్లికెదిగిన పిల్లలున్న తల్లిదండ్రులకు కాస్త గాభరాగానే ఉంటుంది. ఎక్కడ ఎలాంటి దురలవాట్లకు గురవుతారోనని భయపడుతుంటారు. స్నేహితుల ప్రభావంతో ఎక్కడ చెడిపోతారోనని ఆందోళనపడుతుంటారు. కానీ క్రికెటర్ పాండ్య తల్లిదండ్రులు మాత్రం అలా కాదట.



ఈ విషయం స్వయంగా యువ క్రికెటర్ హార్దిక్ పాండ్య టీవీ షోలో చెప్పాడు. హిందీలో బాగా పాపులర్ అయిన కాఫీ విత్ కరణ్‌ ప్రోగ్రామ్‌లో మరో క్రికెటర్ రాహుల్ తో కలసి పాల్గొన్న పాండ్య.. ఆసక్తికరమైన వివాదాస్పద కామెంట్లు చేశారు. ముఖ్యంగా అమ్మాయిలతో స్నేహం, శృంగారం వంటి అంశాలపై కరణ్ అడిగిన ప్రశ్నలకు పాండ్య ఇచ్చిన సమాధానాలు ఇప్పుడు అతన్ని చిక్కుల్లో పడేశాయి.



నేను ఫస్ట్ టైమ్‌ సెక్స్ చేసి ఇంటికివచ్చినప్పుడు.. ఆ విషయం మా తల్లిదండ్రులకు చెప్పాను.. ఆ తర్వాత ఓ పార్టీకి వెళ్లినప్పుడు మా తల్లిదండ్రులు నీ లవర్స్ ఎక్కడ అని అడిగారు. నేను ఒక్కొక్కరినీ వారికి చూపించాను. వారు నావైపు గర్వంగా చూశారు అని చెప్పాడు పాండ్య.



టీవీషోలో పాండ్య ఇచ్చిన సమాధానాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వారిపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో బీసీసీఐ పాండ్యకు షోకాజ్‌ నోటీసు ఇచ్చింది. దీంతో బెంబేలెత్తిపోయిన పాండ్య ముందు ట్వీట్ ద్వారా బేషరతుగా క్షమాపణలు చెప్పాడు. ఆ తర్వాత బీసీసీఐకు వివరణ లేఖ కూడా రాశాడు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: