సుజనా చౌదరి చుట్టూ ₹6000 కోట్ల బ్యాంకు ఋణాల స్కాం తో బిగుస్తున్న ఉచ్చు

మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ పార్లమెంట్ సభ్యుడు సుజనా చౌదరికి ఎన్-ఫొర్స్మెంట్ డైరెక్టొరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. ఈ నెల 27వ తేదీన తమ ముందు హాజరు కావాల్సిందిగా ఈడీ ఆదేశాలు జారీ చేసింది. రెండు రోజులుగా  ఐటీ, ఈడీ అధికారులు సుజనా కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.

 

“బెస్ట్ క్రోప్టస్ అండ్ ఇంజనీరింగ్ ప్రాజెక్టు లిమిటెడ్‌” పై  బ్యాంకులు ఫిర్యాదు చేశాయి. సెంట్రల్ బ్యాంకు నుండి ₹133కోట్లు, ఆంధ్రాబ్యాంకు నుండి ₹71కోట్లు, కార్పోరేషన్ బ్యాంకు నుండి ₹159కోట్లు ఋణాలను తీసుకొని బ్యాంకులను మోసం చేసినట్టు ఫిర్యాదు చేయడంతో సీబీఐ రంగంలోకి దిగి విచారణ చేసింది.

 

ఈ కేసులో భాగంగానే రెండు రోజులుగా ఐటీ, ఈడీ అధికారులు సుజనా ఇళ్ళలో, కార్యాలయాల్లో పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు. సుజనా చౌదరి ఉపయోగిస్తున్న ఆరు లగ్జరీ కార్లు కూడ నకిలీ లేదా డొల్ల కంపెనీలపై రిజిస్ట్రేషన్ అయినట్టుగా ఈడీ ప్రకటించింది. వాటిలో రేంజ్ రోవర్, పొర్ష్, ఫెరారి, బెంజ్ లాంటి అత్యంత ఖరీదైన కార్లు ఉన్నాయి.

 

సుజనా గ్రూప్ కంపెనీలు బాంకులకు ₹5700 కోట్లకు పైగా మోసం చేసినట్టు ఈడీ  గుర్తించింది. నాగార్జున హిల్స్ లో వివిధ షెల్ కంపెనీల్లో 126రబ్బర్ స్టాంపులనుస్వాధీనం చేసుకొన్నట్టు ఈడీ తెలిపింది. ఈ కంపెనీలన్నీ కూడ సుజనా గ్రూపుకు చెందినవిగా ఈడీ ప్రకటించింది.

 

సుజానా చౌదరి కంపనీలపై ఫెమా, డి ఆర్ ఐ, సిబీఐ లాంటి విచారన సంస్థలు కేసులు ఇప్పటికే లాడ్జ్ చేశాయి. ఈంకా ఇతర బ్యాంకుల నుండి కూదా పిర్యాదులు వస్తున్నాయి.


ED@dir_ed

Searches under PMLA were conducted in case of Sri Y.S.Chowdary,MP of Andra Pradesh to investigate #bankfraud of over ₹6000Crore by more than120 shell companies controlled by Sri Y.S.Chowdary.

418

5:01 PM - Nov 24, 2018


D@dir_ed

Searches resulted in recovery of incriminating documents & 6 high valued luxury cars purchased by Shri Y S Chowdary in the name of shell companies.

209

5:02 PM - Nov 24, 2018


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: