చంద్రబాబు క్లీన్ బౌల్డ్ – ఇక నందమూరి కుటుంబం మాత్రమే టిడిపికి శ్రీరామరక్ష

చంద్రబాబుకు ఇప్పుడు పతనం ప్రారంభమైంది. అది ఆయన పలు సందర్భాల్లో మాటలదిన తీరును బట్టే తెలుస్తుంది. ఆయన మనసంతా భయమే. గుండెల నిండా అలజది నెలకొంది. కేసుల భయం వెన్నాడుతుండగా ఆ విషయాన్ని ఆయనే చెప్పుకుంటూ ఒకటికి పది సార్లు తన మీద కేంద్రం కేసులు పెడుతుందని వాపోతున్నాడు. ప్రజలంతా తన చుట్టూ వలయం గా ఏర్పడి తనను తనప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అనటం ప్రజల్ని అయోమయంలో పడేస్తున్నారు.

తనకు అధికారం ఇచ్చి మము బ్రోవమని చెప్పిన ప్రజలు, ఆయన బేలతనం చూసి ఖంగారు పడుతున్నారు. ఒక ముఖ్య మంత్రి ని, అదీ నాలుగు దశాబ్ధాల సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఏకైన భారతీయ నాయకుడిని సామాన్య ప్రజలెలా రక్షించాల్సిన పరిస్థితులు ఎందుకొచ్చాయో వారికి అర్ధంకాక తలలు పట్టుకుంటున్నారు.  అంటే, చంద్రబాబు ఏదో పెద్ద పెద్ద తప్పుడు పనులేచేసి ఉంటాడని అందుకే ఆయన కేంద్రం నుంచి ముంచుకువస్తున్న కీడును శకించే- కేసులకు పెడుతున్నార ని భయపడుతున్నాడని పసి పిల్లలకైనా అర్థం అయిపోతోందని అంటున్నారు. 

మనం ఏ తప్పూ చేయనప్పుడు, మనలో ఏ లోపం లేనప్పుడు కేసులంటూ బెదిరిపోవటం ఎందుకని, తనపై సిబీఐ కేసుల ద్వారానే దాడి చేస్తుందని చంద్రబాబుకు ముందే ఎలా తెలుస్తోంది? మరో రకమైన ఏ ఆందోళన లేని చంద్రబాబు, కేవలం కేసుల పేరుచెప్పి  ఎందుకు వణికిపోతున్నారు? ఇవన్నీ తాము ఎన్నుకున్న అధికార పార్టీ అధినేత నోటి నుంచి పలకటం అందరికి షాకే!  

అసలు చంద్రబాబు మీద కేసులే పెట్టాలంటే లెక్కకుమిక్కిలిగా బొక్కలున్నాయని, అనేకానేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆ భయం వెన్నాడుతుండగా, మనోదౌర్భల్యంతో చంద్రబాబు తాజాగా ఏపీలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్-సిబీఐ కార్యకలాపాలను నిరోధిస్తూ “నో ఎంట్రీ ఫర్ సిబీఐ ఇన్ ఏపి జిఓ 176 విడుదల చేశారు. చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం సంచలనంగా మారింది. 

తమ రాష్ట్రంలోకి సీబీఐ అడుగు పెట్టకూడదని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంటోంది. సాధారణంగా కేంద్ర ధర్యాప్తు సంఘానికి ఏ రాష్ట్రంలోనైనా విచారణ జరిపే హక్కు ఉంటుంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఏదో అవకాశాన్ని ఉపయోగించుకుని సీబీఐ ఏపీలో కార్యకలాపాలను కలిగి ఉండటానికి లేదని, తాము అను మతిస్తేనే సీబీఐ అధికారులు ఏపిలోకి రావాలని నిర్ణయం తీసుకుంది. ఇది చట్టపరంగా ఏ మేరకు చెల్లుతుందో తెలియదు.

కానీ చంద్రబాబు నాయుడు మాత్రం తన బలహీనతను పూర్తిగా బట్టబయలు చేసుకొని,  సీబీఐ అంటూ ఏపిలోకి ప్రవెసిస్తే తనపై కేసుల విచారణ కోసమే అనే భయంతో, ఆ సంస్థే ఏపీలో అడుగుపెట్టడానికి వీల్లేదని జీవో విడుదల చేయించుకున్నారు. చంద్రబాబు ఎన్నో తప్పులు చేసి ఉండకపోతే ఇంతగా భయ పడుతూ ఉండాల్సిన అవసరమేముంది అంటూ చర్చలు కూడా జనసామాన్యంలో జరుగుతున్నాయి. 

ఇదిలా ఉంటే, బాబు ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఓటమి తప్పదని, తన సామాజిక మీడియా సైతం తన అస్థిత్వం కోల్పోగా ఇప్పుడు తనను రక్షించలేదనే బలమైన విశ్వాసంతో,  తెలంగాణలో కాంగ్రెస్ పొత్తుతోనైనా, తన అనుకూల ప్రభుత్వం అధికారంలోకి తెచ్చుకోవాలనేది చంద్రబాబు ఉద్దేశం. అందుకే తెలంగాణా ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 

ఇక్కడ గెలుపోటముల ప్రభావం వచ్చే ఆంద్రప్రదేశ్ ఎన్నికలపై ఉంటుందని భావించిన చంద్రబాబు తనకు చిరకాల ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు. తనకు సీట్లు ముఖ్యం కాదని గెలుపు ముఖ్యమని పార్టీ శ్రేణులకు చంద్రబాబు ఉద్భోదించారు.  ఎందుకంటే తెలంగాణలో తాను గెలవగలిగే సింగిల్ డిజిట్ సీట్లు తో చేసేదేమీ ఉండదని చంద్రబాబుకు తెలియందికాదు. ఒకవేళ తాను ఊహించినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే మంత్రివర్గంలో చేరి కొంతలో కొంత పట్టు సంపాదించుకునే వీలుంటుందని, తనకు ప్రత్యర్థిగా మారిన తెలంగాణా ముఖ్యమంత్రి కెసీఆర్ కు కూడా తన సత్తా రుచి చూపించినట్లు అవుతుందని ఆయన కాంగ్రెస్ తో జతకట్టి తక్కువ స్థానాలతోనైనా సంతృప్తి పడిపోయారు. 

ఇక వచ్చే 2019ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ లో టిడిపికి  మద్దతిచ్చే పార్టీ ఏదీ ఉండదు ఒక్క కాంగ్రెస్ తప్ప. కాంగ్రెస్ తో టిడిపి పొత్తును జనం అసాంతం హర్షించ రన్నది వేరే విషయం.  గత 2014ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినీ గ్లామర్, బిజెపి నరేంద్ర మోడీ ప్రభంజనం బాగా పనిచేయటంతో వైసిపిపై అతి స్వల్ప ఆధిక్యతతో, కాపు సామాజికవర్గం ఓట్లు కూడా టిడిపికి అనుకూలంగా పోలవ్వడంతో సులువుగా అధికారంలోకి రాగలిగారు బాబు. తన అనుభవం చూసి సామర్థ్యంపై ఏపీ ప్రజలు నమ్మకం పెట్టుకోవడంతో గెలుపు సాధ్యమయింది.  అయితే ఈసారి పవన్ మద్దతు లేదు. మోదీ ప్రధాన శత్రువుగా మారారు. రాజధాని, పోలవరం నిర్మాణం కూడా పూర్తికాక పోవడంతో చంద్రబాబు సమర్థతను అనుభవాన్ని కూడా ఈసారి ఏపీ ప్రజలు పరిగణనలోకి తీసుకోరు.

దీంతో చంద్రబాబు తను పదవిలోకి రావటానికి ఇప్పుడు మరోసారి సినీగ్లామర్ అవసరం వచ్చింది. అయితే ఇప్పటికే టాలివుడ్ లో తనకు మద్దతు ఇస్తున్న వారెవరికీ ప్రజలను ఆకర్షించే స్థాయిలో లేదన్నది చంద్రబాబుకు తెలుసు.  2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ పార్టీ కోసం ప్రచారం చేశారు ఆ సందర్భంగా ఆయన అత్యంత భయంకరమైన ప్రమాదానికి కూడా గురయ్యారు. అయితే 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాన్ ఉండటంతో జూనియర్ ను నిర్లక్ష్యం చేశారు. హరికృష్ణకు కూడా రాజ్యసభ సభ్యత్వం రెన్యువల్ చేయకపోవడం కూడా కొంత ఆ కుటుంబంలో చంద్రబాబు పట్ల తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. 

ఇక జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు కుళ్ళు రాజకీయాలకు ఒక నమస్కారం పెట్టి, పూర్తిగా సినిమాలపైనే దృష్టి కేంద్రీకరించారు. రాజకీయాలవైపే,  వచ్చే ఆలోచనే ఆయన చేయడంలేదు. మహానాడు వంటి కార్యక్రమాలకు కూడా ఆ కుటుంబం దూరంగా ఉంది. బావమరిది బాలకృష్ణ ఉన్నప్పటికీ ఆయనకంటే జూనియర్ కే ఎక్కువ అభిమానుల బలం ఉన్నట్లు  చంద్రబాబు తాజాగా గుర్తించారు.

హరికృష్ణ మరణించడంతో ఆ కుటుంబాన్ని మళ్లీ దగ్గరతీసుకునే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ను వచ్చే ఎన్నికల ప్రచారంలో ఉపయోగించు కోవాలన్నది చంద్రబాబు ఆలోచన. అందుకోసమే హరికృష్ణ కూతురు సుహాసినిని తెలంగాణ రాజీకీయాల్లోకి తేవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
తొలుత కూకటపల్లి స్థానం కోసం హీరో నందమూరి కల్యాణ్ రామ్ ను సంప్రదించినప్పటికి, ఆయన సున్నితంగా తిరస్కరించడంతో సోదరి సుహాసినిని పోటీచేసేందుకు ఒప్పించారు. తద్వారా ఇటు హరికృష్ణ ఫ్యామిలీని దగ్గరకు చేసుకోవడంతో పాటు జూనియర్ ఎన్టీఆర్ ను వచ్చే ఎన్నికల్లో ప్రచారానికి ఉపయోగించుకోవచ్చన్నది చంద్ర బాబు ఆలోచన. 

సోదరి సుహాసిని కూకటపల్లి నియోజక వర్గంలో పోటీ చేసినా జూనియర్ ఎన్నికల ప్రచారానికి వస్తారా? అన్నది సందేహమేనన్నది కొందరి వాదన. అభిమానులైతే ససేమిరా! అంటుండటంతో – మరేం జరుగుతుందోచూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: