కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధి - సోనియా గాంధిలకు ధారుణమైన ఎదురుదెబ్బ

ఆర్ధిక నేరాలు, స్కాములు లాంటి తప్పుడు పనులు చేయటంలో కాంగ్రెస్ ఆరితేరింది. బోఫోర్స్ లాంటి అత్యంత ప్రతిష్టాత్మక స్కాములలో ప్రధాన బాగస్వాములైన నెహౄ గాంధి కుటుంబం విధానాల్లో ఏలాంటి మార్పులు రాకపోగా తమ రాజకీయ వ్యతిరేఖ పక్షాలపై బురద జల్లటానికి ఎంతదూరమైనా వెళతారనే అప్రతిష్ఠ మూటగట్టుకుంది. 

నెహౄ కుటుంబానికి చెందిన "నేషనల్‌ హెరాల్డ్‌" పత్రికపై పెండింగ్లో ఉన్న ఆదాయం పన్ను కేసులో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి, సోనియా గాంధీ భారీ ఎదురు దెబ్బ తగిలింది. 2011-2012 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి "పన్ను రీ-అసెస్‌మెంట్‌" కోరుతూ ఆదాయం పన్ను శాఖ ఇచ్చిన నోటీసును సవాలు చేస్తూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు సోమవారం తోసిపుచ్చింది. పన్ను ప్ర​క్రియలను తిరిగి తెరిచే అధికారం ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌కు ఉంటుంద ని తెలిపింది. సమస్యలు ఏమైనా ఉంటే ఆదాయపు పన్ను శాఖనే సంప్రదించాలని సూచించింది. 

నేషనల్‌ హెరాల్డ్‌ కేసుకు సంబంధించి, 2011-12 ఆర్థిక సంవత్సరపు "పన్ను రీ-అసెస్‌మెంట్‌" ను ఆదాయపు పన్ను శాఖ తిరిగి తెరవడంపై రాహుల్‌ ఢిల్లీ హైకోర్టు ను ఆశ్రయించారు.  "యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌" కు "రీ-ఎసెస్‌మెంట్ నోటీసులు" పంపడంలో ఆదాయం పన్ను శాఖకు 'దురుద్దేశాలు' ఉన్నాయని సోనియాగాంధీ గత నెలలో ఢిల్లీ హై-కోర్టుకు తెలియ జేశారు. యంగ్‌ ఇండియ కంపెనీకి రాహుల్ గాంధీ డైరెక్టర్‌గా ఉన్నారు. అయితే దాని నుంచి రాహుల్‌ గాంధీ ఎలాంటి ఆదాయాన్ని ఆర్జించడం లేదని ఈ కాంగ్రెస్‌ అధ్యక్షుడి న్యాయవాది తెలిపారు. 

రాహుల్‌ గాంధీ యంగ్‌ ఇండియా కు డైరెక్టర్‌ గా ఉన్న విషయాన్ని దాచిపెట్టారని ఆదాయపు పన్ను శాఖ ఆరోపించింది. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఇది ప్రధాన ముద్ధాయి. ఆదాయపు పన్ను శాఖ దగ్గర రాహుల్‌ గాంధీ నిజాలు దాయడంతో,  ₹ 154.97 కోట్ల విలువైన మొత్తాన్ని ఆర్జించినట్టు పేర్కొంది. ఈ కేసులో మొత్తం ₹249.15 కోట్ల అధికార దుర్వినియోగమైనట్లు సమాచారం. 

ఈ యంగ్ ఇండియా కంపనీ ₹ 50.00 లక్షల పెట్టుబడితో నవంబర్ 2010 లో నేషణల్ హెరాల్డ్ యాజమాన్య కంపనీ ఐన "అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్-ఏజేఎల్" ను కొనగోలు చేసి మొత్తం షేర్ హోల్డింగ్ ను స్వంతం చేసుకుంది. అప్పుడే ఆదాయపు పన్ను శాఖ దాఖలు చేసిన కేసులో ఏజేఎల్ కంపెనీ ఆస్తుల్ని గాంధీల కుటుంబం అధికార దుర్వినియోగం చేసి అన్యాయంగా దోచేసిందన్న ఆరోపణతో కేసు నడుస్తూనే ఉంది.  ఇందులో ₹2000 కోట్ల స్కాం ఉందనేది ప్రదాన ఆరోపణ.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: