రాష్ట్రానికి ప్రత్యేక హోదా జగన్ వల్లే సాధ్యమని బలంగా నమ్ముతున్న స్టూడెంట్స్...!

KSK
ప్రస్తుతం ఆంధ్రరాష్ట్రంలో ప్రత్యేక హోదా అనే అంశం చుట్టూ రాజకీయం నడుస్తోంది. ప్రత్యేక హోదా అనే అంశం ఇప్పటివరకు ఆంధ్రరాష్ట్రంలో సజీవంగా ఉండటానికి గల అసలు కారణం వైయస్ జగన్ అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. రాష్ట్రంలో స్పెషల్ స్టేటస్ కోసం ముందునుంచి చిత్తశుద్ధితో పోరాడుతున్న ఏకైక పార్టీ నాయకుడు వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత జగన్.


ఈ నేపథ్యంలో హోదా సాధన కోసం జగన్ చేసిన పోరాటాన్ని ప్రజలందరికి తెలియచేయవల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలదే అని పార్టీ పెద్దలు అంటున్నారు. ఊరు వాడ ప్ర‌త్యేక హోదాపై పోరాట స్తూర్తిని నింపి, ప్ర‌త్యేక హోదా ఆవ‌శ్య‌క‌త‌ను చాటింది జగన్. జాతీయ స్థాయిలో ప్రత్యేక హోదా ఉద్య‌మానికి ఊపిరి ఊదిన నాయ‌కుడు జగన్ గ‌త నాలుగున్న‌ర‌ సంవ‌త్స‌రాలుగా ఇదే విష‌యాన్ని అన్నివ‌ర్గాల ప్ర‌జ‌ల‌తో స‌మావేశాలు ఏర్పాటు చేసి విద్యార్ధులు యువ‌త హోదా లేక‌పోవ‌టం వ‌ల్ల ఎం కోల్ప‌నున్నారో తెలియచేసింది జగన్  హోదా అంతే జైలే అన్న చంద్రబాబు చేత ఢిల్లీ నుంచి గల్లీదాకా హోదా కావాలనిపించాడు జగన్.


జగన్ చేసిన పోరాట ఉధృతి ఫలితంగానే చంద్రబాబు కేంద్రంతో సంబంధాలు తెంచుకోవలసి వచ్చింది జగన్ చేసిన పోరాటం కారణంగానే తెలుగుదేశం ఎంపీలు పార్లమెంట్ బయట నాటకాలు ఆడాల్సి వచ్చింది. జగన్ తెగించి తన ఎంపీలతో రాజీనామా చేయించినా చంద్రబాబు మాత్రం ఆ సాహసం చేయలేకపోయారు.


ప్రస్తుతం రాష్ట్రంలో ప్రత్యేక హోదా తీసుకురాగలిగే నాయకుడు జగనే అని ప్రతి వర్గానికి చెందిన ప్రజలు నమ్ముతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే చదువుతున్న విద్యార్థులు ఎంతగానో వైసీపీ అధినేత జగన్ పై నమ్మకం పెట్టుకున్నారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో కూడా ఉన్నా చాలామంది స్టూడెంట్స్ నిరుద్యోగులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: