లోకేష్ ప్రాధాన్యత ను పెంచే ప్రయత్నం చేస్తున్న బాబు.. ఇదే నిదర్శనం...!

Prathap Kaluva

లోకేష్ నిన్న కర్నూల్ సభలో కర్నూల్ ఎంపీ గా బుట్ట రేణుకను మరియు ఎమ్మెల్యేగా ఎస్వీ మోహన్ రెడ్డి ని ప్రకటించాడు. అయితే వీరి ఇద్దరు కూడా వైసీపీ తరుపున నుంచి పోటీ చేసి గెలిచిన అభ్యర్థులు అయితే సాధారణంగా పార్టీ అభ్యర్థులను పార్టీ అధినేత ప్రకటిస్తాడు. అయితే టీడీపీ అధినేత చంద్ర బాబు తన తనయుడు ను  ఇంకా ఎక్సపోజ్ చేసే ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని కూడా తన కొడుకు చేత చేపించాడు. 


కర్నూలు ప్రస్తుత ఎంపీ బుట్టా రేణుక.. వైఎస్సార్ సీపీ తరఫున విజయం సాధించారు. ఆమె చాలా కాలంగా తెలుగుదేశం పార్టీతో కలిసి మెలిసి తిరుగుతున్నారు. ఆమె తెదేపాలో ఉన్నారని, ఆమె మీద అనర్హత వేటు వేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు లోక్ సభ స్పీకరుకు చేసిన ఫిర్యాదుకు అతీగతీ లేకుండా పోయింది. అలాగే కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి కూడా వైఎస్సార్ సీపీ తరఫునే గెలుపొందారు. తదనంతర పరిణామాల్లో ఆయన కూడా తెదేపా తీర్థం పుచ్చుకున్నారు.


అలా ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు గురించి వైఎస్సార్ సీపీ రాష్ట్ర అసెంబ్లీ స్పీకరు కు చేసిన ఫిర్యాదులకు కూడా ఇప్పటిదాకా మోక్షం లేదు. ఇలాంటినేపథ్యంలో సోమవారం నాడు  కర్నూలులో జరిగిన కార్యక్రమంలో.. మంత్రి లోకేష్ మాట్లాడుతూ... కర్నూలు ఎమ్మెల్యేగా ఎస్వీ మోహన్ రెడ్డిని, కర్నూలు ఎంపీగా బుట్టా రేణుకను వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ఘనంగా గెలిపించాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: