వైసీపీ ఫ్యాన్స్ ని బాధపెడుతున్న ఇరాన్ అధ్యక్షుని మరణం? నెట్టింట వైరల్ కామెంట్స్?

Purushottham Vinay
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది. మొదట ఏటీసీతో సంబంధాలు తెగిపోయిన రైసీ హెలికాప్టర్ కోసం రెస్క్యూటీమ్ గాలింపు చర్యలు చేపట్టాయి.అయితే ఒక రోజు తర్వాత రైసీ ప్రయాణించిన హెలికాప్టర్ కూలిపోయిందని అధికారులు ప్రకటించడం జరిగింది.ఈ ప్రమాదంలో రైసీతో సహా మరికొందరు మృతి చెందారు. కేవలం ప్రతికూల వాతావరణం కారణంగానే రైసీ ప్రయాణించిన హెలికాప్టర్ కూలిపోయిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనతో దివంగత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం గుర్తుకు వస్తుంది.2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి రెండోసారి సీఎం అయ్యారు.ప్రజల సమస్యలు తెలుసుకొనేందుకు రచ్చబండ కార్యక్రమం ప్రారంభించాలని వైఎస్ భావించారు.

ఇందులో భాగంగా చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు 2009 సెప్టెంబర్ 2న హెలికాప్టర్ లో హైద్రాబాద్ బేగంపేట విమానాశ్రయం నుండి చిత్తూరు జిల్లాకు వైఎస్ బయలుదేరారు. బేగంపేట విమానాశ్రయం నుండి బయలుదేరిన కొద్దిసేపటికే రాజశేఖర్ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూడా ఇలాగే ఏటీసీతో సంబంధాలు కోల్పోయింది. సీఎం ప్రయాణీస్తున్న హెలికాప్టర్ మిస్ కావడంతో అధికారులు కూడా సరిగ్గా ఇలాగే గాలింపు చర్యలు చేపట్టారు. అప్పుడు కూడా రక్షణ శాఖకు చెందిన ఆధునాతన విమానాలు, హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. అప్పుడు నల్లమల అడవుల్లోని పావురాలగుట్ట వద్ద వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ప్రయాణించిన హెలికాప్టర్ శకలాలను గుర్తించారు. ఈ ప్రమాదంలో కూడా వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి సహా వ్యక్తిగత సిబ్బంది మృత్యువాతపడ్డారు.

సరిగ్గా ఇలాగే మే 19వ తేదీన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఇరాన్-అజర్ బైజాన్ సరిహద్దు నుండి తబ్రిజ్ పట్టణానికి బెల్ 212 హెలికాప్టర్ లో బయలుదేరారు. రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూడా ప్రతికూల వాతావరణం కారణంగా కుప్పకూలింది. టేకాఫ్ అయిన 30 నిమిషాలకే ఈ హెలికాప్టర్ కు ఏటీసీతో సంబంధాలనేవి తెగిపోయాయి. దీంతో అధికారులు అధ్యక్షుడి హెలికాప్టర్ కోసం గాలింపు చర్యలు చేపట్టగా, మే 20న ఇరాన్ అధ్యక్షుడు రైసీ హెలికాప్టర్ ను రెస్క్యూటీమ్ గుర్తించింది. 2009లో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ప్రయాణించింది కూడా బెల్ కంపెనీ హెలికాప్టర్లోనే. ఈ హెలికాప్టర్లను అమెరికాకు చెందిన బెల్ టెక్స్ ట్రాన్ అనే కంపెనీ తయారు చేసింది. అప్పుడు రాజశేఖర్ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూడ ప్రతికూల వాతావరణం కారణంగా నల్లమల అడవుల్లో కూలిపోయింది. తర్వాత ఈ విషయాన్ని ఆర్మీ హెలికాప్టర్ గుర్తించింది.

అప్పుడు వైఎస్ కి ప్రమాదం జరిగినట్టే ఇప్పుడు రైసికి జరగడంతో వైసీపీ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఆ సంఘటన గుర్తు తెచ్చుకొని బాధ పడుతున్నారు. రైసి మరణం వల్ల రాజశేఖర్ గారిని గుర్తు తెచ్చుకొని అటు వైసీపీ నేతలు ఇటు వైసీపీ ఫ్యాన్స్ బాధ పడుతున్నారు. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. తమ అధినేత ఇంత ఘోరంగా ప్రమాదంలో చనిపోవడం ఎప్పటికీ తీరని బాధ అంటూ వైసీపీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తమ బాధని వ్యక్త పరుస్తూ కామెంట్స్ చేస్తున్నారు.మాకు మా రాజన్న గుర్తుకు వస్తున్నారంటూ ఎంతగానో బాధ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: