థూ..త్తుకుడి..!! తమిళనాడు సర్కార్ కు తకధిమితోం..!!

Vasishta

తమిళనాడులోని తూత్తుకుడి ఒక్కసారిగా జాతీయ స్థాయి వార్తలకెక్కింది. అక్కడ ప్రజా అందోళనని అణిచివేసేందుకు చేసిన ప్రయత్నం వికటించింది. పెద్ద సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. తమ జీవితాల్లో మట్టికొట్టిన  ఓ పరిశ్రమ విస్తరణను అడ్డుకునేందుకు స్థానికులు చేసిన ప్రయత్నాలు పోలీసుల సహాయంతో అణిచివేగలమని కంపెనీ వర్గాలు భావించాయి. రక్తపాతం సృష్టించాయి.

తమిళనాడు రాష్ట్రం తూత్తుకుడిలో స్టెరిలైట్ కంపెనీ విస్తరణ పనులను అడ్డుకునేందుకు ప్రజలు ప్రయత్నించడం.. పోలీసులు కాల్పులు జరపడం దేశవ్యాప్తంగా పెద్ద కలకలం రేపింది. ఈ ఘటనలో 11 మంది అందోళనకారులు గాయపడ్డారు. ఇదంతా స్టెరిలైట్ విస్తరణ పనులు అడ్డుకునేందుకే ఈ ప్రయత్నమంతా. వేదాంత కంపెనీ నిర్వహిస్తున్న ఈ స్టెరిలైట్ ప్లాంట్ విస్తరణ కోసం పనులు ప్రారంభించారు. అయితే ఉన్న కంపెనీ వెలువరించే కాలుష్యమే భరించడం కష్టంగా ఉందని.. కంపెనీని మరింత విస్తరిస్తే .. కాలుష్యం తట్టుకోలేమన్న బాధతో సామాన్యులు ఈ పోరాటానికి దిగారు. ఈ పోరాటం వెనుక అసలు నిజం తెలియాలంటే చరిత్రలోకి వెళ్లాల్సిందే.


రాగిని కరిగించి స్టెరిలైట్ చేసే ఈ కంపెనీ నుంచి భారీగా సల్పర్ డై ఆక్సైడ్ వాయువులు వెలువడ్డాయి. ప్రజలు గొంతునొప్పి, కళ్ల నుంచి నీరుకారడం, శ్వాస ఆడకపోవడం వంటి ఇబ్బందులతో సతమతమయ్యరు. కొందరు భయపడి ఆ ప్రాంతం వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఈ ఘటన తర్వాత కోర్టు ప్లాంట్ ను మూసివేయాలని అదేశించింది. 100 కోట్లు జరిమానా విధించింది. కానీ ఆ తర్వాత సుప్రీం కోర్టుకు వెళ్లి ఫ్యాక్టరీని తెరిపించుకున్నారు. కానీ బాధితుల గోడు ఎవ్వరూ పట్టించుకోలేదు.  దాని ప్రభావం అక్కడి ప్రజలు ఇప్పటికీ అనుభవిస్తున్నారు.


తొలినాళ్లలో ప్లాంట్ నుంచి ద్రవవ్యర్థాలను విపరీతంగా బయటకు వదిలివేయడంతో ఇక్కడ నేల మొత్తం పాడైపోయింది. ప్లాంట్ నుంచి వెలువడే ధూళి కారణంగా.. పంటలు ధ్వంసమైపోయాయి. ఇప్పుడు అక్కడ ఎటువంటి పంటలు పండని పరిస్థితి. ఇక్కడి భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమైపోయాయి. ఈ చుట్టుపక్కల కొన్ని వందల గ్రామాల్లో నీళ్లు ఎందుకు పనికిరాని పరిస్థితి. అంత్యత ప్రమాదకరమైన ఆర్సినిక్ ఇక్కడ ఉండాల్సిదానికంటే  25 రెట్లు అధికంగా ఉంది.  కాపర్ 10 రెట్లు అధికంగా ఉంది.  దీంతో ఇక్కడి ప్రజలు తీవ్ర అనారోగ్యం బారినపడుతున్నారు. అయినా దీని గురించి పట్టించుకున్నవాళ్లే లేరు.


అంతటి భయాన స్థితిలో ఉన్న తమను పట్టించుకోకుండా.. స్టెరిలైట్ కంపెనీ విస్తరణకు అనుమతులు ఇవ్వడంతో ఇక్కడి ప్రజలకు కడుపు రగిలిపోయింది. పోరాటం మొదలుపెట్టారు. కంపెనీ వర్గాలు ఆ ఉద్యమాన్ని అణిచివేసేందుకు తీవ్రంగా ప్రయత్నంచాయి. ఆ క్రమంలోనే కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ వ్యవహారం పై మద్రాస్ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. వెంటనే పనులు నిలిపివేయాలని అదేశించింది. నాలుగు నెలలోపు ప్రజాభిప్రాయ సేకరణ చేసి.. దాని అనుగుణంగా నిర్ణయంతీసుకోవాలని, ఆ తర్వాత పర్యావరణ అనుమతులు జారీ చేయాలని అదేశించింది.


అయితే ఈ కేసుకు సంబంధించి సుబ్రహ్మణ్యస్వామి సంచలన ప్రకటన చేశారు. స్టెరిలైట్ కంపెనీకి చిదరంబరం డైరెక్టర్ అని.. స్టెరిలై తరఫున ఆయన సమాధానం ఇవ్వాలని  సుబ్రహమణ్యం స్వామి కోరారు. తూత్తుకుడి ఘటనకు ముఖ్యమంత్రి పళనిస్వామి బాధ్యత వహించాలని రజనీకాంత్ డిమాండ్ చేశారు. వెంటనే బాధితులకు న్యాయం చేయాలన్నారు. తూత్తుకూడి బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన కమల్ హాసన్ పై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దయచేసి మా దగ్గరకు రావద్దుంటూ దండాలు పెట్టారు. ఇదే అంశంపై డీఎంకే సీఎం కార్యాలయం ముట్టడించేందుకు ప్రయత్నించింది. పోలీసులు వారిని అరెస్టు చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: