మహేష్ 10 ఏళ్లు ఆగడు డిజాస్టర్ మూవీ గురించి తెలియని 7 విషయాలు ఇవే..?

Divya
హీరో మహేష్ బాబు, డైరెక్టర్ శీను వైట్ల కాంబినేషన్లో వచ్చిన దూకుడు సినిమా మహేష్ బాబు కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అయ్యింది. అయితే ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఆగడు సినిమా వచ్చి ఘోరమైన డిజాస్టర్ ని మూటకట్టుకుంది. అయితే ఆగడు సినిమా గురించి తెలియని కొన్ని విషయాలు ఈ సినిమా వచ్చే పదేళ్లు అవ్వడం చేత వైరల్ గా మారుతున్నాయి. వాటి గురించి చూద్దాం. దూకుడు చిత్రాన్ని 14 డ్రిల్ సంస్థ నిర్మించింది ఆ సమస్థ మళ్లీ ఆగడు సినిమాని కూడా నిర్మించింది.

1). దూకుడు సినిమా సమయంలోనే డైరెక్టర్ శ్రీనువైట్ల ఆగడు సినిమా టైటిల్ ని రిజిస్ట్రేషన్ చేయించారట. ఆ సమయంలో మహేష్ కి తగ్గట్టుగా డైరెక్టర్ దగ్గర కద లేదట.

2). నేనొక్కడినే డిజాస్టర్ తో ఉన్న మహేష్ బాబు ఒక మాస్ కథని చేయాలని వెతుకుతున్న సమయంలో శ్రీనువైట్ల అప్రోచ్ అయ్యారట.. ఆ సమయంలో శ్రీనువైట్ల వద్ద మొదటి హాఫ్ భాగానికి సంబంధించి కథ మాత్రమే ఉందని.. ఆ సమయంలోనే ఆగడు టైటిల్ తో ప్రాజెక్టుని అనౌన్స్మెంట్ చేశారు.

3). కథ రెడీ కాకుండానే బేల్ పూరి అనే పాట ఆక్సిజన్ కూడా సరిగ్గా లేని ప్లేసులో చిత్రీకరించారట. ఈ పాట షూటింగ్ తర్వాత మహేష్ బాబు ఒక వారం రోజులపాటు అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడ్డారట.

4). శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన చిత్రాలలో ఎక్కువగా కోనా వెంకట్, గోపి మోహన్ వంటి వారు రైటర్స్ గా ఉన్నారట.. కానీ ఆగడు సినిమాకి వారు లేకుండా తెరకెక్కించారు.

5). ఆగడు సినిమా మొదటి భాగానికి డైరెక్టర్ అనిల్ రావుపూడి స్క్రీన్ ప్లే అందించగా.. కళ్యాణ్ రామ్ పటాస్ సినిమాలో అవకాశం రావడంతో ఆగడు సినిమా నుంచి తప్పుకున్నారట.

6). మొదట విలన్ గా ప్రకాష్ రాజ్ ని అనుకోక చాలావరకు సినిమా షూటింగ్ చేసిన శ్రీను వైట్లతో కొన్ని మనస్పర్ధలు కావడం చేత వాటన్నిటిని తీసివేసి సోను సూద్ తో మళ్లీ చిత్రీకరించారు.

7). మొదట ఆగడు సినిమాలో శ్రీహరి కోసం ఒక పవర్ ఫుల్ పోలీస్ పాత్రను డిజైన్ చేయక ఆయన మరణించడంతో రావు రమేష్ తో ఆ పాత్ర చేశారట.
ఈ చిత్రాన్ని శ్రీను వైట్ల 8 నెలల్లోనే పూర్తి చేశారట. కానీ ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలిన ఓవర్సీస్ లో మంచి విజయాన్ని అందుకొని సరికొత్త రికార్డులను సృష్టించింది. పూర్తి రన్ టైం వచ్చేసరికి రూ .65 కోట్ల రూపాయల రాబట్టింది. ఒకవేళ డైరెక్టర్ అనిల్ రావు పూడి ఈ సినిమాని పూర్తి చేసి ఉంటే సినిమా మరొక లాగా ఉండేదేమో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: