ఆలయాలపై నగ్న, రతి శిల్పాలు.. ఎందుకు ఉంటాయంటే..!

Chakravarthi Kalyan

దేవాలయాలకు వెళ్తే.. అక్కడి గోడలపై రమణీయమైన శిల్పాలు చెక్కి ఉంటాయి. ఇవన్నీ మన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను మనకు గుర్తు చేస్తాయి. అంతే కాదు.. పాత కాలంలోని కళలు, జీవనవిధానాన్ని ఈ శిల్పాలు వివరిస్తాయి. అంతవరకూ ఓకే.. కానీ.. కొన్ని గుళ్లలో గోడలపైనా, గోపురాలపైన కూడా బూతు బొమ్మలు దర్శనమిస్తాియి. ఏకంగా రతి కార్యాలను అవి చూపిస్తుంటాయి.


అసలే మన భారతదేశ ప్రభుత్వం అశ్లీల వెబ్ సైట్లను బ్యాన్ చేయాలని ఓ నిర్ణయం తీసుకుంది కూడా. దీనిపై అప్పట్లో ఎవరికి వారు వింత వింతగా రియాక్ట్ అయ్యారు. కొందరు తమకు తెల్సిన లా పాయింట్లు తీసి లాజిక్ గా మాట్లాడారు. ఇది వ్యక్తిగత స్వేఛ్చను హరించడమే అంటూ సోషల్ మీడియా లో నెత్తి నోరు కొట్టుకున్నారు కూడా.


ఐతే.. అసలు దేవాలయాలపై ఆ బూతు బొమ్మలు ఎందుకు ఉంటాయి. అందరూ బహిరంగంగా ఉండేచోట. అందులోనూ పూజలు జరిగే చోట. ఇలాంటి అశ్లీలమైన బూతు బొమ్మలు ఎందుకు ఉంటాయన్న ప్రశ్నలు తలెత్తకమానవు. ఐతే.. దీనికీ ఓ సమాధానం ఉంది. ఆ బొమ్మలు భారత సంస్కృతిలో శృంగారం ప్రాముఖ్యతను తెలియజేస్తాయి.


మానవుడి ధర్మ, అర్థ, కామ, మోక్షాల్లో కామానికి చాలా ప్రామఖ్యత ఉంది. కామాన్ని కూడా ఆరోజుల్లో పవిత్రమైన కార్యంగా భావించేవారు. సృష్టి పరమ పవిత్రమైంది కాబట్టే గుళ్లలో ఆ శిల్పాలు ఉంచేవారట. అంతే కాదు.. భక్తిలో పడిపోయిన అసలు సృష్టి మరిచిపోకూడదన్నది కూడా మరో కారణం. అంతే కాదు.. రతిభంగిమల గురించి అప్పట్లో చర్చించే అవకాశం లేనందువల్ల ఆలయాలపై బొమ్మల ద్వారా శృంగార విద్య బోధించేవారు. అదీ సంగతి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: