బెదిరింపుల చట్రంలో ముఖ్యమంత్రి - సర్వస్వం కోల్పోతున్న రాష్ట్రం

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర అధికార పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అందరూ అనుకుంటున్నట్లే ఒక "బెదిరింపుల చట్రం"లో (బ్లాక్మెయిల్ ఫ్రేం) బలంగా ఇరుక్కుపోయినట్లు గా ఉంది.  గడచిన కొన్ని నెలలుగా తన మిత్రపక్షం బీజేపీపై ఉవ్వెత్తున ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తుస్తూ కెరటం లో ఎగసిపడే చంద్ర బాబు, తరవాత కొంతసేపటికే జావగారి పోరూ గాలి తీసిన బలూనులా కూలిపోతున్నారు. దీన్ని ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. మొన్న స్విట్జర్లాండ్ లోని దావోస్ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఆవేశంలో ఊగిపోతూ "పొత్తు వద్దంటే, నమస్కారం పెట్టేసి వెళ్లిపోతాం" అంటూ బీజేపీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు అంతేకాదు ఆ మరుక్షణమే ఆ మాటను పక్కన పెట్టేశారు.
కేంద్రబడ్జెట్లో ఈ సారి బీజేపీ సర్కారు ఏపీకి కొంతైనా న్యాయంచేసి తీరుతుందని అంతా ఆశావహదృక్పథంలో ముందుకు సాగాలని చెపుతూ అంతకు ముందటి తన వ్యాఖ్యలను నీరుకారుస్తూ సెలవిచ్చారు. అయితే టిడిపి ఎంపిలు సభ్యులుగా మంత్రులుగా ఉన్న ఎన్ డి ఏ  మంత్రి మండలి ఆమోదంతో ఆర్ధిక మంత్రి అరుణ్  జైట్లి పార్లమెంటు లో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఏపి గురించి ఎలాంటి ప్రస్తావన లేకపోగా అసలు "ఏపీ పేరు ఉచ్ఛరించిన దాఖలా" యే కనిపించలేదని చెప్పాలి. 

ఒక వైపు ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించి ఏ ఒక్క విషయం ప్రస్థావన లోకి రాకపోయినా ఏ అంశాన్ని ప్రస్థావించక పోయినా ఆయా రాష్ట్రాలకు వేలాది కోట్లనిధులను ప్రకటించిన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ, మా అభివృద్దికి నిధులు కావాలి రా!  భగవతుడా! అని తన పాదాల ముందు మోకరిల్లుతున్న ఆంధ్ర ప్రదేశ్ ని మాత్రం ఖాతర్ చేయట్లే దని చెప్పాలి. 

తెలుగుదేశం పార్టీ అభ్యర్ధనపైనే ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నామని చెప్పిన కేంద్రం, ఇప్పటిదాకా ఆ ఖాతా కింద ఒక పైసా కూడా విడుదల చేయకుండా దానిని చట్టబద్ధం చేయకుండా ఎందుకు వదిలేసిందనేది ప్రతిఒక్కరికి సమాధానం దొరకని బేతాళప్రశ్న. చివరకు ఎండిఏ ప్రభుత్వ పూర్తిస్థాయి బడ్జెట్ 2018,  అంటే 2019 సాధారణ ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్న చిట్టచివరి బడ్జెట్ లో తమ మిత్రపక్షం టీడీపీ పాలన లో ఉన్న ఏపీని సంపూర్ణంగా విస్మరించింది. ఈ తెలుగు రాష్ట్రానికి చెందిన రాజకీయాలు తమకు అవసరమే లేదన్న రీతి లోనే ఎండిఏ వ్యవహరించిందని చెప్పక తప్పదు. 


గడచిన ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేసిన బీజేపీ కొన్ని స్థానాలైనైతే దక్కించుకుంది గానీ ఆ సీట్లను తాను ఒంటరిగా బరిలోకి దిగినా దక్కించుకోగలమనే వాదన రాష్ట్ర బీజేపీ నేతల్లో ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు అసలు గడచిన ఎన్నికల్లో టీడీపీ తో పొత్తు పెట్టుకోవటం వలన తమకు ఎలాంటి ప్రయోజనం దక్కలేదన్న  భావన కూడా రాష్ట్ర బీజేపీ నేతల్లో ఉంది. ఏదైదేతేనేం, ఇష్టం లేని పెళ్ళి జరిగిపోయింది దానికితోడు తెలుగుదేశం పార్టీ అత్యాశ తోడవటం తో వారి సంసారంలో సఖ్యత లేకుండా పోయింది.  

బీజేపీ సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిపోయింది. జైట్లీ బడ్జెట్ ప్రసంగం ముగియగానే, ఎక్కడో గుంటూరు జిల్లాలో ఉన్న చంద్రబాబు హుటాహుటీ న అమరావతిలోని తన కార్యాలయానికి చేరుకున్నారు. తమ పార్టీ ఎంపీ లను ప్రత్యేకంగా కాంఫరెన్స్ చాల్ లో సంప్రదించారు చంద్రబాబు. రాష్ట్రానికి రావాల్సిన కేటా యింపు లకు సంబంధించి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని ఆదేశాలు జారీ చేశారు.  ఆ వెంటనే ఎప్పటి లాగానే అందుబాటులో ఉన్న తన కేబినెట్ మంత్రులతో ఆయన ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సమావేశం లో బీజేపీ ప్రభుత్వంపై అగ్నికణికలే విసిరిన చంద్రబాబు, మళ్ళా నీరిగారి పోతూ మిత్రపక్షమైన బాజపానే ఇలా చేస్తే ఇంకేం చేస్తా మంటూ? యాజూజువల్గా ఆవేదన వ్యక్తం చేశారు.


ఈ సందర్భంలోనే ఒక మంత్రివర్యులు మైకందుకుని, ఇంత జరిగినంక బీజేపీతో స్నేహం కొనసాగించాల్సిన అవసరం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ చర్చ  సరైనదేనన్న భావనతో చంద్రబాబు ఆ వాదనను శ్రద్ధగా వినగా, ఏపి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాత్రం బీజేపీతో మైత్రిని తెంచుకోవాల్సిన అవసరమైతే తనకు కనిపించడం లేదని ఇప్పుడు పార్లమెంటులో బడ్జెట్ ను ప్రవేశపెట్టడం మాత్రమే పూర్తి అయ్యిందని బడ్జెట్ కేటాయింపుల్లో మనకు ఇంకా అవకాశాలున్నాయని తొందరపడి బీజేపీతో తెగదెంపులు ఎందుకని ప్రశ్నించారు. ఈ వాదనతో విభేదించిన చంద్రబాబు, ఇంకా మనం నిశ్శబ్ధంగా ఉంటే మనపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తే ప్రమాదం ఉంద ని వ్యాఖ్యానించి నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ఇదంతా మొన్న సాయంత్రం జరిగిన చర్చోపచర్చల సారాంశం.   


అయితే నిన్న ఉదయానికి మొత్తం పరిస్థితి ఎప్పటిలా జావగారి మారిపోయిందన్న సమాచారం. బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగిపోయిందని ఓ వైపు కాంగ్రెస్ - వైసీపీ ఎలుగెత్తి ఘోషిస్తున్నా అధికార తెలుగు దేశం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు నిశ్శబ్ధమైపోయింది. పార్లమెంటులో ఏపీకి న్యాయంకోసం కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు తన నిరసన గళం బలంగా వినిపించినా, సభలో ఉన్న టీడీపీ పార్లమెంట్ సభ్యులు ఆయనకు ఏమాత్రం మద్దతుగా నిలవలేదు. కారణం చంద్రబాబు నుంచి వచ్చిన ఆదేశాలే అంటున్నారు. అందువల్లే టీడీపీ ఎంపీలు వెనక్కు తగ్గారన్న ప్రచారం సాగుతోంది. 


ఆవేశకావేశాలు వెళ్ళగ్రక్కుతూ ఊగిపోయిన చంద్రబాబు రాత్రికి రాత్రి బీజేపీ పై తన వైఖరిని ఎందుకు మార్చుకున్నారన్నది ఇప్పుడు అందరికి ఆసక్తికరంగా మారి పోయింది. బీజేపీతో విడాకులు తీసుకొని తెగదెంపులు చేసుకునే దాకావెళ్లిన చంద్రబాబు ఒక్క రాత్రికే తన వాదనను పక్కన పెట్టేసి తన పార్టీ పార్లమెంట్ సభ్యులను నియంత్రించిన తీరు ఆసక్తి రేపుతోంది. 


అయితే రాజకీయ వర్గాల్లో వినిపించేదేనటే - రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాదు నుంచే పదేళ్ళు  పాలనను సాగిస్తానన్న చంద్రబాబు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో "నామినేటెడ్ ఎమ్మెల్యే" స్టీఫెన్ సన్ ఓటును కొనుగోలు చేయబోయి కెమెరాలకు దొరికి  తెలంగాణా ఏసిబికి అడ్డంగా బుక్కైన విషయం ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ టీవీ చానెళ్ళ సాక్షిగా తెలిసిన సినిమాయే.  బ్రీఫ్డ్-మీ రూపంలో ప్రచారంలో ఊన్న ఆ కేసుకు సంబంధించిన చార్జీషిట్లో చంద్రబాబు పేరు కూడా ఉంది.  ఇది జరిగిన తర్వాత ఇంకా అక్కడే ఉంటే, కేసిఆర్ తనను ఎక్కడ అరెస్ట్ చేస్తారోనన్న భయం, తన ప్రభుత్వానికి చావు మూడుతున్న సందర్భం గ్రహించి కేసిఆర్ పాదపద్మాల దగ్గర సాగిలపడ్డాడని ఆ సంధర్భంగానే చంద్రబాబు, అప్పటికప్పుడు తన రాష్ట్ర పాలనను విజయవాడకు మార్చేసుకున్నారన్న వాదన వినిపించింది.


అంతే కాదు తనపార్టీని తానే తెలంగాణాలో నిర్వీర్యం చేసుకోవటం కూడా కేసిఆర్ తో ఒప్పందంలో భాగమేనని అంటున్నారు.  ఇదే విషయంలో కేంద్రంతో మాట్లాడి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దూకుడుకు పగ్గాలు వేసేదిశగా చంద్రబాబు మంత్రాంగం నడిపారన్న వాదన కూడా ప్రచారంలో ఉంది.  అసలు ఈ కేసు కారణంగానే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమైన డిమాండ్లను చంద్రబాబు నాయుడు కేంద్రం ముందు గట్టిగా వినిపించలేకపోతున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది. ఈ సారి కూడా చంద్రబాబు మనసును రాత్రికి రాత్రి మార్చివేసిన అంశం కూడా ఇదేనన్న విశ్లేషణ కొనసాగుతోంది. దీన్ని బట్టి ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి  నారా చంద్రబాబు నాయుడే అతి పెద్ద అవరోధం అని ప్రతిపక్షం అంటున్న మాటలు యదార్ధమేనని అంటున్నారు. కేంద్రంలో బాజపా అధికారంలో ఉండగా రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ అభివృద్దికాదనేది నిజమేననిపిస్తుంది.   

కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయంపై పార్లమెంటు వేదికగా పోరాడాలని సీఎం చంద్రబాబు టీడీపీ ఎంపీలకు పిలుపునిచ్చారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి మొండిచెయ్యి చూపడంపై పార్లమెంటులో నిరసన తెలియజేయాలన్నారు. 

ఏదో జరుగుతుందని అంతా ఊహించారు. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకుంటారని భావించారు. టీడీపీ-బీజేపీ మిత్రబంధం ఇక ముగిసినట్టే అని, బీజేపీతో తెగదెంపులు ఖాయమనే వార్తలొచ్చాయి. కానీ అలాంటిదేమీ జరగలేదు. పొత్తు విషయంలో చంద్రబాబు తొందరపడలేదు. ప్రస్తుతానికి బీజేపీతో విడాకుల ప్రస్తావన లేదని చంద్రబాబు తేల్చేశారు. కేవలం పోరాటానికే పరిమితం కావాలని డిసైడ్ అయ్యారు. మిత్రబంధం కొనసాగిస్తూనే ఒత్తిడి తేవాలని చంద్రబాబు నిర్ణయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: