ఐఖ్యరాజ్య సమితికి అమెరికా బెదిరింపు! ప్రపంచానికే పెద్ద షాకింగ్...

స్వార్ధం విషయంలో ఎంతటి కఠిన నిర్ణయమైనా తీసుకోవటానికి అమెరికా సిగ్గుపడదు. బయటికి చెప్పటానికి బెరుకు చూపదు. స్వార్ధమే దాని పరమార్ధం. అర్ధమే అంత ర్జాతీయంగా దాని ఇంధనం. ఏ దేశమైనా దానికి ఒకటే తన ప్రయోజనాలకు ఉపయోగ పడితే ఆదేశంతో స్నేహం, అలా కాని దేశంతో దానికి వైరమే. దటీజ్ అమెరికా! దాని అగ్రత్వం దాని ప్రయోజనాల సాధనలోనే.  ఎందుకంటే ఆ దేశం జన్మించిందే వలసలతో. భూమి పుత్రులను సమూలంగా నిర్మూలించి సంపాదనే ధ్యేయంగా తొలుతగా వలసలతో ఏర్పడ్ద దేశం అమెరికా.

ఎవరైనే అమెరికా వెళుతున్నరంటే ధ్యేయం ధన సంపాదనే.  అలాంటి దేశం తమ ప్రయోజనాలకు అడ్డుపడే ఎవరినీ సహించదు సమర్ధించదు అని మరోసారి ఋజువు చేసుకుంటుంది. "ధనం ఇదం మూలం జగత్" అనే నానుడిని అమెరికా భూమి పై "ధనం ప్రయోజనం అగ్రత్వం ఇదం అమెరికా జగతిన మూలం" అని సవరించాలి.  
  
"జెరుసలేం" విషయంలో అమెరికాకు వ్యతిరేకంగా ఐక్య రాజ్య సమితి వేదికగా ప్రపంచ దేశాలు ఒక్కటవ్వడం పై అగ్రరాజ్యం ఆగ్రహోధగ్రే అవుతోంది సహించలేకపోతోంది సహనం కోల్పోతోంది. జెరూసలేం నిర్ణయంపై వ్యతిరేకంగా ఓటేసిన దేశాలకు విడుదల చేసే నిధులపై కోత పెడతామంటూ హెచ్చరికలు జారీ చేసిన అమెరికా, మొదటి షాక్‌ ఐక్య రాజ్య సమితి కే ఇచ్చింది. ఈ మేరకు ఐక్య రాజ్య సమితిలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ కీలక ప్రకటన ఒకటి చేశారు.

ఐక్య రాజ్య సమితి కార్యకలాపాల కోసం 2018-19 మధ్యకాలంలో కేటాయించే నిధుల్లో 285 మిలియన్‌ డాలర్ల కోత పెట్టినట్లు ఆమె పేర్కొన్నారు. ఐక్య రాజ్య సమితి సాధారణ సమావేశంలో ప్రపంచ దేశాలన్నీ అమెరికాను ఒంటరి చేశాయని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. అమెరికా తీసుకున్న తాజా నిర్ణయంతో ప్రపంచ దేశాలతో పాటు ఐక్య రాజ్య సమితి కూడా షాక్‌ తింది. ఐక్య రాజ్య సమితి సమర్థత, ఆర్థిక అంశాలపై మాకు స్పష్టమైన అవగాహన వుంది, మేం చేయాలనుకున్నది చేస్తామని నిక్కీ హేలీ స్పష్టం చేశారు.

అమెరికన్ల ప్రేమ, ఔదార్యాన్ని మిగిలిన దేశాలు కూడా ఏంతో కాలం పొందలేవని ఆమె చెప్పారు. ఇదిలావుండగా, సమితికి కేటాయించే మొత్తం బడ్జెట్‌ నిధులను నిలిపేస్తు న్నారా? లేక సమితి నిర్వహణ కోసం అందించే ఉదార నిధులును అమెరికా రద్దు చేసిందా అన్న విషయంపై స్పష్టత రావాల్సివుంది.  జెరూసలేం నగరాన్ని ఇజ్రాయెల్ రాజధానిగా అధికారికంగా గుర్తిస్తు న్నామని, అమెరికన్ ఎంబసీని జెరూసలేంకు మార్చుతున్నామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొద్దిరోజులు క్రితం ప్రకటించారు.


ముస్లిం దేశాల్లో అల్లర్లు, ఆందోళనలు చెలరేగాయి. దీంతో అమెరికా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ పప్రపంచదేశాలన్నీ సమితిలో తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. దీనికి 128 దేశాల మద్దతు  లభించింది. సర్వ సభ్య సమావేశం తరువాత నిక్కీ హేలీ చాలా ఆగ్రహంగా మాట్లాడారు. "అమెరికా చరిత్రలో ఇది మరచిపోలేని రోజు, అమెరికాకు వ్యతి రేకంగా నిలిచిన అన్నీ దేశాలను గుర్తు పెట్టుకుంటాం" అని ఆమె వ్యాఖ్యానించారు. ఈ ప్రకటన అనంతరం నిధుల కోత పై నిక్కీ హేలీ రోజుల వ్యవధి లోనే ప్రకటించడం గమనార్హం.

ఐఖ్య రాజ్య సమితి ఎక్కువగా అమెరికా నుండి వచ్చే నిధులతోనే నిర్వహించబడుతుంది. అందుకే అమెరికా యు.ఎన్.ఓ లో కీలకంగా వ్యవహరిస్తూ వస్తుంది ఇంతవరకు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: