భాగ్యనగరానికి మేట్రో భాగ్య ప్రధాత - నేడు మనం స్మరించుకో వలసిన మహనీయుడు వైఎసార్

ఈ రోజు ఈవంక -- ఇవాంక మరో వంక ప్రధాని మోదీ భాగ్యనగరం లో హల్-చల్ చేయనున్నారు. అంతర్జాతీయ సదస్సు మహిళా సాధికారతను సాధించనుంటే - భాగ్యనగర మణిహారానికి మరో ఆణిముత్యం మెట్రో రైలు కొత్త అందాలను సంతరించి పెట్టనుంది. అయితే ఈ మెట్రో ఆలోచనలను సాకారం చేయటానికి పూనుకుని అంకురం వేసిన స్వాప్నికుడు మాత్రం నిర్ద్వందంగా యశస్వి వైఎస్ రాజశేఖర రెడ్డి మాత్రమే. బహుశ ఆయన ఆత్మ కూడా వీరిరువురితో నగర వీక్షణం లో భాగం పంచుకోవచ్చు.


అయితే   నేడు భాగ్యనగరంలో అందరి దృష్టి మెట్రో ప్రారంభంపైనే కేంద్రీకృతమవనుంది. ట్రాఫిక్ రద్దీ రొదలో జీవితంలో అమూల్య భగం రహదారులపై కోల్పోయే నగర జీవికి ఎంతో కొంత కోందరికైనా సమయం ఆదాకావచ్చు. ట్రాఫిక్ పద్మవ్యూహం నుండి కొంత వెసులుబాటు మరికొంత స్వాంతన లభిస్తుందన్నది నిజం. నవంబర్ 28న ప్రారంభం కానున్న మెట్రో, 29 నుంచి ప్రజలకు వినియోగానికి అందుబాటులోకి రానున్నదని తెలిసిందే. ఇప్పటికే స్మార్ట్ కార్డుల అమ్మకం కూడా పూర్తయి పోయింది. మరోవైపు మెట్రో తమ ఘనత అంటే..కాదు...కాదు తమ ఘనత అంటూ ఇటు అధికార టీఆర్ఎస్ పార్టీ -  అటు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఆ కీర్తి లోని వాటా కోసం దాన్నుంచి ఎన్నికల్లో రానున్న మైలేజ్ కోసం కొట్లాడుతున్నారు.


ఈ వాదనలు ప్రక్కన బెట్టి నగర అభివృద్ధిని గమనించిన పలువురు నిపుణులు మాత్రం, ఈ ఘనతరమైన  కార్యం కోసం కలలు కని ఆ కలలకు రూపం ఇచ్చి దానికి ప్రాణం పోసి జవజీవాలు అద్దిన వ్యక్తి మాత్రం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశెఖర రెడ్డి మాత్రమే. నిజంగా ఆ కీర్తి వైఎస్ రాజశేఖరరెడ్డికి మాత్రమే దక్కుతుంది అని అంటు న్నారు. ఇందుకు పలు అంశాలను పరిగణనలోకి తీసుకొని  వివరిస్తున్నారు. 


2004లో ముఖ్యమంత్రిగా భాద్యతలు తీసుకున్న తర్వాత "సంక్షేమం - అభివృద్ధి" ప్రాధమ్యాలతో వైఎస్ఆర్ తనపాలనను ముందుకు సాగించారు. ఈ క్రమంలో ఆయన రాజధాని నగరానికి శొభాయమానం మైన వన్నెలు అద్దగల అనేక ప్రాజెక్టుల రూపకల్పనపై కసరత్తు చేశారు. ఇందులో ఒకటి  ఔటర్ రింగ్ రోడ్ - మరొకటి ఐటీఐఆర్ - ఇంకొకటి మెట్రో రైల్ ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. మూడింటికి అత్యధిక నిధుల అవసరం ఉంది.


వైఎస్ పాలనాపగ్గాలు చేపట్టే నాటికే హైదరాబాద్ ట్రాఫిక్ నరకాన్ని నిర్మిస్తూ తన విశ్వరూపం చూపడం మొదలైంది. ఈ నేపథ్యంలో భవిష్యత్ ను ఊహించిన వైఎస్ఆర్ మెట్రో రైల్ కోసం అనేక చర్చలు జరుపుతూ వాటి ద్వారా పలు ప్రణాళికలు పథక రచనలు చేశారు. అప్పటికే విజయవంతమై క్రియాశీలంగా ముందుకు సాగుతున్న "ఢిల్లీ మెట్రో రైలు" ను ఉదాహరణగా తీసుకుంటూ, ఆ విధానంలో ముందుకు సాగాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ఆర్  "ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్" అధికారుల సలహాలు సూచనలు కోరారు.


వైఎస్ఆర్ ఆహ్వానం మేరకు 2005–07 మధ్యకాలంలో నగరంలో పర్యటించిన డీఎంఆర్సీ అధికారులు దాని సర్వోన్నతాధికారి శ్రీధరన్ సారధ్యంలో "సమగ్ర ప్రాజెక్టు నివేదిక" ను సిద్ధం చేశారు.  ఈ డీపీఆర్ లో తొలి దశలో మూడు కారిడార్ల లో మొత్తం 73 కిమీ మేర ప్రాజెక్టుకు రూపకల్పన జరిగింది. ఎల్బీనగర్ - మియాపూర్ (29కిమీ) - జేబీఎస్ - ఫలక్నుమా (15కిమీ) నాగోలు- రాయ దుర్గం (29 కిమీ) పనులు చేయాలని నిర్ణయించారు. డీపీఆర్ తో మెట్రో కు ఒక రూపు ఇచ్చిన వైఎస్ఆర్ ఆ తరవాతి కార్యా చరణ లో కేంద్రప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు ఇప్పించేందుకు తన దైన శైలిలో కృషిచేశారు.

ప్రజా రవాణా లో నూతన పోకడలకు వేదికగా భాగ్యనగరాన్ని నిలపాలనే ఉద్దేశంతో "పబ్లిక్–ప్రైవేటు-పార్ట్నర్షిప్" ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమాలకు అవ సరమైన విధి విధానలను పూర్తి చేసి 2008లో మెట్రో రైల్ నిర్మాణాన్ని ప్రారంభించారు. అప్పుడు ప్రముఖ నిర్మాణ సంస్థగా ఉన్న "మేటాస్" హైదరాబాద్ మెట్రో రైల్ వే నిర్మాణ బాధ్యతలు అప్పగించారు.  అయితే దురదృష్టకర పరిస్థితుల్లో మేటాస్ మాతృసంస్థ అయిన "సత్యం కంప్యూటర్స్" కార్పొరేట్ మోసాల్లో చిక్కుకుపోవడం, ఆ "పాపపంకిలం" మేటాస్ కు సైతం అంటుకోవడంతో, తిరిగి వైఎస్ సర్కారే, 2009లో ఆ టెండర్ ను రద్దుచేసి గ్లోబల్ టెండర్లు ఆహ్వానించగా, "ఎల్ & టి"  ఆ టెండర్ ను దక్కించుకుంది.



ఆ తదుపరి వైఎస్ మరణం సంభవించింది, తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. అందుకే ఎప్పుడో ప్రారంభం కావలసిన మెట్రో దాదాపు ఒక దశాబ్ధం నిరీక్షణ తరవాత గాని జనానికి అందుబాటులోకి వచ్చింది. ఈనాటి హైదరాబాదీల స్వప్న సాకారానికి మెట్రోలో ప్రయాణానికి ఆనాడే దివంగత వైఎసార్ అంకురార్పణ వేశారన్న విషయాన్ని మనం స్మరించుకోవలసిన  అవసరాన్ని పలువురు గుర్తు చేసుకుంటున్నారు. భాగ్యనగరానికి మెట్రో మణిహారాన్ని బహూకరించిన వైఎసార్ నుంచి దాన్ని జాతికి అంకితం చేస్తున్న ప్రియతమ ప్రధాని నరెంద్ర మోడీ తెలంగాణా ముఖ్యమంత్రి అందరికీ వందనాలు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: