తెలుగు రాష్ట్రాల్లో జనసేన కు మంచి ఆదరణ ఉంది : పవన్

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ తమ్ముడు పవన్ కళ్యాన్ ‘అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.  మొదట్లో పెద్దగా విజయవంతమైన చిత్రాల్లో నటించకున్న తమ్ముడు, ఖుషి, జల్సా లాంటి చిత్రాలతో ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ సంపాదించారు.  ఇక గబ్బర్ సింగ్ చిత్రంతో మాస్ హీరోగా నెంబర్ వన్ రేస్ లోకి వెళ్లారు.  ఒకదశలో మెగాస్టార్ చిరంజీవి తర్వాత అంత మాస్ ఫాలోయింగ్ సంపాదించింది పవన్ కళ్యాన్ అనే చెప్పాలి.  అన్నయ్య బాటలోనే రాజకీయ రంగ ప్రవేశం కూడా చేశారు పవన్.  

సామాజిక సేవ చేయాలనే ఉద్దేశ్యంతో సార్వత్రిక ఎన్నికల సమయంలో ‘జనసేన’ అనే పార్టీ స్థాపించారు.  అయితే ఎన్నికల్లో మాత్రం నిలబడలేదు..అప్పట్లో టిడిపి, బిజెపి సపోర్ట్ చేశారు.  ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే ప్రజా సమస్యలపై పోరాడుతున్న పవన్ కళ్యాన్ గత కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారు.  ఇప్పటికే తిరుపతి, కాకినాడ, అనంతపురం జిల్లాలో భారీ బహిరంగ సభలు నిర్వహించారు. అంతే కాదు 2019 ఎలక్షన్స్ లో ‘జనసేన’ పార్టీ తరుపున పోటీ చేయబోతున్నట్లు తెలిపారు.  

ఇక తన పార్టీలో పేద బలహీన వర్గాలకు చెందిన యువతను తీసుకుంటున్నట్లు..వారికి సముచిత న్యాయం చేస్తానని అన్నారు.  ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీకి మంచి ఆదరణ లభిస్తోందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీలోని ఏడు జిల్లాలతో పాటు, తెలంగాణలోని గ్రేటర్ హైదరాబాద్ లో జనసేన పార్టీ ఎంపికలకు భారీ స్పందన వచ్చిందని చెప్పారు.

తెలుగు రాష్ట్రాల్లోని మిగతా జిల్లాల్లోనూ పార్టీ ఎంపికలు వేగంగా జరుగుతున్నాయని, ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.  అంతే కాదు ప్రస్తుతం ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించినట్టు పవన్ చెప్పారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: