ఆంధ్రాలో ఈ లేడీ ఐఏఎస్ అంటే.. అంతా హడల్.. మంత్రులతో సహా..!

Chakravarthi Kalyan
హీరోలు, హీరోయిన్లు సినిమాల్లోనే ఉండరు. అప్పుడప్పుడు నిజ జీవితాల్లోనూ ఉంటారు. ఐతే.. తాము హీరోలమని వాళ్లెప్పుడూ ఫీలవరు. అదే నిజమైన హీరోల లక్షణం. ఆంధ్రాలోని ఓ లేడీ ఐఏఎస్ ఆఫీసర్ కూడా అంతే. ఆమే పూనం మాల కొండయ్య. ద మోస్ట్ సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్ గా ఆమెకు చాలా మంచి పేరు ఉంది. ఏ శాఖలో బాధ్యత అప్పగించినా దాన్ని ప్రక్షాళన చేయడం ఆమె పని. 

గతంలో రవాణాశాఖ, పౌరసరఫరాల శాఖ వంటి ప్రజా సంబంధ శాఖల్లో పనిచేసినప్పుడు ఆమె గురించి కథలు కథలుగా వార్తలు వచ్చాయి. లంచాలు ముట్టరు. నిబంధనలు అతిక్రమిస్తే ఊరుకోరు. చివరకు న్యాయం అనే గీత దాటితే మంత్రులనూ సహించరు. ఐఏఎస్ ఆఫీసర్లంటే మంత్రుల పీఏలుగా.. వారి చేతుల్లో కీలుబొమ్మలుగా మారిపోవడం తెలుగు నేలపై కొన్నాళ్లుగా చూస్తున్నాం. 

పూనం మాల కొండయ్య.. నిప్పులాంటి అధికారి.. 


వైఎస్ అక్రమాస్తుల కేసులో ఎందరో ఐఏఎస్ ల పేర్లు ఎఫ్ ఐ ఆర్ లకు ఎక్కాయి. చాలా మంది కోర్టుల చుట్టూ తిరిగారు. అలాంటి ఈ రోజుల్లో పూనం లాంటి ఆఫీసర్లే ప్రజలకు కాస్త ఆశాదీపాలుగా ఉంటారు. తాజాగా ఆమె గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే.. ఆమె ప్రస్తుతం ఏపీ ఆరోగ్య వైద్యశాఖ ప్రధాన కార్యదర్సిగా ఉన్నారు. కొన్నాళ్లుగా విజయవాడలోని ప్రభుత్వాసుపత్రుల పనితీరుపై విమర్శల వస్తున్న సంగతి తెలిసిందే. 

ప్రసుతం ఆమె వాటి జబ్బు వదిలించే పనిలో పడ్డారు. అందుకే మూడు రోజులపాటు రాత్రీపగలూ తేడా లేకుండా తనిఖీలు చేశారు. రోగులకు వైద్య సేవలు అందడమే లక్ష్యంగా ప్రక్షాళనకు నడుంబిగించారు. ఆసుపత్రి ఉన్నతాధికార్లు, సిబ్బందితో మాట్లాడారు. సూపరెంటెండెంట్‌ సూర్యకుమారిని విధుల నుంచి తప్పించారు. ఆసుపత్రి పరిశీలనపై 60 రోజుల యాక్షన్ ప్లాన్ రూపొందించారు. రెండు నెలల్లో ఆసుపత్రుల్లో మార్పు తెచ్చి చూపిస్తానని ధీమాగా చెబుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: