ఆఫ్ట్రాల్ కాదు సర్: బుడ్డోడి డైలాగ్స్ పై రైల్వే శాఖ కన్ను!

frame ఆఫ్ట్రాల్ కాదు సర్: బుడ్డోడి డైలాగ్స్ పై రైల్వే శాఖ కన్ను!

ఎన్టీఆర్ - కృష్ణవంశీ కాంబినేషన్లో 2006 లో వచ్చిన 'రాఖీ' సినిమా చాలామందికి గుర్తిండే ఉంటుంది. ఈ సినిమా లో ఎన్టీఆర్ నటనకు అప్పట్లో విమర్శల ప్రశంసలు లభించాయి. కమర్షియల్ గా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయినా.. బుడ్డోడి కెరీర్ లో ఈ సినిమా ఒక అద్భుతమనే చెప్పాలి. ఎప్పుడో 2006 సినిమాపై ఇప్పుడెందుకు కథాకమీషు అంటారా? అక్కడికే వస్తున్నా...
రాఖీ సినిమాలో ఇండియన్ రైల్వే డిపార్ట్మెంట్ పై "ఆఫ్ట్రాల్ కాదు సార్" అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ అప్పట్లో మారుమోగిపోయింది.

దీంతో ఈ డైలాగులను ఇప్పుడు రైల్వే డిపార్ట్ మెంట్ ఉపయోగించుకోనుందని తెలుస్తోంది. తమ ప్రచారంలో భాగంగా రైల్వే శాఖ ఈ డైలాగులను ఉపయోగించుకోవాలని భావిస్తోందట. అందులోభాగంగా ప్రతి రైల్వే స్టేషన్ లోనూ రోజులో ఏదో ఒక సమయంలో స్టేషన్స్ లోని టీవీల్లో డైలాగ్ ను ప్రదర్శించాలని డిపార్ట్ మెంట్ భావిస్తోందట.

అంతే కాకుండా ఈ మద్య కాలంలో ఏ విషయాన్నైనా ప్రజల్లోకి తీసుకు వెళ్లాటంటే తమ అభిమాన హీరో కోట్టే డైలాగ్స్ ప్రచారాలు చేయడం వల్ల అది మరింత సులభం అవుతుందని భావిస్తున్నారు.  అయితే ఈ వార్తలో నిజమెంత ఉందనేది మాత్రం తేలాల్సి ఉంది. ఏదేమైనా ఒకవేళ ఈ వార్త నిజమైతే యంగ్ టైగర్ డైలాగ్స్ తో రైల్వే స్టేషన్స్ అదిరిపోవడం ఖాయమనే అనుకోవాలి!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: