రాయలసీమ : ఇద్దరూ చంద్రబాబు మాట వినటంలేదా ?

Vijaya



నంద్యాలలో మంగళవారం రెండు వర్గాల మధ్య జరిగిన స్ట్రీట్ ఫైట్ తో తెలుగుదేశంపార్టీ పరువు రోడ్డునపడింది. ఇద్దరు నేతలు ఏవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మద్దతుదారులు రోడ్డుమీద అందులోను లోకేష్ సమక్షంలోనే ఒకళ్ళపై మరొకళ్ళు దాడి చేసుకున్నారు. ఇద్దరు ఒకళ్ళపై మరొకళ్ళు కేసులు పెట్టుకోవటం ఇపుడు కీలకమలుపు తిరిగింది. ఇద్దరినీ రాజీచేసి కేసుల ఉపసంహరణకు చంద్రబాబునాయుడు ప్రయత్నించినా ఇద్దరూ వినలేదని సమాచారం.



లోకేష్ దగ్గర తన మద్దతుదారులతో  అఖిల ఉన్నపుడే ఏవీ తన వర్గంతో వచ్చారు. దాంతో మండిపోయిన అఖిల తన మద్దతుదారులను ఉసిగొల్పారు. దాంతో మద్దతుదారులు ఏవీతో పాటు ఆయన మద్దతుదారులపై దాడిచేశారు. ఏవీ చొక్కాను చించేసి మొహంపైన పిడిగుద్దులు కురిపించారు. దాంతో ఏవీ నోటీపైన బాగా దెబ్బలు తగిలి ఒక పన్ను రాలిపోయిందంటున్నారు. దాంతో పోలీసులు రంగ ప్రవేశచేసి ఏవీని వెంటనే ఆసుపత్రికి తరలించారు. తర్వాత ఏవీ పోలీస స్టేషన్ దగ్గరకు వెళ్ళి అఖిల+మద్దతుదారులపై హత్యాయత్నం ఫిర్యాదు చేశారు.



దాంతో పోలీసులు మాజీమంత్రితో పాటు మరో నలుగురిపై హత్యాయత్నం కేసు నమోదుచేసి అదుపులోకి తీసుకున్నారు. వెంటన అఖిల కూడా ఏవీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏవీ మద్దతుదారులు తమపై దాడిచేసిన తర్వాతనే ఆత్మరక్ష కోసమే తాము దాడిచేసినట్లు ఫిర్యాదులో చెప్పారట. ఏదేమైనా ఇటు ఏవీ అటు అఖిల ఇద్దరు ఒకళ్ళపై మరొకళ్ళు కేసులు పెట్టుకోవటాన్ని చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారు. ఇద్దరిమధ్య నచ్చచెప్పటానికి ఎంత ప్రయత్నించినా సాధ్యంకాలేదట.



అసలు తప్పంతా లోకేష్ దే అని నేతలంటున్నారు. ఏవీ, అఖిల ఇద్దరి మధ్య సంబంధాలు ఉప్పునిప్పులాగుందని అందరికీ తెలుసు. అలాంటిది ఇద్దరినీ ఒకేసారి లోకేష్ ఎలా రమ్మంటారని కొందరు తమ్ముళ్ళు అడుగుతున్నారు. ఇద్దరినీ విడివిడిగా రమ్మని చెప్పుంటే ఇపుడీ గొడవ జరిగుండేది కాదు పార్టీ పరువు రోడ్డునపడుండేది కాదంటున్నారు. కాబట్టి తాజా ఘటనకు పార్టీ నాయకత్వం కూడా బాధ్యత వహించాల్సిందే అని కొందరంటున్నారు. మరి చివరకు ఈ వివాదం ఎలా ముగుస్తుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: