అమరావతి : పవన్ ఢిల్లీ టూర్ రివర్స్ కొట్టిందా ?

Vijaya


జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ టూరును చూసిన తర్వాత ఇదే అనుమానం పెరిగిపోతోంది. 48 గంటలు పవన్ ఢిల్లీలోనే ఉన్నా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అపాయిట్మెంట్ దొరకలేదు.  పవన్ మాటలు ఎలాగుంటాయంటే తాను ఢిల్లీకి ఎప్పుడు వెళ్ళినా నరేంద్రమోడీ వెంటనే అపాయిట్మెంట్ ఇచ్చేస్తారని, తాను ఢిల్లీలో అడుగుపెడితే చాలు మంత్రులందరు తనకు రెడ్ కార్పెట్ పరుస్తారన్నట్లుగా ఉంటుంది. అయితే పెద్దఎత్తున ప్రయత్నం చేసిన తర్వాతే నడ్డా అపాయిట్మెంట్ దొరికిందట. 



ఇపుడే కాదు చాలాకాలంగా మోడీ, అమిత్ ఇద్దరు కూడా పవన్ కు అపాయిట్మెంట్ ఇవ్వటంలేదు. గతంలో కూడా మూడు నాలుగుసార్లు ఢిల్లీలో వెయిట్ చేసి ఇద్దరి అపాయిట్మెంట్లు దొరక్క చివరకు తిరొచ్చేసిన విషయం అందరికీ తెలిసిందే. తాజా టూరులో ఏపీ ఇన్చార్జి మురళీధరన్ తో రెండుసార్లు, జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ తో మాత్రమే భేటీ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి మీద, ఏపీ బీజేపీ నేతలపై ఫిర్యాదు చేయటం, టీడీపీతో పొత్తు విషయాన్ని ఫైనల్ చేసుకోవటం కోసమే పవన్ ఢిల్లీకి వెళ్ళినట్లు తెలుస్తోంది.



పనిలోపనిగా కర్నాటక ఎన్నికల్లో పవన్ను ప్రచారం చేయమని నడ్డా కోరినట్లు తెలిసింది. అయితే అందుకు పవన్ షరుతు పెట్టారట. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబునాయుడుతో పొత్తు పెట్టుకోవాలని అడిగారట. అందుకు నడ్డా ఏమీ సమాధానం చెప్పకుండా దాటేశారంటున్నారు. ఎందుకంటే పొత్తుల విషయం తేల్చాల్సింది నరేంద్రమోడీనే కానీ నడ్డాకాదు. చంద్రబాబుతో కలవటం మోడీకే ఇష్టంలేనపుడు నడ్డా ఏమి చేయగలరు ?



దాంతో కర్నాటక ప్రచారం విషయంలో పవన్ కూడా ఏమీ చెప్పకుండానే వెనక్కి వచ్చేశారట. అందుకనే నడ్డాతో సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడినపుడు పవన్ మొహంలో సంతోషం కనిపించలేదు. ఏదో తెచ్చుపెట్టుకున్న నవ్వుతో రెండు నిముషాలు తప్పదుకాబట్టి మాట్లాడేసి వెళ్ళిపోయారు. దీంతోనే పవన్ ఢిల్లీ టూర్ ఫెయిల్యూర్ అని అర్ధమైపోతోంది. తాను ఒకటనుకుని ఢిల్లీకి వెళితే అది రివర్సు కొట్టిందనే బాధ పవన్లో కనబడింది. బీజేపీ కోరుతున్నట్లు కర్నాటకలో ప్రచారానికి వెళితే బీజేపీతో పొత్తుకే తాను కమిట్ అయివున్నట్లు అవుతుందన్నది పవన్ ఆలోచనగా చెబుతున్నారు.  మరి పొత్తులపై ఎప్పుడు ఫైనల్ చేస్తారో చూడాల్సిందే.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: