అమరావతి : జగన్ ప్రభుత్వం అమరావతి భూములు అమ్మేస్తోందా ?

Vijaya


వివిధ అవసరాలకోసం అమరావతి భూములను వేలంద్వారా అమ్మేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం రాజధాని అమరావతి వ్యవహారం సుప్రింకోర్టు విచారణలో ఉంది. అంటే ఈ భూములన్నీ వివాదంలో ఉన్నట్లే అనుకోవాలి. జగన్మోహన్ రెడ్డేమో మూడురాజధానుల కాన్సెప్టును తెరమీదకు తెచ్చారు. విశాఖపట్నంను ఎగ్జిక్యూటివ్ క్యాపిటిల్ గా చేయబోతున్నారు. దీన్ని అమరావతి ప్రాంతంలోని రైతులు+టీడీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకనే దీనిపై వివాదాలు పెరిగిపోయి కోర్టు మెట్లెక్కింది.



అమరావతి ప్రాంతంలోని భూములంతా వివాదాస్పదమైతే మరి ప్రభుత్వం 14 ఎకరాలను ఈ వేలం ద్వారా అమ్మేందుకు ఎలా నిర్ణయించిందో అర్ధంకావటంలేదు. కాజ-గుండుగొలను బైపాస్ రోడ్డు పక్కనే ఉన్న నవులూరు గ్రామంలోని 10 ఎకరాలను అమ్మాలని డిసైడ్ చేసింది. ఇక్కడ ఎకరా రు. 5.94 కోట్లుగా ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కనే ఉన్న పిచ్చుకలపాలెం గ్రామంలోని 4 ఎకరాలను అమ్మబోతోంది. ఇక్కడ ఎకరా ధర రు. 5.41 కోట్లుగా డిసైడ్ చేసింది.



పై 14 ఎకరాలను ఈ వేలంద్వారా అమ్మేందుకు సీఆర్డీఏ ఫైల్ ను సిద్ధంచేసింది. నిజానికి సీఆర్డీఏ రద్దుకు గతంలో ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు అడ్డుకోవటంతో వెనక్కుతగ్గింది. తర్వాత కొంతకాలం ఆగి మళ్ళీ సుప్రింకోర్టులో కేసు వేసింది. అమరావతి భూముల డెవలప్మెంట్, సీఆర్డీఏ రద్దు, రాజధాని నిర్మాణం, రైతులకు డెవలప్ చేసిన స్ధలాలు ఇవ్వటం అన్నీ వివాదంలోనే ఉన్నాయి.



అమరావతి భూములను ఈ వేలంద్వారా అమ్మేందుకు ప్రభుత్వం గతంలో కూడా ప్రయత్నించి చివరి నిముషంలో ఎందుకనో ఆగిపోయింది. మళ్ళీ ఇంతకాలానికి 14 ఎకరాలను ఈ వేలం ద్వారా అమ్మకానికి రెడీ అవుతోంది.  జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని ప్రాంతంలో ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు. అన్నీరకాల నిర్మాణాలను ఆపేసిన ప్రభుత్వం ఇపుడు అవే భూములను అమ్మి సొమ్ముచేసుకోవాలని ప్రయత్నిస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది. అయినా ఇంత అర్జంటుగా భూములను అమ్మి ఎందుకు సొమ్ము చేసుకోవాలని అనుకుంటున్నదో అర్ధంకావటంలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: