గోదావరి : కమ్మోరే చంద్రబాబుకు ఎదురు తిరుగుతున్నారా ?

Vijaya



తెలుగుదేశంపార్టీలో విచిత్రమైన పరిణామాలు జరుగుతున్నాయి. కమ్మోరే పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు ఎదురు తిరిగేట్లున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే వారం రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో పెద్దాపురం నియోజకవర్గంలో నిమ్మకాయల చినరాజప్పే మళ్ళీ పోటీచేస్తారని చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటినుండి నియోజకవర్గంలో పరిస్ధితి ఏమీ బాగాలేదు. ఇక్కడ గమనించాల్సిందేమంటే నియోజకవర్గంలో కమ్మ డామినేషన్ చాలా ఎక్కువ. ఇలాంటి నియోజకవర్గంలో కాపు నేతకు టికెట్ ఇవ్వటాన్ని కమ్మోరు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు.



ఇక్కడినుండి 1994,99లో  రెండుసార్లు బొడ్డు భాస్కర రామారావు ఎంఎల్ఏగా పనిచేశారు. తర్వాత 2004, 09లో రెండుసార్లు ఓడిపోయారు.  తర్వాత నియోజకవర్గంలో పరిస్ధితులు బాగా లేకపోవటంతో బొడ్డును పక్కనపెట్టి చంద్రబాబు అమలాపురంకు చెందిన నిమ్మకాయల చినరాజప్పకు టికెట్ ఇచ్చారు. 2014,19లో రెండుసార్లు నిమ్మకాయల గెలిచారు. 2014లో బొడ్డుకు పార్టీలో వ్యతిరేకత పెరిగిపోవటంతో వైసీపీలో చేరి ఎంఎల్సీ అయ్యారు. అయితే చంద్రబాబు రమ్మనటంతో తిరిగి టీడీపీలో చేరారు.



2019 ఎన్నికల్లో నిమ్మకాయలకు కాకుండా తన కొడుకు బొడ్డు వెంకట రమణ చౌదరికి టికెట్ ఇస్తానని హామీ ఇచ్చిన తర్వాతే రామారావు టీడీపీలో చేరారట. అందుకనే పోయిన ఎన్నికల్లో కొడిక్కి టికెట్ ఇవ్వాలని పట్టుబట్టారు. అయితే అప్పట్లో చంద్రబాబు ఏదో సర్దిచెప్పి మళ్ళీ నిమ్మకాయలకే టికెట్ ఇచ్చారు. తర్వాత రామారావు చనిపోవటంతో కొడుకు బాగా యాక్టివ్ అయ్యారు. 2024లో తనకే టికెట్ ఇస్తానని చంద్రబాబు అప్పట్లో ఇచ్చిన హామీ ప్రకారమే తాను పార్టీలో యాక్టివ్ అయినట్లు చెప్పుకుంటున్నారు.



కానీ మొన్నటి పర్యటనలో నిమ్మకాయలకే చంద్రబాబు టికెట్ ప్రకటించారు. దాంతో కమ్మోరంతా మండుతున్నారు. మొదటినుండి నిమ్మకాయలకు కమ్మోరు నుండి తీవ్ర వ్యతిరేకత ఎదువుతోంది. వచ్చేఎన్నికల్లో టికెట్ తమకే ఇస్తారు కదాని ఓపికపట్టారు. అయితే అనూహ్యంగా నిమ్మకాయలకే టికెట్ ప్రకటించటంతో కమ్మోరికి  షాక్ కొట్టినట్లయ్యింది. అందుకనే భవిష్యత్ ప్రణాళికలపై వారంరోజుల్లో కమ్మ ప్రముఖులంతా ఈమధ్యనే మూడుసార్లు సమావేశమయ్యారట. వ్యవహారం చూస్తుంటే చంద్రబాబుకు డేంజర్ సగ్నల్స్ పంపేట్లే ఉన్నారు. చివరకు ఏమవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: