అమరావతి : కూతుర్లను కూడా నారాయణ ఇరికించేస్తున్నారా ?

Vijaya



అమరావతి భూ కుంభకోణంలో మాజీమంత్రి నారాయణ తాను ఇరుక్కోవటమే కాకుండా తన ఇద్దరు కూతుర్లను కూడా నిండా ముంచేట్లుగానే ఉన్నారు. రెండురోజులుగా నారాయణ ఇద్దరు కూతుర్లు శరణి, సింధూర ఇళ్ళలో ఏపీ సీఐడీ పోలీసులు సోదాలు చేశారు. వీళ్ళ ఇళ్ళే కాకుండా వీళ్ళ దగ్గర బంధవులు, ఫ్రెండ్స్ ఇళ్ళపైన కూడా దాడులు చేసి సోదాలు చేశారు. భూముల కొనుగోలుకు సంబంధించి  బంధువుల ఇళ్ళల్లోని ఒక ఇంట్లో కీలకమైన ఆడియో టేపు ఆధారాలు దొరికినట్లు సమాచారం.



అమరావతి ప్రాంతంలో నారాయణ అనేకమంది పేర్లతో సుమారు 66 ఎకరాలు కొన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే మరో 170 ఎకరాల అసైన్డ్ భూములను కూడా సొంతం చేసుకున్నది. 66 ఎకరాలను అక్రమ పద్దతిలో నారాయణ కొన్నారని ప్రభుత్వం చెబుతుంటే దానికి అదనంగా అసైన్డ్ భూముల కొనుగోలు మరో పెద్ద సమస్యగా మారబోతోంది. అసైన్డ్ ల్యాండ్ అంటే ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే భూములు. వీటిని ఎవరు కొనకూడదు. ఒకవేళ కొంటే అది పెద్ద నేరంగా పరిగణిస్తరు.



అలాంటిది అమరావతి పరిధిలో ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన భూముల్లో నారాయణ 170 ఎకరాలను కొన్నారని ఆధారాలతో సహా దొరికినట్లు సమాచారం. దీనికి అవసరమైన డబ్బును నారాయణ ట్రస్టు, నారాయణ విద్యాలయం తదితర ఖాతాల నుండి డబ్బులు బదిలీ అయినట్లు సీఐడీ ఆధారాలను సేకరించింది.




అలాగే నారాయణ-శరణి మధ్య మనీ రూటింగ్ ఎలా చేయాలనే విషయమై జరిగిన సంభాషణల ఆడియో దొరికింది. మనీ రూటింగ్ ఎలా చేయాలనే విషయంలో కూతురుకు నారాయణ వివరంగా ఫోన్లోనే స్టెప్ బై స్టెప్ మార్గాలను చెప్పారట. దాని తర్వాతే ఖరీదైన భూములను అనేకమంది పేర్లతో కూతురు కొన్నది అనేందుకు సీఐడీకి ఆధారాలు దొరికాయట. దొరికిన ఆధారాలను బట్టి నారాయణ తాను కేసుల్లో ఇరుక్కోవటమే కాకుండా తనతో పాటు కూతుర్లను కూడా వివిధ కేసుల్లో ఇరికించినట్లు అర్ధమవుతోంది. నారాయణ ఇప్పటికే బెయిల్ పై బయటున్నారు  మరి కూతుర్ల పరిస్ధితి ఏమవుతుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: